18, జనవరి 2011, మంగళవారం
విగ్రహాల గురించి ...........
నేను ,పాపాయి పెద్ద పండక్కి మా ఊరికి వచ్చాం .నిన్న మా ఊరి నుండి మేం మా పట్టణం వైపు వస్తున్నాం .పాపాయి మార్గ మధ్యంలో ఫలానా నాయకుడి విగ్రహాలు చాలా చూస్తూ వచ్చింది .చూస్తూ ఉండగా దానికి హటాత్తుగా
కోపమొచ్చింది .మనూరికంతా కలిపి ఒక్క విగ్రహమున్డాలి ..ఇట్లా ఈయనోక్కడివే ఇన్నేసి ఎందుకు ?ఇంకెవరు మంచి పనులు చెయలా..మదర్ తెరెసా ,మహాత్మా గాంధీ ,అంబేద్కరు వీళ్ళంతా చేయలా ? ?మదర్ తెరెసా ఇక్కడకొచ్చి చీర కూడా కట్టుకుంది ...ఆమె విగ్రహం ఎందుకు పెట్టలా?నేను డాక్టర్ని అయ్ ఒక హాస్పిటల్ కడతా ...రిచ్ ల దగ్గర డబ్బు తీసుకుంటా ,పూర్ ల దగ్గర తీసుకొను ,రిచ్ ల దగ్గర డబ్బంతా అయిపోవాలి అని ప్రకటించింది ....నాకు స్వయంగా ఇంత వరకు మదర్ తెరెసా విగ్రహం అనే మాట కలలో కూడా తోచలేదు ..ఎక్కడయనా ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలి .
మనం పెద్ద వాళ్ళం ,ఏవేవో సందర్భాల్లో ఏవేవో మాట్లాడేసుకుంటూ ఉంటాం ...పిల్లలు మాయావులు మనకు తెలియనే తెలియదు ,ఏవి వింటున్నారో ఏవి వినటం లేదో ,ఎప్పుడో ఇట్లా హటాత్తుగా అన్నిటిని క్రోడీకరించుకుని తమ స్వంత అభిప్రాయాలుగా ప్రకటించేస్తారు.పిల్లలంటే మనకు పుట్టి మనం చూడలేని మరో ప్రపంచంలోకి వెళ్ళబోతున్నమన స్వంత చైతన్యాలు ...అంతే కదా ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి