ఒక కథ ....
చైనా తత్వ వేత్త చువాంగ్ త్సు ఒక రోజు నదిలో చేపలు కోసం గాలం వేసి నిర్విచారంగా కూర్చుని ఉన్నాడు .అంతలో చు రాకుమారుడు పంపిన ఇద్దరు ఉప శాకామత్యులు అక్కడికి వచ్చారు .వారు రాజు గారు పంపిన ఉత్తర్వు చువాంగ్ త్సు కి చదివి వినిపించారు .చువాంగ్ త్సు ని ప్రధాన మంత్రిగా నియమిస్తూ చేసిన
ఉత్తర్వు అది .వారు చదివి వినిపించిన దాన్ని శ్రద్దగా విని చువాంగ్ త్సు ఇలా అన్నాడు .. , ''మూడు వేల ఏళ్ళ క్రితం ఒక పవిత్రమైన తాబేలు ఉండేదట .ఒక రాకుమారుడు అత్యంత భక్తి శ్రద్దలతో దాన్ని బలి ఇచ్చి ,పెద్ద ఆలయం నిర్మించి ఆ తాబేటి చిప్పని ప్రతిష్టించి పట్టుబట్టలు కట్ట బెట్టి ధూప దీపాలు ఆరంబించాట్ట '' ,,,............మీరు చెప్పండి ..ఒక తాబేలుకి ,తాబేటి చిప్పగా మారి ఓ ఆలయంలో ప్రతిష్టించబడి ,మూడువేల ఏళ్ళ పర్యంతము పూజించబడటం మంచిదా? లేక ఒక మామూలు తాబేలుగా బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకడం మంచిదా ?అని .
అందుకు ఆ వచ్చిన వారు ఒక తాబేలుకు బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకడమే మంచిది ఆని బదులిచ్చారు . అప్పుడు చువాంగ్ త్సు , ఇకనేం వెళ్ళండి వెనక్కి ,నన్ను బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకనీయండి అని మళ్ళీ అంతే నిర్విచారంగా చేపలు పట్టుకోసాగాడట.
ఈ అందమైన కథ నాకు గోరటి పాట వింటూ ఉంటె జ్ఞాపకం వచ్చింది .కిరిటమేమో భారమై ఉన్నది ..కిందేసితే నడక బలె ఉన్నది ,స్వారికేమో పడవ సై అన్నది ,పరువున్న వారైతే బరువన్నది ..మనందరం కిరీటాల వాళ్ళమే పరువుల బరువుల వాళ్ళమే కొందరం ప్రయత్నిస్తూ , కొందరం మోస్తూ .. అందుకేనేమో మనకు ఈ తొవ్వ ఎంతకు వొడవనట్టు తోస్తుంది ,మనల్ని మనమే మోసి బరువై పోతాం, మూల పడి మురిగి పోతాం ...
యెంత బాగుంది ఈ పాట... ఇళ్ళు పొల్లు లేని, ముల్లె మూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారం..... .బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకడంలోని సౌఖ్యాన్ని జ్ఞప్తికి తెస్తూ ....ఊగి తూగి పాడిన పాటగాడిని యెట్లా సన్మానించడం ......
సంచారం ..
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందమేదున్నది ...సంచారమే
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందమేదున్నది ...సంచారమే
సేద తీర సెరువు కట్టున్నది
నీడకోసం సింత సెట్టున్నది
జోలలూపే గాలి పిట్టున్నది
గుర్తు లేని గుడ్డి నిదురున్నది
బరువు దిగిన గుండె బలె ఉన్నది ..సంచారమే
సిప్పోలె మోదుగ దొప్పున్నది
సిట్టి కొమ్మన తేన పట్టున్నది
జోపితే జోరయిన తీపున్నది
రూపులేనాకలి చూపున్నది
ఆకలంత అదృష్టమేదున్నది
జ్ఞాన ఆకలంత అదృష్టమేదున్నది.. సంచారమే
పండువండిన జాన పండ్లున్నవి
తెమ్పుకుంటే నోటికింపున్నవి
సేదు గింజల్లేవో దాగున్నవి
నమిలె కొద్దీ తీపినిస్తున్నవి
దారి బత్తెం కరువు లేకున్నది
రాలి పడ్డవి రాసులుగ నున్నవి ..సంచారమే
కిరిటమేమో భారమై వున్నది
కిందేసితే నడక భలే ఉన్నది
చెప్పులు లేకున్న మేలున్నయి
ముండ్ల తుప్పలేవో తెలిసి పోతున్నవి
కాలి మట్టికేదో మహిమున్నది
తేళ్ళు పురుగులు తొలగి పోతున్నవి ..సంచారమే
ఊరి ఊరికి దారులేరున్నవి
ఊటలోలె బాట లోస్తున్నయి
బాట పక్కన పూలు వింతున్నయి
తోవ ఎంత నడిసిన వొడవకుంటున్నది
గాలి గంధమెంత బాగున్నది
ఖాళిగుంటే కడుపు నింతున్నది
ఇళ్ళు పొల్లు లేని ముల్లె మూట లేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని
శూన్య సంచారమే ..సంచారమే ..
మంచుతో మెరిసేటి కొండున్నది
మహిమలున్నవి చూసి పొమ్మన్నది
అంచుకోతే సలి తంతున్నది
కొంచె ఎడం బోతే ఏదో మేలున్నది
మురిపాల మెరుపులు అడ్డున్నవి
దాటిపోతే నడక తీరే వేరున్నది ........ సంచారమే
పారేటి వెన్నెల ఏరున్నది
స్వారికేమో పడవ సైగున్నది
పరువున్నవారైతే బరువన్నది
లేకుంటేనే లేడి పరుగన్నది
పైనవన్నీ వదులుకోమ్మన్నది
పైర గాలి తడిపి పోతన్నది ..సంచారమే ..
గాలిలో తేలాడే పక్షున్నది
గగనమంచుల దాక పోతున్నది
ఏటిల గాలాడే చేపున్నది
నీటిపాతి దాక ఈతున్నది
సంచరించేవి శక్తితో వున్నవి
మూలకున్నవి మురిగిపోతున్నవి
ఇళ్ళు పొల్లు లేని ముల్లె మూటలేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే .......
నీడకోసం సింత సెట్టున్నది
జోలలూపే గాలి పిట్టున్నది
గుర్తు లేని గుడ్డి నిదురున్నది
బరువు దిగిన గుండె బలె ఉన్నది ..సంచారమే
సిప్పోలె మోదుగ దొప్పున్నది
సిట్టి కొమ్మన తేన పట్టున్నది
జోపితే జోరయిన తీపున్నది
రూపులేనాకలి చూపున్నది
ఆకలంత అదృష్టమేదున్నది
జ్ఞాన ఆకలంత అదృష్టమేదున్నది.. సంచారమే
పండువండిన జాన పండ్లున్నవి
తెమ్పుకుంటే నోటికింపున్నవి
సేదు గింజల్లేవో దాగున్నవి
నమిలె కొద్దీ తీపినిస్తున్నవి
దారి బత్తెం కరువు లేకున్నది
రాలి పడ్డవి రాసులుగ నున్నవి ..సంచారమే
కిరిటమేమో భారమై వున్నది
కిందేసితే నడక భలే ఉన్నది
చెప్పులు లేకున్న మేలున్నయి
ముండ్ల తుప్పలేవో తెలిసి పోతున్నవి
కాలి మట్టికేదో మహిమున్నది
తేళ్ళు పురుగులు తొలగి పోతున్నవి ..సంచారమే
ఊరి ఊరికి దారులేరున్నవి
ఊటలోలె బాట లోస్తున్నయి
బాట పక్కన పూలు వింతున్నయి
తోవ ఎంత నడిసిన వొడవకుంటున్నది
గాలి గంధమెంత బాగున్నది
ఖాళిగుంటే కడుపు నింతున్నది
ఇళ్ళు పొల్లు లేని ముల్లె మూట లేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని
శూన్య సంచారమే ..సంచారమే ..
మంచుతో మెరిసేటి కొండున్నది
మహిమలున్నవి చూసి పొమ్మన్నది
అంచుకోతే సలి తంతున్నది
కొంచె ఎడం బోతే ఏదో మేలున్నది
మురిపాల మెరుపులు అడ్డున్నవి
దాటిపోతే నడక తీరే వేరున్నది ........ సంచారమే
పారేటి వెన్నెల ఏరున్నది
స్వారికేమో పడవ సైగున్నది
పరువున్నవారైతే బరువన్నది
లేకుంటేనే లేడి పరుగన్నది
పైనవన్నీ వదులుకోమ్మన్నది
పైర గాలి తడిపి పోతన్నది ..సంచారమే ..
గాలిలో తేలాడే పక్షున్నది
గగనమంచుల దాక పోతున్నది
ఏటిల గాలాడే చేపున్నది
నీటిపాతి దాక ఈతున్నది
సంచరించేవి శక్తితో వున్నవి
మూలకున్నవి మురిగిపోతున్నవి
ఇళ్ళు పొల్లు లేని ముల్లె మూటలేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే .......
1 కామెంట్:
That's great song
కామెంట్‌ను పోస్ట్ చేయండి