మేమిప్పుడుంటున్నఈ కూచ్ బిహార్ రాజ మాత గాయత్రి దేవి పుట్టినిల్లు .(ఆ రాజ వంశం గురించి మరెప్పుడైనా రాస్తాను )బెంగాలీల సంస్కృతిలో ఒక <విశిష్టత మేళాలు .శాంతి నికేతన్ లో ప్రతి ఏటా జరిగే "పౌష్ మేళ "చాలా ప్రఖ్యాతి గాంచింది .బెంగాల్ లో ప్రతి ప్రాంతం లోనూ ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను అనుసరించి మేళా లు జరుగుతాయి .కూచ్ బిహార్ లో జరిగే మేళా పేరు "రాస్ మేళా "ఈ మేళా మదన మోహనుడు అనే పేరిట ఉన్న ఈ రాజుల కుల దైవం కృష్ణుని కోసం జరుగుతుంది .ఈ మందిరం 1890 ప్రాంతంలోది కాగా ఈ మేళా 1912 ప్రాంతం నుండి మొదలైంది .ప్రతి ఏటా కార్తీక పున్నమి నాడు ప్రారంభమయ్యే ఈ మేళా 15 రోజుల పాటు సాగుతుంది .ఒక కిలో మీటర్ పరిధిలో 1500 వరకు దుఖాణాలు బారులు తీరుతాయి .ఈ జిల్లా అస్సాం తదితర రాష్ట్రాలకు బోర్డర్ కాడం చేత ఆయా ప్రాంతాల ప్రజలు ఈ మేళాను దర్శిస్తారు .మందిరంలో "రాస్ చక్ర "తిప్పడంతో ఈ రాస్ పూర్ణిమ మొదలవ్తుంది .ఈ రాస్ చక్ర 40 అడుగుల పొడవు వుంటుంది .సాంప్రదాయంగా దశాబ్దాల నుంచి ఒక ముస్లిం కుటుంబం దీన్ని నిర్మిస్తుంది .ఈ రాస్ చక్రం పూల> కృష్ణుని బొమ్మలతో నిండి ఉంటుంది .ప్రజలు క్షేమ ,లాభ, ఐశ్వర్యాల కోసం దీన్ని తిప్పుతారు .ఆ సమయంలో కృష్ణుడు మందిరం లో నుండి వెలుపలికి వచ్చి చక్కగా బంగారపు గొడుగు వేసుకుని కన్నుల పండువ చేస్తాడు .{రాజుల కాలం నాటి అసలు విగ్రహం చోరీ ఐంది ఇప్పుడున్నది కొత్త విగ్రహం }మందిరం ఆవరణంలో వివిధ పురాణ ఘట్టాల బొమ్మలు కొలువు తీరుతాయి
ఇకపోతే మేళాలో అనేక రకాల దుఖాణాలు కనపడుతాయి చెప్పుల నుండి హుండీల వరకు తిను బండారాల నుండి ఖరీదైన బంగ్లా దేశ్ నేత చీరల వరకు ,ఇంకా ప్రభుత్వం ప్రమోట్ చేసే కొన్ని విషయ సంభంద దుఖాణాలు ,సర్కస్ ప్రజలని సంతోష పెడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల కోసం రాత్రి పూట నడిచేట్లు బస్సులు .రాత్రి బస చేసేందుకు ప్రభుత్వ అతిధి గృహాలు ఉంటాయి .15 రోజుల తరువాత ప్రభుత్వం బలవంతంగా మేళాని తొలగిస్తుంది .అప్పటి వరకు ప్రజలు వస్తూనే ఉంటారు
%;">నేనూ అమ్మాయి మేళాకి వెళ్లాం అది రోజూ వెళ్తూనే ఉంటుంది .రంగుల రాట్నాలు ఎంత తిరిగినా దానికి తనివి తీరదు .నిన్న వచ్చేటప్పుడు నానకి ,తాతకి ఇంకసలు ఎవ్వరి చెప్పకూడదని ఒట్టు పెట్టించుకుని నాకో విషయం చెప్పింది .ఏమంటే అది కూచ్ బిహార్ కే కలక్టర్ అవుతుందంట ,రాస్ మేళా లో చాలా రోజులు రంగులరాట్నాలుతిరుగుతుందంట . రాస్ మేళ ఎన్ని రోజులైనా అట్లాగే ఉన్చేస్తుందట .అందరూ ఆనంద పడతారు కదా అంది .మేళాలో అది గులాబి రంగులో ఉండే పీచు మిటాయి కావాలంది తీసిచ్చాక గుర్తొచ్చింది నానకి తెలిస్తే ఇద్దరి తోలూ వలిచేస్తాడని .ఎందుకంటే దానికి చాలా రోజులు జ్వరం వచ్చింది .అందుకని దానికి చెప్పాను నానకి చెప్పోద్దోరెయ్ మనం అని. పాపాయి వెంటనే ఒప్పుకుంది మళ్ళీ నేనే ఆలోచించి వద్దులే తప్పు చేసినా నిజమే చెప్పాలి కదా మనం అన్నాను .అప్పుడది చెప్పింది, ఏమీ కాదమ్మా అబద్దాలు చెప్పచ్చు. అవ్వ {అంటే మా అమ్మమ్మ }చెప్పింది ఈ ప్రపంచంలో ఒంద అబద్ధాలైన చెప్పచ్చోని అంది .మా అమ్మమ్మ అదీ ఏదేదో మాట్లాడుకునే వాళ్ళు .ఎప్పుడో ఈ భోధ చేసి ఉంటుంది ఆమె . నా బిడ్డ అది గుర్తు ఉంచుకోవడమే కాక ఎప్పుడు అప్లై చెయ్యాలో అపుడే అప్లయ్ చేసింది .అందరూ అంటారు నీ బిడ్డ ఏక సంతాగ్రాహి అని నిజమేనేమో అనిపించింది .

3 కామెంట్లు:
Interesting. Thanks for the photos.
మొత్తానికి రాస్ మేళ చూపించావమ్మా. చాలా బాగుంది. నేను కూడా విండో షాపింగ్ చేసేసా పనిలో పనిగా.పాపాయి కలెక్టర్ అయ్యాక ఇంక ఏ సీసన్ లో అయినా రాస్ మేళ చూడొచ్చు అన్న మాట.
thank you.....sudheera
కామెంట్‌ను పోస్ట్ చేయండి