ఇవాళ నిజానికి బ్లాగింగ్ చేసే ఉద్దేశమే లేదు కానీ ఇది రాయాలనిపించింది. ఇవాళ,ఇప్పుడే ఈ నెల
''పాల పిట్ట '' లో గంగిసెట్టి లక్ష్మీ నారాయణ గారు, ఇందిరా గోస్వామి గారి గురించి వ్రాసిన ''వర్తమాన చరిత్రకు సృజనాత్మక శిల్పి''స్మరణ
చదివాను.ఎందుకనో బాగా దుక్కం వచ్చింది.ఆ దుక్కం ఎందుకనో తెలియనే తెలియదు
.బహుసా ''విషాద కామరూప ''చదివిన నాటి దుక్కపు పునరావృతం కావచ్చును .
మన
అనుభవానికి రాని విషయాలు కూడా ఒక మంచి రచయిత వాక్యాల వెంట వెళ్ళినప్పుడు
అనుభవంలోకి వచ్చే తీరుతాయి.ఇవాళ అంతకన్నా కూడా ఎక్కువగా ఈ వ్యాసకర్త స్మరణ
వల్ల విషాద కామ రూప లోని స్త్రీ వైధవ్య విషాదం నా మనసులోకి చేరి దిగులు
గూడుని కట్టుకుంది.
ఆత్యంత
ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నవలలోని కథానాయకుడు 'ఇంద్రజిత్ 'తానేనని
రచయిత్రి చెప్పడం.''నాలోని మరో భాగం.అందులో చాలా వరకు నన్ను నేను జెండర్
పరిథి దాటి చిత్రించుకున్నాను''అన్న ఆమె సమాధానం,నన్నేదో చేసింది ...ఏం
చేసిందో చెప్పడానికి నాకిప్పుడు సరైన పదం తోచటం లేదు.
వ్యాసకర్త
,తానీ నవలని కన్నీరు పెట్టుకుంటూ అనువదించానని చెప్పటం ,తెలీదు కానీ
,ఎందుకనో దుక్కాన్ని పెంచింది.రాత్రి GERHART HAUPTMANN పెద్ద కథ FLAGMAN
THIEL చదివాను .ఎంత బాధ పెట్టిందంటే పాపాయి వాళ్ళ నానకి కథ చెప్పినదాకా
నిదర రానేలేదు.
ప్చ్ ! ఏమిటో మనసును అల్లకల్లోల పరిచే ఈ విషాదాలన్నీ ఒక్క సారే వచ్చిపడ్డాయి.
4 కామెంట్‌లు:
Indira goswami gaari gurinchi nenu chadivaanu. At this movement I feel sad.
వనజ గారూ విషాద కామరూప చదివారా?
సుదీర గారు..భూమిక లో విషాద కామ రూప ..గురించి చదివాను. ఇందిరా గోస్వామి వ్యక్తిగత విషాదం..ఆత్మహత్య ప్రయత్నం తరువాత.. ఆమె స్పూర్తికరమైన రచనా ప్రవాహం.. గురించి క్లుప్తంగా తెలుసుకున్నాను. చాలా బాధ తెలుగు అనువాదం దొరుకుతుందా? చెప్పండి . నాకు,బెంగాలి కానీ,ఇంగ్లిష్ భాష లు కానీ రాదండి. . వాస్తవ జీవితాల వ్యధలని కథలుగా,కవిత్వంగా,నవల లాగా మలచిన సాహితి సృజనశీలి.. అస్సాం రాష్ట్ర ప్రజల ఆరాధ్య మహనీయ మనిషిగా సుస్థిర స్థానం సంపాదించుకోగల్గి నదంటే.. యెంత గొప్ప హృదయం,పరిణితి కల్గిన మహోన్నత స్త్రీ మూర్తిగా నో అర్ధం చేసుకున్నాను. అవార్డ్లు,రివార్డులు కన్నా అది చాలా గొప్ప కదా ! అందుకే చాలా భాద కల్గింది.
నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసారనుకుంటా .నేనూ తెలుగులోనే చదివాను .ఆ నవల తెలుగు పేరు విషాద కామరూప.థాంక్ యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి