మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఆశ్చర్యం !

అమ్మ ఈ మధ్య చాలా పనులు పెటుకుంది . ముసలి వాళ్ళమై పోతే ఎనర్జీ వుండదు కదా ,నలభై  లోపలే చేయదలచుకున్న విషయాలని ఒక దారిలో పెటుకోవాలి అని అమ్మ కోరిక . అందుకని అమ్మ పాపాయిని,నానని వదిలేసి ,పాపాయి వాళ్ళ నానమ్మ వూరిలో క్యాంపు  పెట్టేసింది . మొన్న ఇంటికొచ్చింది . అప్పుడిక పాపాయి వాళ్ళ నాన అన్నాడు ... ''ఇలా కాదు కానీ, నువ్వు ప్రతి శుక్రవారం బయల్దేరి రా !మళ్ళీ సోమ వారం వెల్దువు కానీ'' అని  . అప్పుడిక అది విని నిండా జలుబు చేసి వున్నపాపాయి అన్నదీ ''అవునమ్మా మేము జలుబు ,నువ్వు అమృతాంజన్ రిలీఫూ ''అని .