నెల్లూరులోవిద్యావంతుల వేదిక నుండి డీమోనిటైజేషన్ పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం . పాపాయి వంతు వచ్చినప్పుడు , ''నోట్ల రద్దు వలన నాకయితే ఏం ఇబ్బంది రాలేదు కానీ మా తాత చాలా ఇబ్బంది పడ్డాడు. పెన్షన్ తెచ్చుకోలేకపోయాడు . ఎంతసేపు లైన్లో నిలబడినా వీలుకాలేదు . మోడీ గారు కెన్యా లాగ భారత్ ను కూడా డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది '' అని చెప్పింది . మేమందరం మోడీ గారిపై మీ అభిమానం బాగుంది అని వెక్కిరించడం మొదలు పెట్టాం . అప్పుడు అది '' కాదమ్మా , ఆయనెంత గొప్పవాడు చెప్పూ ... అంత పేదరికం నుండీ, కింది కులం నుండీ ప్రధానమంత్రి అయ్యాడు . గొప్ప కాదా ... గౌరవించవద్దా ?'' అని ప్రశ్నించింది . నిజమే కదా , ప్రధానమంత్రులు అందరు ఆ తానులో ముక్కలే అయినప్పుడు , పేదరికం నుండి వచ్చినందుకు ఆయనకివ్వాల్సిన గౌరవాన్ని ఆయానికిచ్చే తీరాలిగా . యు ఆర్ రైట్ పాపాయి గారు ,మోడీ గారు గొప్పవారు .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి