ప్రతి రాత్రి 9-9.30 పాపాయి కథల సమయం .కానీ ఎందుకో చాలా సార్లు స్నేహితులు ఆ సమయంలోనే ఫోన్లు చేస్తారు .చెయ్యొద్దని యెట్లా చెప్తాం .ఇటు ఫోన్ రాటం అటు పాపాయి అలిగెయ్యటం ఒకే సారి జరిగి పోతాయ్.నిన్న రాత్రి అట్లాగే జరిగింది. పాపాయి ఎంత అలిగేసిందో .అంతకు అరగంట ముందు నుండి ఏం కథ వినాలో దానికున్న కథల పుస్తకాలు అన్నీ చిలక జోశ్యం వాళ్ళ లాగ పరచి కళ్ళు మూసుకుని ఎంపిక చేసుకున్నది .ఉత్సాహంగా వినటానికి సిద్ద పడింది .ఇటువైపు స్నేహితురాలు మాట్లాడేస్తూ ఉంది .తనకొచ్చిన పెద్ద దుఃఖాన్ని చెప్తూ ఉంది .నిజంగానే పెద్ద దుక్కం .ఊ కొడుతూ ఉన్నాను ...ఆ ఫోన్ అలా ముగిసిందో లేదో మరో ఫోన్ .ఈ సారి కన్నీటి ప్రవాహం అటు వైపునుండి ఇటు వైపుకు ప్రశ్నలు ,విరక్తులు ...ఏం బదులిస్తాం.రాత్రి పదకొండయింది .పాపాయి పడుకోలేదు .బుసలు కొడుతుంది .ఓదార్చబోతే దాడికొచ్చింది .యేడ్చి,కొట్టి ,అలిగి రాత్రి పన్నెండు వరకు బుస కొట్టి పన్నెండుకి బకాసురిడి కథ విని బజ్జుంది .పాపాయి బజ్జున్న ఏకాంత క్షణాల స్నేహితుల దిగులు పూల పరిమళాల తడిసి ఉన్న అమ్మ.. గది వెలుపటి చంద్రుడ్ని ధ్యానిస్తూ కవిత ఒకటి అల్లుకుంది .
"నిన్నటి చంద్రుడు "
వెన్నెల సెలయేటి పక్కన
సంపెంగల పూల తోట
ఇంద్ర ధనస్సును పూసింది
అహంకరించిన
సూర్యుని రేఖ ఒకటి
కలని గదిని కలిపి
గోడపై నిశ్చల చిత్తరువైంది
జ్ఞాపకమంటిన నయనాన్ని
పలుకరించబోతుంటే
గుప్పెట కాసిని
రంగుల సంపెంగలు
6 కామెంట్‌లు:
mastundi.
Thats obviously a nice poem to read but the thing is its of high standard to understand for all the people i guess............
nice to see you again trishna gaaru
త్రిష్ణ గారు !ఎలా ఉన్నారు .మొన్నో రోజు మీ బ్లాగ్కి వచ్చేసి బోల్డు సేపు ఉండి పోయాను .చివరిగా మీ బై చూసి మళ్లీ ఎప్పుడు కనిపిస్తారోనని బెంగ కూడా పెట్టేసుకున్నాను .మీ బ్లాగ్ బాగుంది .ఇన్నేళ్ళ సాహిత్య అధ్యయనం తరువాత కూడా తిలక్ అప్పుడప్పుడు మనసు తలుపు తట్టేస్తూ ఉంటాడు .మీరు తలుపు తట్టే తిలక్ కి పిలుపునిచ్చారు .చలం ని వినాలనే ఊహ కూడా నాకు ఎప్పుడూ కలగలేదు ఎందుకో ...మొదటి సారి మీ బ్లాగ్లోనే విన్నాను .ఎస్కేపిసం గురించి. ఆ గొంతులో కూడా ...ఏదో విసుగు వెటకారం తోచింది నాకు .ఇంకా మీ శారద పారిజాతం పూల మొక్క ,ఏమండీ అనే మీ పిలుపు ,మీ దిగుళ్ళు,అనిల్ కపూర్ ఆ పాట ,మీ వెన్నెల మెట్లు , ,మీ పెరటి మొక్కలు అన్నీ చుట్టబెట్టాను .నిన్న, ఇంకా శాంతినికేతన్లో ఆటోలు లేవండి అని చెప్దామనుకుని కొంత మొహమాట పడి ఊరుకున్నాను .చివరిగా ఏమనుకున్నానంటే ఈ బ్లాగ్ బాగుంది సంగీతం, సాహిత్యం ,వంట, కంప్యూటరు అన్నీ తెలిసిన పాత కొత్తలు సమ పాళ్ళలో మేళవించబడిన మంచి అమ్మాయిలాగా అని...best wishes to you trishna gaaru
ఎంత చక్కగా వ్యక్తీకరించావు సుధీరా!నీకు నానుండి బోలెడన్ని ప్రేమలు.
మీ బోలెడు ప్రేమల పరిమళాలని పట్టి దాచుకున్నా మేడం ,చాలా రోజులకి నా పాపాయిని చూట్టానికి వచ్చారు ఇందు మూలంగా నేను అలిగేస్తున్నా! ఫోన్ చేసి ఓదార్చాలి మరి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి