20, నవంబర్ 2014, గురువారం
19, అక్టోబర్ 2014, ఆదివారం
ఎంతకాలమిలా ...?
ఇవాళ పొద్దుటే నిదుర మంచం మీదనే పాపాయి నాకు చాలా యూ ట్యూబ్ వీడియో లు చూపించింది . అందులో ఇలాటివి కొన్ని . ఇవి చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . నా ఆశ్చర్యాన్ని పాపాయి తో షేర్ చేసాను . ఇటువంటి ఎన్ని వీడియోలు చూసినా అన్నింటిలోనూ పాపాయిలె అమ్మ పాత్ర పోషిస్తున్నారు . ఎక్కడా అబ్బాయిలు ఇలాటి బొమ్మలతో ఆడే వీడియోలు లేవు . ఎందుకలా స్టీరియో టైపిగ్గా మనం ఆడపిల్లలికి బిడ్డ బాధ్యత మనది మాత్రమె అని ,తండ్రులకు బిడ్డ బాధ్యత భార్యదే అని మెంటల్ రిసర్వేషన్స్ ని ఏర్పరుస్తున్నాం . అమ్మాయిలు మాత్రమె ఇంటా బయట ఎందుకు సతమతమవ్వాలి ?అమ్మాయిలు మాత్రమె పిల్లలు పుట్టాక ఉద్యోగానికి ఎందుకు సెలవు పెట్టాలి. వర్క్ ఫ్రం హొమ్ చేయాలి . పాలిచ్చే అన్ని రోజులూ సరే ,మిగిలిన కాలానికి ఇటువంటి బొమ్మలతో మనం మగ పిల్లల్ని చిన్నప్పటి నుండి మానసికం ఎందుకు సిద్దం చేయడం లేదు ?
22, ఆగస్టు 2014, శుక్రవారం
మేరి చాందిని !
అలా వుండి వుండి ,ఆలోచనా లోచనాలను మా అమ్మ పక్క తిప్పి .. "ప్రైమరీ స్కూల్ లీడర్ ని అవమానించింది మమ్మీ .... అమ్మ ఫ్రెండు "అన్నది . చల్లారి పోయిన గ్రీన్ టీ ని గట గటా తాగుతున్న నాకు చప్పున పొలమారింది . విషయమేమంటే మొన్న పాపాయి వాళ్ళ అమ్మ చిన్న నాటి నెచ్చలి వచ్చింది ,పాపాయికి , తాతకి జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ పోరు చూసి ఆశ్చర్యపడి " అంకుల్ కి కోపమంతా తగ్గిపోయింది కదా సామాన్య ,అప్పుడంత కోపమున్డుంటే ఇది ఇలా మాట్లాడగలిగేదా అసలు " అని వక్కాణించింది . అది విని అప్పుడు ఊరుకున్నా మూడు రోజుల తర్వాత పాపాయి బుసలు కొట్టి కోపాన్ని ఇలా వ్యక్త పరిచిందనమాట . కోపం రాదా మరి ... ప్రైమరీ స్కూల్ లీడర్ అయి వుండి అవమానింప బడటమా ......! తన ప్రవర్తన గురించిన అంత వ్యాఖ్యానం రావడమా ...!
మొన్నో రోజు పాపాయి స్వంతంగా సానం (స్నానం )పోసుకుంటూ ఉండింది . మరి అదిప్పుడు ప్రైమరీ స్కూల్ లీడర్ కదా ,మేమందరం చీటికి మాటికి ఆ పేరు చెప్పి దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వుంటాం కదా అందుకన మాట ఈ స్వంత స్నానం . పాపాయి వాళ్ళ అమ్మ బాత్రూం ముందు కుర్చీ వేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వుంది ... అక్కడ అలా రుద్దూ... ఇక్కడ ఇలా రుద్దు అని ,చూసి చూసి పాపాయి టకీమని బాత్రూం తలుపు వేసేసుకుంది . అమ్మకి ఎంత ఆశ్చర్యమో ,ఔరా ! ఎంత తెలివీ ... మాట మంతీ లేకుండా చెప్పాల్సింది ఎంత బాగా చెప్పేసింది అని .
14, మార్చి 2014, శుక్రవారం
20, సెప్టెంబర్ 2013, శుక్రవారం
ఆశ్చర్యం !
అమ్మ ఈ మధ్య చాలా పనులు పెటుకుంది . ముసలి వాళ్ళమై పోతే ఎనర్జీ వుండదు కదా ,నలభై లోపలే చేయదలచుకున్న విషయాలని ఒక దారిలో పెటుకోవాలి అని అమ్మ కోరిక . అందుకని అమ్మ పాపాయిని,నానని వదిలేసి ,పాపాయి వాళ్ళ నానమ్మ వూరిలో క్యాంపు పెట్టేసింది . మొన్న ఇంటికొచ్చింది . అప్పుడిక పాపాయి వాళ్ళ నాన అన్నాడు ... ''ఇలా కాదు కానీ, నువ్వు ప్రతి శుక్రవారం బయల్దేరి రా !మళ్ళీ సోమ వారం వెల్దువు కానీ'' అని . అప్పుడిక అది విని నిండా జలుబు చేసి వున్నపాపాయి అన్నదీ ''అవునమ్మా మేము జలుబు ,నువ్వు అమృతాంజన్ రిలీఫూ ''అని .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

