మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

8, ఏప్రిల్ 2015, బుధవారం

నాన్నకి తగ్గ కూతురు




స్త్రీవాదిని కూడా కాబట్టి పాపాయి వాళ్ళ నానకి నువ్వు నాకు నచ్చావ్ ... కలిసుందాం రా .. . అని నేనే చెప్పాను . అలా చెప్పే రోజున పల్లకీలో వున్న పెళ్లి కూతురు ,బోయీలు [స్వయంగా ]ఎంబ్రాయడరీ చేసిన బంగారు రంగు చుడీదార్ ఏసుకుని ,మా యూనివెర్సిటీ లో lh3 ముందు వున్న బండ రాయి పై కూర్చుని మసక చీకటిలో చంద్రోదయాన్ని చూస్తూ ''మనసున మల్లెల మాలలూగెనే ''పాట పాడాను . తను ''చాలా బాగా పాడారు '' అని కాంప్లిమెంట్ చేసాడు . అలా ఆ ఘట్టం గడిచిపోయింది . 
ఆ తరువాత చాలా ఏళ్ళకి పాపాయి కూడా పుట్టేసి కాస్త పెద్దది కూడా అయిపోయాక ఒక రోజు మా ఆయన కారులో ఎక్కడికో వెళుతూ నాకు ఫోన్ చేసి ''ఆ రోజు నువ్వు పాడావే మనసున మల్లెల మాలలూగెనే  పాట అదొచ్చింది రా ఇప్పుడు fm లో .. కానీ ఆమెవరో నీ అంత బాగా పాడలేదు '' అనేసాడు  భానుమతి గార్ని .. తన పక్కన పండితమ్మన్యులు ఎవరూ లేరని తెలుసు గనుక గుండె దిటవు చేసుకుని ఏమి నా సౌభాగ్యము అని ముచ్చట పడ్డాను . 
ఇన్నాళ్ళకి ఇవాళ నా స్నేహితురాలు పాపాయి వాళ్ళ నానకి నాకు ప్రేమ ఇంకా ఏర్పడక ముందు నేను నా ప్రతిభను ప్రదర్శించడం కోసం పాడిన ''రాత్  షబ్నమి భీగి  చాందినీ ... '' పాటని గుర్తు చేసింది . తనకి కాస్త పాడి వినిపించాక , సరే గుర్తొచ్చింది కదా అని ప్లే చేసి వింటున్నాను ,ఇంతలో స్నానం చేసి వచ్చిన పాపాయి ఆ పాట  విని ''ఎవరామె ?నువ్వు పాడినంత బాగా పాడటం లేదే .. నువ్వెంత స్వీట్ గా పాడావమ్మ ''అనేసింది ఆశా భోంస్లే గారిని . 
దీనికంతటికీ అర్థం   సుధీర భలే పాడుతుందని అస్సలు కానే కాదు ... సుధీర  సౌభాగ్యం అంతటిదీ అని ....:). 

కామెంట్‌లు లేవు: