మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

16, డిసెంబర్ 2010, గురువారం

బాంబే ....

పాపాయి నేను కథ చెప్పుకుంటున్నాం .ఆ కథలో ఒక చోట "చెడ్డ ఆత్మ అని వచ్చింది .పాపాయి అడిగింది చెడ్డ ఆత్మ అంటే ఏందమ్మ... అని ఏం చెప్పాలి ,అందుకని కాస్త ఆలోచించి చెడ్డ బుద్ది ఉండటాన్ని చెడ్డ ఆత్మ
అన్నాను .చెడ్డ బుద్ధి అంటే ఎట్లాంటిది అన్నది .ఎందుకో గబుక్కున బాంబే లో బాంబులు వేసిన వాళ్ళు గుర్తొచ్చి ,వాళ్ళ గురించి చెప్పి వాళ్ళది చెడ్డ బుద్ది ,అంటే చెడ్డ ఆత్మ అని చెప్పాను,పాపాయి అన్నదీ ..అందుకేనా అమ్మ బాంబే కి ఆ పేరొచ్చింది అని .అంటే బాంబులు వేసారు కనక బాంబే అన్నమాట .బాగుంది కదా పోలిక.


14, డిసెంబర్ 2010, మంగళవారం

చంద మామ -చామంతి పువ్వు


మేఘాల కోసమని

మేఘాన్నై,తూనీగనై


ఎగురుతుంటే


రెక్కలనెవరో


కత్తిరించారు



కాలం నలిపి


పడేసిన కాయితమై


రస రంగుల లోకం


ఒకే ఒక్క పువ్వైంది


గులాబి పూల పాదాల


చేప కళ్ళ చామంతి పువ్వు



పెద్దరికాన్నయ్


నేనే కావలింతనై


నను పాపని చేసిన


వెచ్చని ,పాలుమాలిక


కావిలింతని విడిచి


చీకటి


సూర్యుడై పూయడం


చూస్తున్నా



బాయి బంధానికి


బంధీనై


కన్నకడుపుల కష్టాన్ని


పునః దర్శిస్తూ


చెట్టుకు చిక్కిన గాలి పటంలా


రెప రెప లాడుతుంటే .....


అజ్ఞాత వాసాన్ని


చూడ వచ్చిన స్నేహితుడు


అమ్మ తనమింకా


తెలీని వాడు ,అన్నాడు


కొత్త కవిత్వమేం చదివావని

చదవడానికిప్పుడు


కవి సమయాలు లేవు


అన్నీ


పిల్ల సమయాలే !







8, డిసెంబర్ 2010, బుధవారం

మా "శాంతి "గురించి .......


మా అమ్మాయికి అక్కలు ముగ్గురున్నారు శాంతి ,కాంచన,రాజ మల్లిక.....బ్లాగ్లో మా శాంతిని కొంచం పలకరించండి అని రాసుకున్నానే కానీ ఒక్క పోస్ట్ కూడా పెట్ట లేదు .శాంతి మా గొర్రె .మా ఇంట్లో రెండు కుక్కలు , ఒక గొర్రె ,రెండు పెద్ద బాతులు ,మూడు చిలుకలు ,రెండు కుందేళ్ళు చాలా పావురాళ్ళు ఉండేవి .ఇప్పుడు కేవలం కాంచు ,రాజాలు మాత్రమే ఉన్నాయ్ .ఎందుకో మళ్లీ చెప్తాను .మా ఊళ్ళో గొర్రెలు పొడవుగా ఉంటాయి .బెంగాల్లో గొర్రెలు పొట్టిగా బొచ్చు బొచ్చుగా క్రీస్తు దగ్గర ఉంటుందే గొర్రె పిల్ల అలా ఉంటాయి .ఒక -సారి నేను నా భర్త వాకింగ్ కి వెళుతుంటే ఒక దగ్గర రోడ్డు పక్కన గొర్రెల గుంపు ఒకటి రెస్ట్ తీసుకుంటూ ఉండింది .నేను వాళ్ళతో ముచ్చట పెట్టా,నాకొక గొర్రె పిల్లనిస్తారా అని .వాళ్ళు మాకు గొర్రె పాలతో చాయ్ చేయడం మొదలు పెట్టారు .

