మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

14, డిసెంబర్ 2010, మంగళవారం

చంద మామ -చామంతి పువ్వు


మేఘాల కోసమని

మేఘాన్నై,తూనీగనై


ఎగురుతుంటే


రెక్కలనెవరో


కత్తిరించారు



కాలం నలిపి


పడేసిన కాయితమై


రస రంగుల లోకం


ఒకే ఒక్క పువ్వైంది


గులాబి పూల పాదాల


చేప కళ్ళ చామంతి పువ్వు



పెద్దరికాన్నయ్


నేనే కావలింతనై


నను పాపని చేసిన


వెచ్చని ,పాలుమాలిక


కావిలింతని విడిచి


చీకటి


సూర్యుడై పూయడం


చూస్తున్నా



బాయి బంధానికి


బంధీనై


కన్నకడుపుల కష్టాన్ని


పునః దర్శిస్తూ


చెట్టుకు చిక్కిన గాలి పటంలా


రెప రెప లాడుతుంటే .....


అజ్ఞాత వాసాన్ని


చూడ వచ్చిన స్నేహితుడు


అమ్మ తనమింకా


తెలీని వాడు ,అన్నాడు


కొత్త కవిత్వమేం చదివావని

చదవడానికిప్పుడు


కవి సమయాలు లేవు


అన్నీ


పిల్ల సమయాలే !







కామెంట్‌లు లేవు: