మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

సంచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఆగస్టు 2012, బుధవారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


అవును ''మరో స్వాతంత్య్ర సంగ్రామంఅవసర''మే  మనకు . కదా ... !!!

 డార్జిలింగ్ తేయాకు తోటలలో పని చేసే ''టోపు'' తెగ అమ్మాయి .ఇరవై ఆరు కిలోల ఆకు గిల్లితే ,రోజు కూలీ తొంబై రూపాయలు .ఆ తొంబై వెనుకా చాలా మతలబులు .ఒందేళ్ల పై చిలుకు నుండీ వాళ్ళు ,అక్కడే తొక్కి పెట్టేసిన గొంగళ్ళు .అవును కదా ...నిజమే, ఇప్పుడు ,ఇన్నేళ్ళ తరువాత కూడా మనకు మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమే...

 ...అని ఇన్నేళ్ళ స్వాతంత్ర్యాన్ని అనుభవించిన అనంతరం కూడా మనం వాక్రుచ్చితే భరత మాతకు ఇట్లా వస్తుంది మరి కోపం : )) :)) : ))

11, జులై 2011, సోమవారం

గోసానిమారి .


మేముంటున్న కూచ్ బీహార్ కి దాదాపు నలభై నిమిషాల దూరంలో ఉంది ఈ గోసాని మారి .భూస్థాపితం ఐన ఒక రాజ కోట ఉంది ఇక్కడ .అది భూస్థాపితం ఎందుకయిందంటే ...అంటూ ఇక్కడి వాళ్ళు ఒక కథ చెప్పారు .

కామతేస్వర్ అనే రాజు ఈ రాజ్యాన్ని పాలించాట్ట . .రాజు గారు మొదట పశువుల కాపరి అట .ఊరందరి పశువుల్ని పచ్చిక బీళ్లలోకి తోలుకెళ్ళి, వాటి పలుపులన్ని ఊడ దీసి ,, పలుపులన్నిటినీ కలిపి తల కింద పెట్టుకుని నిద్ర పొయ్యే వాడట .ఆ పశువులు ఊరందరి పొలాలలో పడి మేసేవట.ప్రజలందరూ రాజు గారికి ఫిర్యాదు చేసారట .అప్పుడు రాజు గారికి కోపమొచ్చి స్వయంగా విచారించేందుకు వచ్చాట్ట ,రాజు గారు వచ్చేటప్పటికి నిద్ర పోతున్న ఈ కామతేస్వరునికి ఒక పాము పడగ విప్పి నీడ పట్టి ఉందట .అది చూసి రాజు వెనుదిరిగి వెళ్లి పోయాడట .

ఇలా జరుగుతూ ఉండగా ఈ కామతేస్వరునకి ఒక కల వచ్చిందట .కలలో దేవత చెప్పిందటా .......నేను నీ దగ్గరికి మూడు జంతువులను పంపుతాను వాటిలో నువ్వు దేనిని పట్టుకుంటావో దానిని బట్టి నీ అదృష్టం ఉంటుంది అని .మొదట పులి వచ్చిందట ,ఆ పై ఏనుగు వచ్చిందట ,రెంటినీ కామతేస్వరుడు పట్టుకోలేక పోయాడట చివరిలో పాము వచ్చిందట .పాముని కూడా వెళ్లి పోతూ ఉండగా తోక పట్టుకున్నాట్ట .అప్పుడు దేవత అన్నదట ,నువ్వు రాజువవుతావ్ ,కానీ నీ తర్వాత నీ రాజ్యం అంతరించి పోతుంది అని .

అట్లా కామతేస్వరుడు రాజయ్యాడు .చాలా యుద్దాలలో గెలిచాడు .అతనికి ఓ వరముండేదట ,ఏమనీ ....అతని ఎదుట నిలబడి ఎవరూ అతన్ని జయించలేరు .వెనక నుండి దాడి చేస్తేనే ఓడించ గలరు .అతనికి ఏడుగురు భార్యలు .ఏడో భార్యకి ఈ రహస్యాన్ని చెప్పాట్ట .ఆవిడ ఏం చేసిందీ ఒక యుద్ద సందర్భంలో ఈ రహస్యాన్ని శత్రువులకి చెప్పేసిందట .మరి చెప్పరేమిటి,,, అన్నేసి భార్యలుంటే .. ఎవరికేవరేంటి ...ఎవరికీ ఇతను నా సొంతం అనే ఫీలింగ్ ఉండదు కదా .

అట్లా శత్రువు వెనక మల్లుగా వచ్చి రాజా వార్ని పొడిసేసాడు.అప్పుదేమయ్యిండీ రాజా వారు శత్రువులతో అన్నారూ ,,నేను నా మందిరంలోని ఇష్ట దేవత కి నమస్కారం చేసుకుని వస్తాను అప్పుడు మీరు నన్నేమైనా చెయ్యొచ్చూ అని .శత్రువులు ఒప్పుకున్నారు .రాజా వారు వెళ్లి నమస్కరించారా ...ఇంకేముందీ రాజ మహల్ మొత్తం దానంతటదే తిరగబడి ఏడవ రాణితో సహా భూ స్థాపితం అయిపోయిందట .

అర్ఖియాలజీ వాళ్ళు తవ్వుతుంటేనట బోలెడు అపశకునాలు జరిగాయట అంచేత అసంపూర్ణంగా వదిలేశారట .ఇదీ కథ
ఇక్కడో మందిరం ఉండి .కామతేస్వరుడే నిర్మించాడనీ,ఒకటే రోజులో నిర్మాణం పూర్తయిందనీ వీళ్ళు చెప్పారు .


బయల్పడ్డ గోడ .
రాజుల్ పోయే... రాజ్యాల్ పోయే ...
తిరగబడ్డ కోట శిఖరం

మ్యూసియం
ఇది సగం తవ్వి అపశకునాలకి భయపడి దిలేసిన ప్రాంతం
అచట పూసిన పూలు

మందిరం అరుగు మీద ఉన్న వృద్దుడు .దేవుడు ఈ రూపం లో కూడా చరించ వచ్చేమో కదా

విష్ణు మూర్తి ..ఎంత బాగుంది కదా ..అలంకరణ

కామినీ పూలు ...ఎటులైనా ఇచటనే ఆగిపోనా ....అనిపించేసింది ఆ పరిమళానికి


మందిర ముఖ ద్వారం



లోపలికి అడుగు వేయగానే కనిపించారు వీరు ...

నాలుగు మూలలా ఇలా నాలుగు మందిరాలుంటాయి

25, అక్టోబర్ 2010, సోమవారం

పాపాయి -బుజ్జి మేక




ఇక్కడ బానేస్వర్ అనే శివుడి గుడి ఉంది .చాల పురాతనమైన గుడి .రాజుల కాలంలో నిర్మించిన గుడి .కార్తీక మాసం ఇక్కడ కూడా బాగానే జరుపుకుంటారు .రాత్రి ఇంటి ముందు కార్తీక దీపాలు వెలిగించుకుంటారు .నదీ స్నానాలు ,ఉపవాసాలు సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు . అట్లా బానేస్వర్ మందిరానికి వెళ్ళాం .బావి లోపల ఉన్నట్లు శివ లింగం ఉంటుంది .ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఆలయం పక్కనే ఉన్నచిన్న చెరువు .ఇక్కడ వీళ్ళు చెరువుని పుకూర్ అంటారు .అందులో అతి పురాతనమైన తాబేళ్లు ఉన్నాయ్ .అవి రాజుల కాలం నుంచి ఉన్నాయని వీళ్ళు అంటారు .
తాబెళ్ళని వీరు కచ్ఛపి అని మోహన్ అని పిలుస్తారు .భక్తులు వేసే బొరుగుల కోసం అవి మెడలు చాచి ఒక దానితో ఒకటిపోట్లడుకుంటాయి.కూటి కోసం పోట్లాటలు మానవజీవితంలోనే కాదు అన్ని జీవాజాలాలకితప్పదేమో
.
అక్కడ పాపాయికి ఒక బుజ్జి మేకతో పరిచయం కలిగింది .దేవుని ప్రసాదంగా ఇచ్చిన చక్కర గుళ్ళు పాపాయి మేకకు పెట్టింది .మేక అట్లా పాపాయితో నేస్తం కట్టింది .అలా ఒక్కో గుండు వేస్తూ పాపాయి మేకని మా దగ్గరికి పట్టుకోచ్చేసింది .



చాల సేపు మేకతో ఆడి చివరిగా మేకని మనతో తీసికెలదాంఅని బ్రతిమాలింది .కానీ ఎలా అవి దేవుని మేకలు అని చెప్పాను పాపాయి బలి అంటే ఏంటి ఎందుకు అని అనేక ప్రశ్నలు అడిగింది .మొన్నీ మధ్య ఇక్కడ మదన మొహనుడి ఆలయానికి వెళ్ళాం .అక్కడ కొన్ని మేక పోతులూ మేస్తూ కనిపించాయి .అవే దుర్గా పూజ రోజు బలి ఇవ్వ బోయేది అని వీళ్ళు చూపించారు .రెండు రోజుల తరువాత మందిరం నుండి ప్రసాదం రూపేణా మాంసం మాకు పంపారు . మేకలు చూసినప్పుడే చాల భాధ కలిగింది .
కామాఖ్య మందిరంలో కూడా ఎవరో మేకని తీసుకు వెళుతున్నారు అది గడ్డి నములుతూ హాయిగా వెలుతుందిఅప్పుడూ అనిపించింది. దేవుడు జీవాలని బలి ఇవ్వమని అదుగుతాద యెక్కదైనా అని .ఇవాళ ఇంట్లో చేపలు తెచ్చారు. నేను ఐచ్చికశాకహారిని .చిన్నప్పటి నుండి .ఇవాళ ఎందుకో చేపలు తోమడం చూసాను .బతికి ఉన్నచేపని తల నేలకి కొట్టి చంపుతారు .బాధ సంగతి వదిలి పెడితే సమాధానం మటుకు దొరికింది .ఇంత మంది మాంసాహారం కోసం ఇన్ని జీవాలని చంపుతుంటే దేవుడికి ఏడాదికోసారి ఇచ్చే బలి తప్పెందుకవుతుంది .కనుక బలులను ప్రభుత్వం నిషేదించడమే తప్పు .బలులను నిషేదించడం కరక్టైతే మనం ప్రతి రోజూ చేసే బలులు కూడా నిషేదించాల్సిందే కదా

