పాపాయి వాళ్ళ నాన దేసాటనకి వెళ్ళాడు .మధ్యలో ఫోన్ చేసి పలకరించాడు ఏం చేస్తున్నావ్ అని ....ఏం చేసాను ,పలకరించే నాధుడు లేక ,ఈ రోజంతా ఒక పాట వింటూ గడిపాను .ఏం చేస్తున్నా హెడ్ ఫోన్స్ తీయకుండా గడిపాను .ఆ పాటని కూడా కేవలం రెండు వాక్యాల కోసం విన్నాను .అందులోను రెండో వాక్యం కోసం మరీ విన్నాను ....ఆ రెండో వాక్యం ''నీలోనే కొలువున్నోడు ..నిన్ను దాటి పోనే పోడూ..!మొదటి వాక్యం ''లోకాలనేలేటోడు నీకు సాయం కాక పోడు ''.పాట సదా శివ సన్యాసి తాపసి కైలాస వాసీ.. .''
శివ పార్వతులు వివాహానంతరం అస్సాం ప్రాంతం లో విహరించారట అందుకే ఆ ప్రాంతాన్ని కామ రూప దేశమని అంటారట . కామాఖ్య మందిరం నుండి వస్తున్నపుడే అనుకుంటా మొదటి సారి ఈశ్వరుడు నా ప్రశ్నల పెద్ద పెట్టెలోకి చేరాడు .ఎలాంటి వాడై ఉండొచ్చు అతను ?ఒక రాజ పుత్రిక ,స్మశాన వాసిని ,సర్ప ధరుడిని ,బిక్షుకుడిని ,కట్టు బట్ట లేని వాడిని ఏం చూసి ప్రేమించి ఉండొచ్చు ?సహచరిని పాదాల పాల చేయని అతని సంస్కారపు మూలాలేవి ?భార్యే కదా ,ప్రియురాలు కూడా కాదు కదా ,అయినా సతి మృత శరీరాన్ని చూసి అతను ఎందుకలా విలయ తాండవం చేశాడు .
[నా స్నేహితురాలి తండ్రి అరవై ఏళ్ళ వయసులో ,భార్య మరణించిన ఐదు నెలలకే ,పునర్వివాహం చేసుకున్నాడు .ఇంటికొస్తే అన్ని ఉడుకు నీళ్ళు పెట్టించే వాళ్ళుంటే బాగుంటుంది కదా అన్నది ఆయన ఆలోచన . వేడి నీళ్ళకే ఐతే గీసర్ పెట్టించుకుంటే సరి పోదా అని జోక్ చేసాడు నా తమ్ముడు . ముగ్గురూ కూతుర్లే.ముగ్గరూ మాట్లాడటం మానేశారు .మా అమ్మని అంత త్వరగా మరచి పోయాడా మా నాన అని ...జ్ఞాపకాలు బ్రతికి ఉంటే మనిషి మరణించనట్టే .అవే లేనపుడు ఐదేళ్లకి ఐదు నెలలకి తేడా ఏముంటుంది .]
ప్రియత్వాన్ని అర్థ నారీశ్వరత్వంగా మలచిన ప్రేమౌన్నత్యం అతనికి ఏ దేవి వరం ?ఇంతలా స్త్రీని గౌరవించిన మరో భగవంతుడు ఏ చరిత్రలోనైనా ఉన్నాడా?యౌవనంలో ఉన్న భార్య పట్ల భాద్యతను విస్మరించి దొంగలా పారి పోయిన బుద్దుడిది స్వ సుఖ వాదం కాదా ?ప్రేమించే భార్య.. అడిగి ఉంటే అర్థం చేసుకుని అనుమతించక పోయేదా ?
[నా స్నేహితురాలి తండ్రి అరవై ఏళ్ళ వయసులో ,భార్య మరణించిన ఐదు నెలలకే ,పునర్వివాహం చేసుకున్నాడు .ఇంటికొస్తే అన్ని ఉడుకు నీళ్ళు పెట్టించే వాళ్ళుంటే బాగుంటుంది కదా అన్నది ఆయన ఆలోచన . వేడి నీళ్ళకే ఐతే గీసర్ పెట్టించుకుంటే సరి పోదా అని జోక్ చేసాడు నా తమ్ముడు . ముగ్గురూ కూతుర్లే.ముగ్గరూ మాట్లాడటం మానేశారు .మా అమ్మని అంత త్వరగా మరచి పోయాడా మా నాన అని ...జ్ఞాపకాలు బ్రతికి ఉంటే మనిషి మరణించనట్టే .అవే లేనపుడు ఐదేళ్లకి ఐదు నెలలకి తేడా ఏముంటుంది .]
ప్రియత్వాన్ని అర్థ నారీశ్వరత్వంగా మలచిన ప్రేమౌన్నత్యం అతనికి ఏ దేవి వరం ?ఇంతలా స్త్రీని గౌరవించిన మరో భగవంతుడు ఏ చరిత్రలోనైనా ఉన్నాడా?యౌవనంలో ఉన్న భార్య పట్ల భాద్యతను విస్మరించి దొంగలా పారి పోయిన బుద్దుడిది స్వ సుఖ వాదం కాదా ?ప్రేమించే భార్య.. అడిగి ఉంటే అర్థం చేసుకుని అనుమతించక పోయేదా ?
అయినా మనం శివుడి ప్రేమ స్వరూపాన్ని చెప్పుకోవాల్సినంతగా చెప్పుకోం కదా .బహుశా శివుడు PR విషయంలో శ్రద్ద పెట్ట లేదేమో . ప్రచారం లోనే అన్నీ ఉన్నాయిష! ' గురు ' లు చెప్తున్నారు . అప్పుడు కూడా అదే సూత్రం మనుగడ సాగించి ఉంటుంది .శివుడి జీవితంలో ఏ గంగలు మంగలు ఉండి ఉండరు అవంతా ప్రక్షిప్తాలు. కావాలని వేసిన మచ్చ .నేను నమ్మడం లేదు .శివుడి గురించి ..రోమిలా థాపర్ నొ మరోకరిన వెదకాలి బద్దకాన్ని వదిలించుకుని .
ఎంత చిన్న వాక్యం కదా నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు అనడం .కొలువై వున్నది మనలోనే అయితే మన అనుమతి లేకుండా దాటి ఎలా పోగలడు.దాటి పోయానని తను అనుకున్నా ఉన్నాడని మనం అనుకున్నంత సేపు అతను బంధీనే కదా ...కాదంటే మనం బంధీలం. రెండూ ఒకటే సూక్ష్మంగా చూస్తే .
మొన్నో రోజు స్నేహితురాలు ఏదో రాగం చెప్పింది .ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు .పాడుతుంటే చాలా సార్లు ఏడుపొస్తుంది అన్నది .పాడుతుంటే కాదు కానీ ..దుక్కపు తుఫాను గాలులు అల్ల కల్లోలం చేసేసిన ప్రతి సందర్భం లోను నేను ఆస్రయించేది త్యాగరాయ ''నగు మోము గనలేని '' కీర్తన . పాడుకుంటూ ''ఖగ రాజు నీ ఆనతి విని వేగ చన లేదో గఘనానికి ఇలకూ బహు దూరంబని నాడో '' అన్న వాక్యాల వద్దకు చేరితే చాలు మనసు మూల మూలలా ఊరుతున్న కన్నీటి చెలమలన్నీ కలుసుకుని పొంగి పొరలుతాయి. తడిసి అలసిన కాసేపటికి మనసులోకి ప్రశాంతత తోసుకొచ్చేస్తుంది.అదే తనతో చెప్పాను ,ఆశ్చర్య పడుతూ తనన్నదీ ..సరిగా ఆ వాక్యాల వద్దే నాకూ సేమ్ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకలా అని .బహుశా త్యాగ రాయ స్వామి ఆ పదాలను ఒక రాగంలో పొదిగినప్పటి నుండీ ,అలా ఎంతో మందికి ఆ కీర్తన ఓదార్పునిచ్చి ఉంటుంది .
ఆ కీర్తనకి ఉన్న శక్తి అంతా అద్భుతమైన ప్రేమ భావన నుండి ఉద్భ విన్చిందే . ఎంత ప్రేమ ఉండాలి అలా అనుకోవాలంటే ...నగు మోము చూప రాని భగవంతుడ్ని ఒక్క మాటా అనకుండా ,ఖగ రాజు నీ ఆనతి విని కూడా త్వరగా ఎగర్లేదేమో..పైగా ఆకాశానికి, భూమికి చాలా దూరం కదా అనేసాడేమో ....లేక పోతే నువ్వు రాటం ఇంత ఆలస్యం ఎందుకవుతుంది అని నెపాలు ఇతర్లు మీద పెట్టేస్తున్నాడు .ఎంత ప్రేమ ఉండాలి అలా అనుకోవాలంటే .
మరుగేలరా ఓ రాఘవా కూడా అంతే ,,,అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య ..అంటూ నన్ను బ్రోవమని ప్రాదేయ పడటంలో ఎంత నిరహంకారత ఉంది !బహుసా ప్రేమకి ఆ సర్వం సమర్పయామి భావం కావాలేమో .అన్నీ వదిలి,, నిన్నె గాని మదినీ ఎన్న జాలనొరులా అని ప్రకటించాలేమో.కానీ అలా ప్రకటించేసిన తరువాత ఆ భక్తుడంటే భగవంతుడికి బోర్ కొట్టదా?సర్లే వెల్లోచ్చులే నిదానంగా , ఏమనుకోడులే భక్తుడు ,ఒకవేళ అనుకున్నా ఖగ రాజుని అంటాడు కానీ నన్ను అనడులే అనేసుకోడా ?.
ఏమో నాకు భగవంతుడి పట్ల కూడా ,తమల పాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటి అంటాననే భావమే ఉంటుంది .అలా అనుకుంటే భగవంతుడురాడా ?.ఎందుకు రాడు వస్తాడు !.నిర్లక్ష్యం చేయక రమ్మన్నప్పుడు చక్కగా క్రమశిక్షణతో సమయానికి వచ్చేస్తాడు .సర్వం సమర్పించామని చెప్పక్కర్లేదు .భగవంతుడు కదా పెంకి ప్రేమల్ని కూడా కనుక్కుంటాడు !.
1 కామెంట్:
Hryudayaniki hathukupoye varnana..
ee post lo meeru rasina anni sangatulu naaku baaga nachaayi.. paramasivudi ni meeru baagaa ardam chesukunnnaaru ani anipinchidi.. nagumomu.. kirtana enni sarlu vinnaano.. bhavam gurinchi eppudu alochinchadu /thattaledu.. mee pariseelna chalaa chaala bavundi
కామెంట్‌ను పోస్ట్ చేయండి