అంతలో అమ్మ లేని ఒక చిన్ని పాపాయి నా వడిలో కూర్చుంది సొంతంగా వచ్చి .నేనింక వాళ్ళని పీకడం మొదలు పెట్టా దాన్ని నాకిచ్చేయమని .వాళ్ళు మేం కేవలం పని వాళ్లమేనని యజమానిని అడిగి ఇస్తామని రొండు రోజుల్లో వచ్చేస్తామని చెప్పారు .వాళ్ళు నన్ను చిన్న పిల్లని చేసి అబద్దాలు చెప్పారని నాకు రొండు రోజుల తరువాత అర్థమైంది .నేను భాద పడటం చూసి మా ఆయన సరేలే వేరే దగ్గర కొనుక్కున్దువు కానీ అన్నాడు .

అప్పుడు నేను మా అమ్మాయి కలిసి ఆదివారం సంతకి వెళ్ళాం .బెంగాల్లో వారంలో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో సంతలు జరుగుతాయి .ఆవులు గొర్రెలు ఇంకా అన్ని వస్తువులు అమ్ముతారు .మేం వెళ్ళాం కదా .అక్కడ చాలా గొర్రెలు ఉన్నాయి .అప్పటికే నా స్నేహితురాలు చెప్పింది మగదైతే మనం కూర్చుని ఉన్నప్పుడు తలతో డీ కొడుతుంది ,పాపాయి ఉంది కదా అని .వాళ్లకి చాలా గొర్రెలు ఆవులు ఉన్నాయి తను స్వయంగా పసుల కాపరి కూడా అందుకే చాలా అనుభవం .అదీ కాక నాకు అమ్మాయిలంటేనే ఇష్టం .సరే సంతకి వెళ్ళాం కదా అటు ఇటు తిరిగి చూశాం .మా శాంతి కనిపించింది .మా శాంతి ఎంత అందమైనదంటే ఎలా చెప్పాలి ...పోలిక రాటం లేదు. ఆ అందానికి ఆశ్చర్య పడి ,తెచ్చేసుకుని స్నానం పోసేసి ,శాంతి అని పేరు పెట్టుకున్నాం .

దానికప్పుడు నాలుగు నెలలు ఇప్పుడు మూడేళ్ళు .మా అమ్మయితోనే తిరిగేది .ఎటు వెళితే అటు .శాంతి అంటే వచ్చేస్తుంది .దానికి గడ్డి తినడం అస్సలు నచ్చదు.దోసలు ,మురుకులు వంటివి చాలా ఇష్టం .కానీ పాపం చాలా అనారోగ్యం చేసేస్తుంది .అప్పుడు పాపాయి వాళ్ళ నానకి చాలా పని ఔతుంది .ఒక్కో సారి అంటే ఆది వారాలు నానకూడా ఇంట్లో ఉండిఅందరం కనపడితే దానికి చాలా సంతోషం వేసి డాన్స్ చేస్తుంది .దాని తరువాత మేం కాంచన రాజ మల్లికాలని తెచ్చాం .వాళ్ళ ముగ్గరికి మంచి స్నేహం .ఎప్పుడు కలిసే ఉంటారు .నేను పొద్దుటే పూజ పూర్తి చేయగానే మా శాంతి దేవుడుకు పెట్టిన పూలన్నీ ఒక్కటి ఉంచకుండా తినేస్తుంది మా కాంచు కొబ్బరి చిప్ప పట్టి కేళి పోతుంది మా రాజమ్మ మాత్రం చాలా డీసెంట్ .దానికిలాటి పనులు అసలు నచ్చవ్. కానీ బాధ ఏమిటంటే ముగ్గరూ మాతోనే బెడ్ రూం లోనే ఉండాలంటారు .శాంతి కేమో చాలా సార్లు ఉష్హు వస్తాయి అదో కష్టం .పాపాయి వాళ్ళ నానకి పోయిన సారి బదిలీ అయినప్పుడు అస్సలు గడ్డి దొరకక చాలా కష్ట పడ్డాం.అందుకని శాంతిని ,రాజ హంసలని ,ఈ ఊళ్ళో విపరీతంగా నక్కలున్టాయన్నారు అందుకని కుందేళ్ళని కొన్ని పావురాలని మా ఊరికి పంపాం.పాపం బిడ్డ రాజమండ్రి వరకు లారీలో తరువాత కారులో దాదాపు 2000 కిలో మీటర్లు .ప్రయాణించి వెళ్ళింది .దాని అందం దానికెంత కష్టం తెచ్చింది కదా .



