మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

12, డిసెంబర్ 2018, బుధవారం

తాతకి నా పోలిక !

పాపాయి వాళ్ళ చిన్న మామ కి పాపాయి పుట్టింది , అక్టోబర్ లో ! పాపాయి వాళ్ళ తాత కూడా అక్టోబరే . బుజ్జి దాని పేరు మెలొడి . అది కూడా అచ్చం తాత లాగే సగం కళ్ళు తెరుచుకుని నిద్రపోతుంది . అందుకని నేను పాపాయితో ''మెలొడీకి అచ్చం తాత పోలిక రా '' ! అన్నాను ,పాపాయి క్షణం కూడా ఆలోచించకుండా '' ఆఁ ! తాతకన్నీ నా పోలికలమ్మా , తాత కూడా నా లాగే తలకింద చెయ్యి పెట్టుకుని నిద్ర పోతాడు '' అన్నది . అది విని తాత కూడా మనవరాలికి సపోర్ట్ వచ్చి '' అవునురా ! మెలొడీకి వాళ్ళ తాత పోలికలు , నాకంతా నీ పోలికలు '' అని వాక్రుచ్చాడు . 

29, జనవరి 2018, సోమవారం

అయ్యప్ప

పాపాయి అన్నదీ , తాత అయ్యప్పా అయ్యప్పా అని పూజ చేస్తాడు కానీ , అయ్యప్ప ఎలా పుట్టాడో మాత్రం తాత తెలుసుకోలేదు .

26, జనవరి 2018, శుక్రవారం

'రాముడు !

పాపాయి చెప్పింది .. '' ఎవరో ఏదో అన్నారని సీతని వదిలేసిన రాముడి ని పూజించడం చట్టరీత్యా  నేరం ''. చిన్న స్థాయినుండి వచ్చి ఎదిగిన ,ధర్మం కోసం నిలబడతానని చెప్పిన కృష్ణుడు పూజనీయుడు . 
 Image result for ramudu

26, డిసెంబర్ 2016, సోమవారం

పొగిడే మిషన్

 మొన్నో రోజు పాపాయి ఫోన్ చేసింది . వీడియో కాల్ . ఇల్లంతా సందడి సందడి గా వుంది . ''నీకేం  లేవే , అదృష్టవంతురాలివి , అవ్వ ,తాత , అత్తలు మావలు , తమ్ముడు .... నాకు చూడు  ఇల్లంతా ఖాళీ ''అంటే పాపాయి వెంటనే ''నీకేమమ్మా , ఆల్ ఇన్ వన్ నాన్న వున్నాడు కదా , అమ్మ నాన్న తమ్ముడు ఇంకా నిన్ను పొగిడే  మిషన్ కూడా కదమ్మా నాన్న'' అంది

మోడీ గారు

నెల్లూరులోవిద్యావంతుల వేదిక నుండి  డీమోనిటైజేషన్ పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం . పాపాయి వంతు వచ్చినప్పుడు , ''నోట్ల రద్దు వలన నాకయితే ఏం ఇబ్బంది రాలేదు కానీ మా తాత చాలా ఇబ్బంది పడ్డాడు. పెన్షన్ తెచ్చుకోలేకపోయాడు . ఎంతసేపు లైన్లో నిలబడినా వీలుకాలేదు . మోడీ గారు కెన్యా లాగ భారత్  ను కూడా డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది '' అని చెప్పింది . మేమందరం మోడీ గారిపై మీ అభిమానం బాగుంది అని వెక్కిరించడం మొదలు పెట్టాం . అప్పుడు అది '' కాదమ్మా , ఆయనెంత గొప్పవాడు చెప్పూ ... అంత పేదరికం నుండీ, కింది కులం నుండీ ప్రధానమంత్రి అయ్యాడు . గొప్ప కాదా ... గౌరవించవద్దా ?'' అని ప్రశ్నించింది . నిజమే కదా , ప్రధానమంత్రులు అందరు ఆ తానులో ముక్కలే అయినప్పుడు , పేదరికం నుండి వచ్చినందుకు ఆయనకివ్వాల్సిన గౌరవాన్ని ఆయానికిచ్చే తీరాలిగా . యు ఆర్ రైట్ పాపాయి గారు ,మోడీ గారు గొప్పవారు .