అప్పుడు పాపాయి వయసు ఏడాదో ,యాడాదిన్నరో వుంటుంది. సంక్రాంతి వచ్చింది .బుజ్జి బొమ్మకి బట్టలు కావద్దా ?చిలక పచ్చటి డ్రెస్ కుట్టించా .దాని మీద బాతు బొమ్మ గీశా.రేపే సంక్రాంతి .అప్పుడేం చేసాను ??సాయంత్రం మూడు గంటల వేళ మా మిద్దె పైకి వెళ్లి కూర్చుని ,ఏకాగ్రతగా ఎంబ్రాయడరీ చేయటం మొదలెట్టాను .రెండు మూడు గంటల్లో అయి పోయింది .ఎంత ముద్దుగా వచ్చిందో.ఆ చొక్కా వేసుకున్న పాపాయి నా కళ్ళ ముందు అట్లాగే వుంది ఇప్పటికీ .
ఆ తర్వాత పాపాయి పెద్దదయింది .చొక్కా చిన్నదయింది.కానీ ఆ బాతు అంటే నాకు ఎంత ఇష్టమో !!అందుకని ఏం చేసానంటే ,ఎంచక్కా దాన్ని కత్తిరించి వాల్ హంగింగ్ చేయించా .ముద్దుగా చక్కగా ఆ సాయంత్రాన్ని గుర్తు చేస్తూ నేను కుట్టిన ఆ బాతు ,నా దగ్గర శాశ్వతత్వాన్ని పొందేసింది.పాపాయి పెద్దయ్యాక కూడా చూసావా నేను నీకోసం ఎన్ని చేసానో అని చూపించేసి బెదర కొట్టెయ్యడానికి సోదాహరణంగా...అన మాట :))
4 కామెంట్‌లు:
chaalaa baagundi. paapaayi pai Unna "Amma prema"laa.
sweet memory:)
వనజవనమాలి gaaroo
thank you
అనికేత్ gaaroo thank you
కామెంట్‌ను పోస్ట్ చేయండి