మా పెదమ్మకి దాంతో చాలా అనుబందం ఇప్పుడు .బిడ్డ లాగా .మా ఊర్లో ఇటువంటి గొర్రెలు ఉండవు కదా అందుకని వార్త జిల్లా పేపర్లో దాని ఫోటోవేసి వార్త రాసారు .కానీ మా అమ్మాయికి ఇప్పుడు శాంతి అంటే చాలా కోపం .ఎందుకంటే అదిప్పుడు మా పెదమ్మ ఎటు వెళితే అటు వెళుతుంది .మా అమ్మాయి పిలుస్తే వెంటనే కూడా పలకదు .నా కూతురు అది గుర్తొచ్చినప్పుడల్లా తిడుతుంది. నా బ్లాగ్లో ఉండి కదా అక్కడ చూసినప్పుడు కూడా తిడుతుంది .అస్సలు నేనింక దానితో మాట్లాడనే మాట్లాడను అని ఒట్టు కూడా పెట్టు కున్నది .ఒక్కో సారేమో శాంతిని తెప్పించు అమ్మాఅని అడుగుతుంది .తెప్పించాలి ఏంటో ఈ జీవితం కుదురుగా ఒక దగ్గర ఉండి అందరిని చూసుకుంటూ ఉండలేక పోతున్నానే అనే దిగు లు ఒక్కోసారి చాలా ముంచేస్తుంది .






7, డిసెంబర్ 2010, మంగళవారం

పెన్సిల్ దొంగలు ....

పాపాయి బడికి వెళ్ళడం మొదలు పెట్టింది కదా ,ఈ సారి కొంచం దీర్ఘంగానే వెళుతుంది .ప్రతి రోజు ఇంటికి రాగానే చెపుతుంది ,అమ్మ నా పెన్సిలెవరో దొబ్బేసారమ్మఅని [డిగ్రీ లో నాకో ఫ్రెండ్ ఉండేది కడప పిల్ల వాళ్ళు ఎవరైనా తీసుకున్నారనో. వెయ్యమనో చెప్పడానికి దొబ్బడం అని వాడుతారు తలుపు వెయ్యి అంటే తలుపు దొబ్బెయ్ ..అని ఇట్లాగ అనమాట ,నేనా మాట కేచ్ చేసి నా కూతురికి కూడాభోదించాను }నాకు ఆశ్చర్యం వేస్తుంది ,మరీ రోజు ఎలా కొట్టేస్తారని .లేదే నువ్వే ఇచ్చేస్తున్నావ్ అంటాను ,కాదమ్మా అంటుంది .ఈ మధ్య వాళ్ళ క్లాస్స్ మేట్ మాతోనే వస్తుంది ,ఆ పిల్ల వచ్చి రాగానే చెప్తుంది నా పెన్సిల్ చురీ అయిందని వాళ్ళ అమ్మతో .నాక్కొంచెం అర్థమైంది .అందరికీ ఇదే ప్రోబ్లం అని .ఇంకో రోజు చెప్పింది పాపాయి, అమ్మ.... నా హానీ లూప్స్ స్కేలు సుమన్ దగ్గిర ఉండింది ,ఇది నా స్కేలు అంటే ఆ పిల్ల ఆహా ఇది నా తమ్ముడుది కావాలంటే చూడు నా తమ్ముడు పేరు కూడా అందమ్మా . కానీ అది నా స్కేలే అమ్మా అంది .సరే పోనీలేవే అన్నానా, మరుసటి రోజు ఒక కొత్త పెన్సిల్ పటుకొచ్చింది .అమ్మా .. సుమన్ పెన్సిల్ తెచ్చేసా అంది. అలా తప్పు కదా రా బంగారు! ఒకరు తప్పు చేస్తే మనమూ చెయ్యొచ్చా అన్నాను ,ఆ .....అయితే ఆ పిల్ల నా స్కేలు దొబ్బెయలా అమ్మ ..అంది సమ న్యాయ సిద్ధాంతం ప్రతిపాదిస్తూ ..నేను చాలా దిగులు పడ్డాను ,తరువాత ట్యూషన్ టీచర్ చెప్పింది ,అదేం అంత దిగులు పడాల్సిన విషయం కాదు నా దగ్గర పిల్లలందరూ ఇలాగే పాపం మొదట్లో మా పెన్సిల్ పోయిందని చెప్పుకుంటారు కొన్ని రోజులకి నేను ఫలానా వాళ్ళ పెన్సిల్ తీసుకొచ్చేసానని చెప్తారు .ఏం పర్లేదు కొన్ని రోజులు పోతే వాళ్ళే తెలుసు కుంటారని అంది.
కానీ పిల్లలెంత మంచి వాళ్ళు నేను ఫలానా వాళ్ళ పెన్సిల్ తెచ్చేసానని మన దగ్గర ఎంత ముద్దుగా చెప్తారు ,అలా చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా .. అమాయకత్వం అంత అందమైనది అందుకే మనం పిల్లల్ని అంత ప్రేమిస్తాం .

