మా అమ్మాయికి అక్కలు ముగ్గురున్నారు శాంతి ,కాంచన,రాజ మల్లిక.....బ్లాగ్లో మా శాంతిని కొంచం పలకరించండి అని రాసుకున్నానే కానీ ఒక్క పోస్ట్ కూడా పెట్ట లేదు .శాంతి మా గొర్రె .మా ఇంట్లో రెండు కుక్కలు , ఒక గొర్రె ,రెండు పెద్ద బాతులు ,మూడు చిలుకలు ,రెండు కుందేళ్ళు చాలా పావురాళ్ళు ఉండేవి .ఇప్పుడు కేవలం కాంచు ,రాజాలు మాత్రమే ఉన్నాయ్ .ఎందుకో మళ్లీ చెప్తాను .మా ఊళ్ళో గొర్రెలు పొడవుగా ఉంటాయి .బెంగాల్లో గొర్రెలు పొట్టిగా బొచ్చు బొచ్చుగా క్రీస్తు దగ్గర ఉంటుందే గొర్రె పిల్ల అలా ఉంటాయి .ఒక -సారి నేను నా భర్త వాకింగ్ కి వెళుతుంటే ఒక దగ్గర రోడ్డు పక్కన గొర్రెల గుంపు ఒకటి రెస్ట్ తీసుకుంటూ ఉండింది .నేను వాళ్ళతో ముచ్చట పెట్టా,నాకొక గొర్రె పిల్లనిస్తారా అని .వాళ్ళు మాకు గొర్రె పాలతో చాయ్ చేయడం మొదలు పెట్టారు .
అంతలో అమ్మ లేని ఒక చిన్ని పాపాయి నా వడిలో కూర్చుంది సొంతంగా వచ్చి .నేనింక వాళ్ళని పీకడం మొదలు పెట్టా దాన్ని నాకిచ్చేయమని .వాళ్ళు మేం కేవలం పని వాళ్లమేనని యజమానిని అడిగి ఇస్తామని రొండు రోజుల్లో వచ్చేస్తామని చెప్పారు .వాళ్ళు నన్ను చిన్న పిల్లని చేసి అబద్దాలు చెప్పారని నాకు రొండు రోజుల తరువాత అర్థమైంది .నేను భాద పడటం చూసి మా ఆయన సరేలే వేరే దగ్గర కొనుక్కున్దువు కానీ అన్నాడు .
అప్పుడు నేను మా అమ్మాయి కలిసి ఆదివారం సంతకి వెళ్ళాం .బెంగాల్లో వారంలో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో సంతలు జరుగుతాయి .ఆవులు గొర్రెలు ఇంకా అన్ని వస్తువులు అమ్ముతారు .మేం వెళ్ళాం కదా .అక్కడ చాలా గొర్రెలు ఉన్నాయి .అప్పటికే నా స్నేహితురాలు చెప్పింది మగదైతే మనం కూర్చుని ఉన్నప్పుడు తలతో డీ కొడుతుంది ,పాపాయి ఉంది కదా అని .వాళ్లకి చాలా గొర్రెలు ఆవులు ఉన్నాయి తను స్వయంగా పసుల కాపరి కూడా అందుకే చాలా అనుభవం .అదీ కాక నాకు అమ్మాయిలంటేనే ఇష్టం .సరే సంతకి వెళ్ళాం కదా అటు ఇటు తిరిగి చూశాం .మా శాంతి కనిపించింది .మా శాంతి ఎంత అందమైనదంటే ఎలా చెప్పాలి ...పోలిక రాటం లేదు. ఆ అందానికి ఆశ్చర్య పడి ,తెచ్చేసుకుని స్నానం పోసేసి ,శాంతి అని పేరు పెట్టుకున్నాం .
