పాపాయి ఫోన్ చేసింది,లైబ్రరీ కి వెళుతున్నానని చెప్పింది."లైబ్రరీ కి వెళ్ళడానికి కూడా makeup వేసుకుంటున్నా అమ్మా! ఎందుకు చెప్పూ,మొన్న హాస్పిటల్ లో అడ్మిట్ అవటానికి వెళుతున్నప్పుడు కూడా రెడీ అయ్యి వెళ్ళా అమ్మా, నేను చచిపోయాక నా బిడ్డలకు చెబుతాను నాకు క్లాసిక్ మార్లిన్ మన్రో మేకప్ వేసి బరీ చేయమని "అన్నది."తల్లి సాలు బొల్లి పిల్ల కదా "తల్లి చేలో మేస్తుంటే దూడ మాత్రం గట్టున మేస్తుందా అని నిట్టూర్చి ,పనిలో పనిగా" ఒరేయ్ నేను చచిపోయాక నాకు క్లాసిక్ మేకప్ వేసి, ముత్యాలు,పచ్చలు ,కెంపులు వుండే నగలు పెట్టి నన్ను వారణాశిలో గంగ ఒడ్డున దహనం చెయ్యాలి"అని నా కోరిక కూడా చెప్పేశా .వెంటనే పాపాయి " అమ్మ ,అమ్మ వద్దమ్మ,నిన్ను పూడ్చి పెడితే అప్పుడప్పుడూ నీ దగ్గరికి వచ్చి ఇట్లాగే నీ తల తినొచ్చు కదమ్మా,కాల్చడం వద్దమ్మా " అన్నది.నేను తల్లి ప్రేమతో వెంటనే నా కాశీ కోరికను గంగలో కలిపేసి "సరేలేవే! కానీ నన్ను పూడ్చిన చోట నా పైన ధాన్యం పండించి ఆ ధాన్యాన్ని దానం ఇవ్వు "అన్నాను. దానికి కూడా"అమ్మ అట్లాగ కూడా వద్దమ్మ "అన్నది.అంటే నన్ను ఏం చేయాలో ఇదమిద్దంగా ఆలోచించలేదనమాట, మొత్తానికైతే,తను ఎక్కడుంటే అక్కడ దగ్గరగా పెట్టేసుకోవాలని ఆలోచన ఒకటి మనసులో ఉన్నట్టుంది.మళ్లీ ఒక నిమిషానికి కాస్త ఆలోచించి ,"ఏమో అమ్మా,ఏదయినా నచ్చకపోతే అప్పుడు కూడా వచ్చి బెదిరించేస్తావ్ నన్ను" అన్నది.నాకు నవ్వొచ్చింది"ఫరవాలేదు లేవే పాపాయి! ఆ మాత్రం అమ్మంటే భయం వుంది,ఇంక నిశ్చింతగా చచిపోవచ్చు "అని చెప్పాను.
పాపాయి
12, ఫిబ్రవరి 2023, ఆదివారం
21, ఫిబ్రవరి 2022, సోమవారం
నిజాలిన్ గప్పా!
పాపాయి ఇప్పుడు ప్లస్2 చదువుతోంది. మానవీయ శాస్త్రాలు తన గ్రూప్.ఈ రోజు నా తల దగ్గర కూర్చొని రేపటి పరీక్ష కోసం పడీ పడీ చదువుతోంది. వద్దన్నా నా మనోప్రాణాలన్నీ దాని చుట్టే తిరుగుతూ వుంటాయి కదా ,దాన్లో భాగంగా "నిజాలిన్ గప్పా" పేరు నా చెవిలో పడింది.ఇదేం పేరు అనుకుని సరేలే అని ఊరుకున్నాను. మళ్ళీ కాసేపటికి వల్లె వేయడం లో భాగంగా "నిజాలిన్ గప్పా"వచ్చాడు.ఈ సారి "నిజాలిన్ గప్పా ఫ్రమ్ మైసూర్" అని నా చెవిలో పడింది.ఈ సారి ఎవరబ్బా నాకు తెలీని ఈ మైసూర్ గప్పా అనుకుని పక్కనే పేపర్ చదువుకుంటున్న పాపాయి వాళ్ళ నాన్నని కేకేశాను.నాన నేను "నిజాలిన్ గప్పా" ఎవరు అని అడగగానే పేపర్లో నుండి తలెత్తకుండా ,"నిజాలిన్ గప్పా"ని సింపుల్ గా నిజలింగప్ప ఎవరో చెప్ప సాగాడు.నాన్న ఎప్పుడయితే నిజలింగప్ప అన్నాడో మిగిలినది వినకుండా నాకు "నిజాలిన్ ...గప్పా"ఎవరో అర్తమయిపోయింది .నేను పాపాయి వైపు చూస్తూ వుంటే పాపాయి ,నేనేం చేసేది అమ్మా, ఇంగ్లీష్ లో అలా వుంది అని ఆంగ్ల భాష పైకి నేరం తోసేసి , అప్పటికీ నీకు తెలియకుండా , వినిపించకుండా చదవాలనుకుని మరిచి పోయా అన్నది.
16, అక్టోబర్ 2019, బుధవారం
పగలు కురిసిన మేఘం
19, జులై 2019, శుక్రవారం
'' చూసావామ్మా ! మమ్మీ ఎంత ముదురో '' !
.హమ్మయ్య ! ఎలాగయితేనేం ,ఇవాళ నేను ముదురు కాకుండా తప్పించేసుకున్నాను !