3, డిసెంబర్ 2010, శుక్రవారం

కూచ్ బీహార్ "రాస్ మేళా."...చూడండి

మేమిప్పుడుంటున్నఈ కూచ్ బిహార్ రాజ మాత గాయత్రి దేవి పుట్టినిల్లు .( రాజ వంశం గురించి మరెప్పుడైనా రాస్తాను )బెంగాలీల సంస్కృతిలో ఒక <విశిష్టత మేళాలు .శాంతి నికేతన్ లో ప్రతి ఏటా జరిగే "పౌష్ మేళ "చాలా ప్రఖ్యాతి గాంచింది .బెంగాల్ లో ప్రతి ప్రాంతం లోనూ ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను అనుసరించి మేళా లు జరుగుతాయి .కూచ్ బిహార్ లో జరిగే మేళా పేరు "రాస్ మేళా " మేళా మదన మోహనుడు అనే పేరిట ఉన్న రాజుల కుల దైవం కృష్ణుని కోసం జరుగుతుంది . మందిరం 1890 ప్రాంతంలోది కాగా మేళా 1912 ప్రాంతం నుండి మొదలైంది .ప్రతి ఏటా కార్తీక పున్నమి నాడు ప్రారంభమయ్యే మేళా 15 రోజుల పాటు సాగుతుంది .ఒక కిలో మీటర్ పరిధిలో 1500 వరకు దుఖాణాలు బారులు తీరుతాయి . జిల్లా అస్సాం తదితర రాష్ట్రాలకు బోర్డర్ కాడం చేత ఆయా ప్రాంతాల ప్రజలు మేళాను దర్శిస్తారు .మందిరంలో "రాస్ చక్ర "తిప్పడంతో రాస్ పూర్ణిమ మొదలవ్తుంది . రాస్ చక్ర 40 అడుగుల పొడవు వుంటుంది .సాంప్రదాయంగా దశాబ్దాల నుంచి ఒక ముస్లిం కుటుంబం దీన్ని నిర్మిస్తుంది . రాస్ చక్రం పూల> కృష్ణుని బొమ్మలతో నిండి ఉంటుంది .ప్రజలు క్షేమ ,లాభ, ఐశ్వర్యాల కోసం దీన్ని తిప్పుతారు . సమయంలో కృష్ణుడు మందిరం లో నుండి వెలుపలికి వచ్చి చక్కగా బంగారపు గొడుగు వేసుకుని కన్నుల పండువ చేస్తాడు .{రాజుల కాలం నాటి అసలు విగ్రహం చోరీ ఐంది ఇప్పుడున్నది కొత్త విగ్రహం }మందిరం ఆవరణంలో వివిధ పురాణ ఘట్టాల బొమ్మలు కొలువు తీరుతాయి


ఇకపోతే మేళాలో అనేక రకాల దుఖాణాలు కనపడుతాయి చెప్పుల నుండి హుండీల వరకు తిను బండారాల నుండి ఖరీదైన బంగ్లా దేశ్ నేత చీరల వరకు ,ఇంకా ప్రభుత్వం ప్రమోట్ చేసే కొన్ని విషయ సంభంద దుఖాణాలు ,సర్కస్ ప్రజలని సంతోష పెడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కోసం రాత్రి పూట నడిచేట్లు బస్సులు .రాత్రి బస చేసేందుకు ప్రభుత్వ అతిధి గృహాలు ఉంటాయి .15 రోజుల తరువాత ప్రభుత్వం బలవంతంగా మేళాని తొలగిస్తుంది .అప్పటి వరకు ప్రజలు వస్తూనే ఉంటారు
%;">నేనూ అమ్మాయి మేళాకి వెళ్లాం అది రోజూ వెళ్తూనే ఉంటుంది .రంగుల రాట్నాలు ఎంత తిరిగినా దానికి తనివి తీరదు .నిన్న వచ్చేటప్పుడు నానకి ,తాతకి ఇంకసలు ఎవ్వరి చెప్పకూడదని ఒట్టు పెట్టించుకుని నాకో విషయం చెప్పింది .ఏమంటే అది కూచ్ బిహార్ కే కలక్టర్ అవుతుందంట ,రాస్ మేళా లో చాలా రోజులు రంగులరాట్నాలుతిరుగుతుందంట . రాస్ మేళ ఎన్ని రోజులైనా అట్లాగే ఉన్చేస్తుందట .అందరూ ఆనంద పడతారు కదా అంది .మేళాలో అది గులాబి రంగులో ఉండే పీచు మిటాయి కావాలంది తీసిచ్చాక గుర్తొచ్చింది నానకి తెలిస్తే ఇద్దరి తోలూ వలిచేస్తాడని .ఎందుకంటే దానికి చాలా రోజులు జ్వరం వచ్చింది .అందుకని దానికి చెప్పాను నానకి చెప్పోద్దోరెయ్ మనం అని. పాపాయి వెంటనే ఒప్పుకుంది మళ్ళీ నేనే ఆలోచించి వద్దులే తప్పు చేసినా నిజమే చెప్పాలి కదా మనం అన్నాను .అప్పుడది చెప్పింది, ఏమీ కాదమ్మా అబద్దాలు చెప్పచ్చు. అవ్వ {అంటే మా అమ్మమ్మ }చెప్పింది ఈ ప్రపంచంలో ఒంద అబద్ధాలైన చెప్పచ్చోని అంది .మా అమ్మమ్మ అదీ ఏదేదో మాట్లాడుకునే వాళ్ళు .ఎప్పుడో ఈ భోధ చేసి ఉంటుంది ఆమె . నా బిడ్డ అది గుర్తు ఉంచుకోవడమే కాక ఎప్పుడు అప్లై చెయ్యాలో అపుడే అప్లయ్ చేసింది .అందరూ అంటారు నీ బిడ్డ ఏక సంతాగ్రాహి అని నిజమేనేమో అనిపించింది .

























































































































































































































































































<





2, డిసెంబర్ 2010, గురువారం

ఇస్మాయిల్


25 తేదీన ఇస్మాయిల్ కోసం బ్లాగ్లో రాయాలనుకున్నాను .ఇస్మాయిల్ కవిత్వమంటే నాకు విపరీతమైన ఆకర్షణ .గొప్ప వ్యక్తుల్ని కవుల్ని కలిసి చూడటం నాకెప్పుడూ ఆసక్తిగా అనిపించదు ,కానీ చలాన్ని ,ఇస్మాయిల్ ని కలవగలిగి ఉంటె బాగుండనిపిస్తుంది.ఇక తీరని కోరిక .ఇస్మాయిల్ కవితలలో నాకు బాగా ఇష్టమయింది ఒకటి ఇక్కడ ........

వేయి పిర్రల సముద్రం


ఊగుతోంది వేయి పిర్రల సముద్రం

ప్రియా ,నిర్ణిద్రం

లాగుతుంది స్మృతి నౌకను ఉప్పాడకు

ప్రియా, నీ జాడకు



మొగ్గి చూస్తోంది రెప్ప లేని కన్ను

ప్రియా, మిన్ను

సిగ్గు లేని సాగరం వర్తించు నగ్నంగా

ప్రియా, ఉద్విగ్నంగా



పాదుకున్నాయి మనలో కడలిఊడలు

ప్రియా ,మన నాడులు

ఈదు నిశ్శబ్దపు చేపలు రొదనిచీలుస్తో

ప్రియా,నను పిలుస్తో




నురగలుకక్కే సాగరతీరాన

ప్రియా, రతీవరాన

విరగనితరగలం మనం మాత్రం

ప్రియా, విచిత్రం



ఎండ్రకాయల్ని తోలే ఏటవాలు సూర్యుడు

ప్రియా ,అనార్యుడు

పండు వంటి నీమేను స్పృసిస్తాడు

ప్రియా ,కందిస్తాడు




అల్లుతుంది అలలపై చంద్రుని సాలీడు

ప్రియా ,తన గూడు

అందుకో ఆహ్వానం ప్రవేశించు జాలంలో

ప్రియా ,ఇంద్రజాలంలో



చుట్టుకు పోయిన నరాలతో

ప్రియా ,కరాలతో

పెట్టుతోంది సంద్రం నిరంతరం రొద

ప్రియా ,విను దాని సొద




చుట్టుకుపోయే శంఖాన్నడుగు

ప్రియా ,ఎదనడుగు

చూరు కింద చుట్టుకొనే హోరు గాలి చెప్పదా

ప్రియా ,మనకథ విప్పదా



వేగలేను కడలిమ్రోల అహరహం

ప్రియా ,నీ విరహం

ఊగుతోంది వేయి పిర్రల సముద్రం

ప్రియా ,నిర్ణిద్రం.