24, అక్టోబర్ 2010, ఆదివారం

గౌహతి -కామాఖ్య మందిర్




మే ద్వితీయార్థంలో ఇప్పుడు మేముంటున్న కూచ్ బీహార్ ప్రాంతానికి వచ్చినపుడు మొదటిసారి నాకు కామాఖ్య దేవత గురించి తెలిసింది .ఆషాడ మాసం 11 తేదీన ప్రాంతం ప్రజలు "అమ్బుబాచి " పండుగని జరుపుకుంటారు .అస్సాం లోని కొంత బాగం ఒకప్పుడు మేముంటున్న కూచ్ బీహార్ రాజ్యానికి సంబందించింది . రాజే కామాఖ్య మందిరాన్నిమొదటిసారి నిర్మించారు .అమ్బుబాచి పర్వ దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక మేళ కూడా జరుగుతుంది .దానిని అమ్బుబాచిమేళ అని పిలుస్తారు .

v>
అమ్బుబాచి పర్వదినం కామాఖ్య అమ్మవారి రుతు క్రమానికి సంబంధించింది .సంవత్సరానికోసారి కామాఖ్య దేవత రుతుమతి అవుతుందట . సమయంలో ప్రాంత ప్రజలంతా పూజ గదులు మూడు రోజులు మూత పెడతారు .శాఖాహారమే తీసుకుంటారు .సంద్యాదివందనలేవీ చేయరు .


మేముంటున్న ప్రాంతం నుండి గౌహతి 7 గంటల దూరం .పొద్దుటే 7 గంటలికి ఇక్కడి నుండి బయలుదేరాము .సర్క్యుట్ హౌస్ లో బస .బ్రహ్మ పుత్రా నది ఒడ్డున ఉంటుందీ గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ .గది ముందు కూర్చుంటే కను చూపు మేర నెమ్మదిగా ప్రవహిస్తూ నది ప్రశాంతతనిస్తుంది.పొద్దుటే లేచి దర్సనానికి వెళ్ళాం .కామాఖ్య దేవీ భాగవతం ,కాలిక పురాణంలో చెప్పబడ్డ శక్తి పీటాలాలో ఒక పీటం .దాక్షాయణిదేవి మిగిలిన శరీర భాగాలు ముఖ భాగం కలకత్తా దక్కిన్ కాళీ మందిరం ,స్థాన భాగం ఒరిస్సా భరంపురంలో,పాద భాగం పూరీలో పడ్డాయట .బ్రహ్మపుత్ర నదికి అవతల శివ మందిరం ఉంది .కామాఖ్య మందిరం గర్భ గుడిలో యోనిని పోలిన పీటం ఒకటి ఉంటుంది .అక్కడ ఒక సహజ జల ఊరుతూ ఉంటుంది . జల ఏడాదిలో మూడు రోజులు రక్త వర్ణంలో కనిపిస్తూ ఉంటుందట .దీనినే వీరు దేవత రుతు మతి కావడం గా భావిస్తారు .కామాఖ్య మందిరం నుండి పాతిక కిలో మీటర్ల దూరంలో సువాల్ కుచి అనే ప్రాంతం ఉంటుంది ఇక్కడ ప్రపంచ ఖ్యాతి గాంచిన ముగా పట్టు చీరలు నేస్తారు .అస్సాం మహిళలు మన లంగా ఓణీ ని పోలిన చీరను కట్టుకుంటారు .దీనిని మేఖల అని పిలుస్తారు అయినా మామూలు చీరలు కూడా ఇక్కడ దొరుకుతాయ్ .
రెండవ రోజు రాత్రి ఇంటికి ప్రయాణం అయ్యాం.దాదాపు 370 కిలో మీటర్ల దూరంలో 27o కిలో మీటర్లు అక్కడక్కడ లారీలు తప్ప ఇంకే వాహనాలూ కనిపించ లేదు .అస్సాం తీవ్రవాదుల భయం చేత రాత్రులు ఎవరూ ప్రయాణం చేయరని డ్రైవర్ చెప్పాడు మొత్తానికి కామాఖ్య మందిర దర్శనాన్ని అల్లా ముగించుకుని ఇంటికి చేరాం.అస్సాం గురించి "విషాద కామరూప"అని ఇందిరా గోస్వామి ఒక నవల రాసారు .నవల లోతుగా లేకపోయినప్పటికీ అప్పటి అస్సాం ని కొద్దో గొప్పో మన కళ్ళ ముందుకు తెస్తుంది .అందులోనూ మీకీ కామాఖ్య మందిర ప్రస్తావన కనిపిస్తుంది నవల కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు కూడా పొందింది .