దానికప్పుడు నాలుగు నెలలు ఇప్పుడు మూడేళ్ళు .మా అమ్మయితోనే తిరిగేది .ఎటు వెళితే అటు .శాంతి అంటే వచ్చేస్తుంది .దానికి గడ్డి తినడం అస్సలు నచ్చదు.దోసలు ,మురుకులు వంటివి చాలా ఇష్టం .కానీ పాపం చాలా అనారోగ్యం చేసేస్తుంది .అప్పుడు పాపాయి వాళ్ళ నానకి చాలా పని ఔతుంది .ఒక్కో సారి అంటే ఆది వారాలు నానకూడా ఇంట్లో ఉండిఅందరం కనపడితే దానికి చాలా సంతోషం వేసి డాన్స్ చేస్తుంది .దాని తరువాత మేం కాంచన రాజ మల్లికాలని తెచ్చాం .వాళ్ళ ముగ్గరికి మంచి స్నేహం .ఎప్పుడు కలిసే ఉంటారు .నేను పొద్దుటే పూజ పూర్తి చేయగానే మా శాంతి దేవుడుకు పెట్టిన పూలన్నీ ఒక్కటి ఉంచకుండా తినేస్తుంది మా కాంచు కొబ్బరి చిప్ప పట్టి కేళి పోతుంది మా రాజమ్మ మాత్రం చాలా డీసెంట్ .దానికిలాటి పనులు అసలు నచ్చవ్. కానీ బాధ ఏమిటంటే ముగ్గరూ మాతోనే బెడ్ రూం లోనే ఉండాలంటారు .శాంతి కేమో చాలా సార్లు ఉష్హు వస్తాయి అదో కష్టం .పాపాయి వాళ్ళ నానకి పోయిన సారి బదిలీ అయినప్పుడు అస్సలు గడ్డి దొరకక చాలా కష్ట పడ్డాం.అందుకని శాంతిని ,రాజ హంసలని ,ఈ ఊళ్ళో విపరీతంగా నక్కలున్టాయన్నారు అందుకని కుందేళ్ళని కొన్ని పావురాలని మా ఊరికి పంపాం.పాపం బిడ్డ రాజమండ్రి వరకు లారీలో తరువాత కారులో దాదాపు 2000 కిలో మీటర్లు .ప్రయాణించి వెళ్ళింది .దాని అందం దానికెంత కష్టం తెచ్చింది కదా .
మా పెదమ్మకి దాంతో చాలా అనుబందం ఇప్పుడు .బిడ్డ లాగా .మా ఊర్లో ఇటువంటి గొర్రెలు ఉండవు కదా అందుకని వార్త జిల్లా పేపర్లో దాని ఫోటోవేసి వార్త రాసారు .కానీ మా అమ్మాయికి ఇప్పుడు శాంతి అంటే చాలా కోపం .ఎందుకంటే అదిప్పుడు మా పెదమ్మ ఎటు వెళితే అటు వెళుతుంది .మా అమ్మాయి పిలుస్తే వెంటనే కూడా పలకదు .నా కూతురు అది గుర్తొచ్చినప్పుడల్లా తిడుతుంది. నా బ్లాగ్లో ఉండి కదా అక్కడ చూసినప్పుడు కూడా తిడుతుంది .అస్సలు నేనింక దానితో మాట్లాడనే మాట్లాడను అని ఒట్టు కూడా పెట్టు కున్నది .ఒక్కో సారేమో శాంతిని తెప్పించు అమ్మాఅని అడుగుతుంది .తెప్పించాలి ఏంటో ఈ జీవితం కుదురుగా ఒక దగ్గర ఉండి అందరిని చూసుకుంటూ ఉండలేక పోతున్నానే అనే దిగు లు ఒక్కోసారి చాలా ముంచేస్తుంది .
4 కామెంట్‌లు:
mee santhi ni nenu chus
santhi ni nenu chusaka mee post chadhivaanu ,naku appudu chusi nappudu are bengal gorre chalaa neetu ga andham ga vundhe ani anipinchindhi.kani ippudu dhaani katha antha chadhuvuthunte naaku appudu adhui nemaruvesukuntuu pakkaku vaali padukuni restu theesukuntunna seen gurthukosthondhi...........bahusaaa adhi kudaa aaa roju thana bengaal gnapakaaaalu nemaru vesukuntunnadhemooo......
అప్పటి జ్ఞాపకాలు నేమరువేసుకుంటుందని మీరు అన్న మాట నన్ను చాలా భాధించింది ,హాస్టల్ లో ఉన్న బిడ్డ గురించి తల్లి పడే భాద లాటిది any how thank you అండి.
thank you krishna mohan
కామెంట్‌ను పోస్ట్ చేయండి