పాపాయికి నాలుగేళ్ళప్పటి సంగతి . మా ఇంట్లో అప్పుడో అమ్మాయి వుండేది 'మీరా 'అని .ఆ పిల్లతో పాపాయికి పేరు పెట్టి పిలిచేసేంత మంచి స్నేహం .ఆ పిల్లని అక్క అనాలని చెప్పేదాన్ని నేను.పాపాయికి అచ్చు నాలాగే దానికన్నా పెద్ద వాళ్ళతో స్నేహాలు.స్నేహాలే కాదు వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళతో సమానమనే భావన కూడా బలంగా వుంటుంది.అంచేత పాపాయికి ఆ పిల్ల అక్క అవడం అసలు ఇష్టం వుండేది కాదు .అందుకని నేనే అక్కని ,మీరా అక్క కాదు చెల్లి అనేది .అక్క అనమని ఆ పిల్లని బలవంత పెట్టేది .
అప్పట్లో పాపాయి బాత్ రూం కి వెళ్ళే లోపలే చడ్డీలోనే ఉష్షు పోసేసేది.ముందే ఎళ్ళాలమ్మా అన్నా బద్దకించేసేది.
ఒక రోజు ఏమైందంటే అట్టాగే పాపాయి ,మీరా ...అక్కా చెల్లెళ్ళ వాదులాటల్లో వున్నారు ,అంతలో పాపాయికి ఉష్షు వచ్చేసాయి .వెళ్తూ... వెళ్తూ ,వెళ్ళే... లోపలే సరిగా బాత్ రూం ముందర ఉష్షు పోసేసింది .నేను అది చూసి ''ఆ...పాపాయి అక్క కాదు మీరా ...పాపాయి చెల్లి ,చూడు చడ్డీలోనే ఉష్షు పోసేసింది ?''అన్నాను .మీరా కూడా ''అవునవును పాపాయి చెల్లి ,అక్క కాదు కాదు ''అనేసింది .
అప్పుడిక పాపాయి డైలమాలో పడ్డది .పాపం దానిక్కూడా చడ్డీలో ఉష్షు పోసేస్తే అక్క పదవికి పనికిరాం అని అర్థమయింది .
పాపాయికి అమ్మ పుస్తకం కథలు చెపితే నాన్న అల్లిక కథలూ ,చరిత్ర కథలూ చెప్తాడు .అట్లా అప్పుడు ప్రతి రాత్రి ''సమ్మక్క సారక్క కథ '' సీసన్ నడుస్తుండింది .అందుకని పాపాయి చాలా రాజీ ధోరణిలో ''సరే మీరా నువ్వు సమ్మక్క ,నేను సారక్క సరేనా ...!''అన్నది.
3 కామెంట్‌లు:
మీనాక్షి .. (పాపాయి) ది..ఎక్కడా రాజీ పడని ధోరణి . అందుకే" మీరా" ని ఎలాగైతేనేం సమం చేసింది.:)))))
ముగ్గులు పెట్టే మీనాక్షి ..ముచ్చటగా ఉంది.
thanka you vanaja garoo...
telivainadi!
కామెంట్‌ను పోస్ట్ చేయండి