మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఒక్కటిస్తే.... అప్పుడు అర్థమౌతుంది !


ఇవాళ బడి నుండి రాగానే పాపాయి అన్నదీ అమ్మా నేనీ రోజు ఒక పిల్లని తిట్టేసా అని .నేను నిజంగా ఆశ్చర్య పడ్డా ..నా బిడ్డ మీద స్కూల్ నుండి ఒకటే కంప్లైంట్ ఉంటుంది ,అదేంటంటే మీ అమ్మాయి చాలా మంచిగా ప్రవర్తిస్తుంది ,కానీ ఎవరితోను ఏమీ మాట్లాడదు ,ఎప్పుడూ కాం గా కూర్చుంటుంది అని . ఎందుకు మాట్లాడవు రా అమ్మలు అంటే మాట్లాడటానికి ఏముంటాయ్ అమ్మా అంటుంది. సేం ప్రాబ్లం వాళ్ళ నాన్నకి కూడా ఉంటం చేత ,నాకు మేథావి పుట్టిందని నిర్ణయించుకుని మరేం పర్లేదు, నా బిడ్డ ఇట్లా ఉంటూనే ,ఎప్పుడో లోకమంతా చదువుకునే పుస్తకమొకటి రాసేస్తుంది ,దార్శనికురాలౌతుంది అని అందరికి ప్రకటించేశాను

అట్లాంటిది ఒక్క సారిగా ఎవరినో తిట్టేశానంటే నమ్మలేక అడిగా ...నిజమేనా బిడ్డా...అని .అది అంది నిజమే అమ్మా లైన్ దాటేసి నన్ను తోసెయ్ బోయిందమ్మ అందుకని "ఒక్కటిస్తే ..అప్పుడు అర్థమౌతుంది "[మారూన్గీనా తబ్ సమజ్మె ఆయేగా ..} అన్నానమ్మ అంది .

నాబిడ్డ అలా అన్నందుకు నాకు బోలెడు ఆశ్చర్యానందాలు కలిగాయి .రేపెళ్ళి నా బిడ్డ చేత అలా అనిపించగలిగిన ఆ పిల్లతో కర చాలనం చేయాలనిపించింది .అవంతా దాచేసుకుని అంత ఘోరం ఆ పిల్ల ఏం చేసింది బిడ్డా పోన్లే అనుకోకూడదా అన్నాను .పాపాయి అన్నదీ ఎన్ని రోజులమ్మా, రోజూ ఏదో ఒకటి చేస్తుంది .విసుగు పుట్టదా అమ్మా అని !

నిన్న జయప్రకాశ్ నారాయణ్ ఇష్యు కి దీనికి ఏదో సంబంధం ఉన్నట్లు తోచటంలా! నాకెందుకో అలా తోచింది మరి .

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గ్రేట్. చాలా రెలవెంట్ గా ఉంది.

గోదారి సుధీర చెప్పారు...

avunu

krishh చెప్పారు...

పాపాయి అలా చెయ్యటం అనేది చిన్నతనం లో సహజంగ తమకు నచ్చని Actions ఎదుటి
వారు చేస్తే spontaneous వచ్చే reaction.పిల్లలు నోరు
వాడినంతసులువు గ చెయ్యి వాడతారు ,వాళ్ళ దృష్టిలోరెండు పెద్దతప్పులునేరాలుకావు.వాళ్ళకు
అవి తమ భావాలు చెప్పే సాధనాలు అంతే.వారి చేతలకు మాటలకు టార్గెట్ చెయ్యబడ్డ ఎదుటి పిల్లలు బాధ
పడ్డా ఆ తర్వాత పెద్దగ ఫీల్ కారు.
so "ఒక్కటి ఇస్తే అప్పుడు తెలుస్తుంది" అన్నా ఆ ఒక్కటి ఇచ్చినా మనం అర్ధం చేసుకో వచ్చు.
.that too పాప
ను తనfriend నెట్టి పడవేయ బోవగ
తను just మాట అని ఊరుకుంది.
కాని తన opinion ని చెప్పిన JP (కాస్త ఘాటుగా ,కొందరిని ఉద్దేశించినట్టు
గానేఅయ్యినా)ని physical assault చెయ్యటం సమర్ధనీయమా?
మీరు మీపోస్ట్ లో పోలికను మాత్రమే చూసినా
తమ భావాలను సెంటిమెంట్స్ ను వ్యతిరేకించే వాళ్లకు ఒక్కటి
ఇవ్వటం ద్వారా తెలుపవలననుకోవటం ఓకే నా..................
.

గోదారి సుధీర చెప్పారు...

కృష్ణ గారు !తన దాకా వస్తే గాని తల నొప్పి బాధ అర్థం కాదనే సామెత నాకు నిజమని తోస్తుంది

kiran చెప్పారు...

క్రిష్ గారు
Jp గారిని ఫిజికల్ గా అస్సాల్ట్ చెయ్యడం గురించి ఆలోచించే ముందు jp గారు పదే పదే దురహంకార ధోరణి తో తెలంగాణా ఉద్యమాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయటాన్ని మనం గుర్తించాలి . చాలా మంది తెలంగాణా ఉద్యమ నాయకులు తెలంగాణా ప్రజల లాగే మృదు స్వభావులు . సుదీర గారి పోస్టు అమాయకంగా ఉండే పిల్లలని ఎవరైనా పదే పదే bullying చేసినప్పుడు వారు తిరగబడటాన్ని చెప్పింది . సుదీర గారి పోస్టు జప్ గారి దురహంకార ప్రవర్తనని సూచించిందే కాని jp గారి మీద దాడిని సమర్ధించలేదు .

krishh చెప్పారు...

రణ్ గారు,
thnxs for posting response .
ఒక పార్టీ వ్యవహార శైలిని అభ్యంతరము తెలుపటం,విమర్శించడం, లేక దూషించడం జరిగినప్పుడు ,
అలా చేసిన వారి పైన మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయిచేసుకోవటం అనే మరో ప్రక్రియకు అవకాశం లేదు కదా అన్నది నా ఉద్దేశం.
ఆ విధంగా మన వ్యతిరేకతను ప్రదర్సించుకోవటం మొదలెడితే " బలం" అనేది " హక్కు" స్థానం లో కి చొరబడి నట్టు అవుతుందేమో... ...
ఇక ఉద్యమాన్ని కించపరిచే వ్యాఖ్యలు,ఒక ప్రాంతాన్ని(అది ఏ ప్రాంతమైనా),వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే...
ఇక తెలంగాణా ఉద్యమం మూలాలు, నేపధ్యం గురించి నాకు తెలీదు,జస్ట్ న్యూస్ ఫాలో అవటం ,నేతల
కామెంట్స్ చేసే తీరు ను గమనించటం
మాత్రమే కానీ నాకు పెద్దగ తెలంగాణా పైన అవగాహనా లేదు.