మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

28, మార్చి 2012, బుధవారం

పాత కాలపు ఇంటర్నెట్టు ...!



మొన్నోఆదివారం రోజు ,నేను తలనొప్పని ముసుగుపెట్టా .పాపాయి వాళ్ళ నాన్న ఏదో పుస్తకం అంతు చూస్తున్నాడు.అయితే పాపాయి ఏం చేస్తూ వున్నట్టూ? నాక్కూడా అచ్చు అట్లాగే డౌట్ వచ్చేసి లేచి చూద్దును కదా, నా బిడ్డ సీరియస్ గా కంప్యూటర్లో డాక్టర్ బార్బీగేమ్స్ఆడేస్తూ వుంది .అసలే పిల్లల పుస్తకాలూ యీ పిల్లల పుస్తకాలూ చదివేసి పాపాయిని పరిశోధనా శాలగా కదా చేసుకుని వున్నాను,ఆందుకని గొప్ప దిగులేసేసి ,లే పాపాయి లే అసలకి ఇప్పుడే పెద్ద బాలశిక్షలో అరుందతీనక్షత్రం గురించి,ధ్రువనక్షత్రం గురించీ చదివా వినవా అన్నాను .అంతే పాపాయి చిటికెల్లో సిస్టం ముందు నుండి లేచి ఏందమ్మా ...ధ్రువనక్షత్రమంటేనా ...?అనుకుంటా పిల్లి కూనలా వెనకాల వచ్చింది .ఇద్దరం నక్షత్రం గురించీ ఇంకా పెద్దబాలశిక్షలో ఏమేం వున్నాయో ముచ్చటించుకుంటా వుండినాం .ముచ్చట్లలో పాపాయి 'పెద్దబాలశిక్ష అంటే పాతకాలపు ఇంటర్నెట్టు' కదమ్మాఅన్నది .ఆమాట విని నేను చాలా ఆశ్చర్యపడి భలే చెప్పావే ఆమ్మలూ అని మురిసా ..అప్పుడు పాపాయి,నేనుచెప్పలేదమ్మ్మానువ్వేచెప్పావు అని అన్నదీ .ఈ సారి నాభోధనకి నేనే ముచ్చటపడీ ,నాబిడ్డ జ్ఞాపకశక్తికి చాలా మురిసిపోయాను .


నిజం చెప్పమంటారా ...?

నిజంగానే ...పెద్దబాలశిక్ష,పాతకాలపు''వికీ''.

8 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

పాపాయి మాట ముత్యాల మూట..

lalithag చెప్పారు...

:)

గోదారి సుధీర చెప్పారు...

@జ్యోతిర్మయి
thank you

గోదారి సుధీర చెప్పారు...

@lalithag
thank you

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అవును కదా! పిల్లల జ్ఞాపక శక్తి ముందు.. పెద్దవాళ్ళు ఓడటం నిజంగా ఆనందం. చాలా బావుంది.

పెద్దబాల శిక్ష బహుమతిగా ఇస్తే కూడా చాలా బావుంటుంది..

మీరు చక్కని పోలిక చెప్పారు. ఇది ఇంకా బావుంది.

గోదారి సుధీర చెప్పారు...

వనజ గారూ

ముందుగా థాంక్స్ .అవును పెద్ద బాల శిక్ష ను బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది .నేను పాపాయికి బహుమతిగానే ఇచ్చాను .దాంట్లో ఏం రాసానంటే ''పడి పోయినా లేసి తప తపా నడుస్తున్నందుకు షోవాకిరణ్ కి అమ్మ'' అని దాని మొదటి అడుగుల కి బహుమతి ఇచ్చాను.

తృష్ణ చెప్పారు...

బావుంది బహుమతి + అందులో రాసినదీ కూడా !ఇదే పుస్తకం కాపీలు కొని మేము కొందరికి బహుమతి ఇచ్చాం కూడా.

గోదారి సుధీర చెప్పారు...

thank you trushna garoo...