పాపాయి ఒక బొమ్మ వేసింది .పంప [బొమ్మలు నేర్పే అమ్మాయి ]అన్నదీ రవీంద్రుడిలా వేసిందీ అని .నాన్న అన్నాడూ ఏలే లక్ష్మణ్ బొమ్మ లా ఉంది అని .అమ్మ పాపాయిని ఎప్పుడూ పొగడదు .కానీ అమ్మ ఆ బొమ్మని చూసి ఒక కవిత రాసుకుంది !
వర్చువల్ రియాలిటీ
వర్చువల్ రియాలిటీ
ఉదయ మద్యాహ్నాలు
నువ్వు నాతో సంభాషి స్తుంటావ్
నేనేదో అంటాను
నువ్వేదో అంటావు
రంగులద్దుతున్న కుంచెపై
కన్నీరు పడి
చిత్రంలోని పడవలు
కల్లోలమవుతాయ్
మలిసంధ్య కాటుక దిద్దుకుంటున్న
దృశ్యాన్ని చూస్తూ
నువ్వు నాతో కబుర్లాడుతావ్
మాటా మాటా అల్లుకుని
ముళ్ళ కంచెలు పదివేల చేతులతో
జయ ద్వానం చేస్తాయ్
నువ్వు ముభావమౌతావ్
నేను మోయలేని మౌనాన్నవుతాను
కటిక చీకట్లు ఊడలల్లుతుంటాయి
హటాత్తుగా నువ్వు అనంత దూరానివవుతావ్
నేను అడుగు వేయరాని స్తబ్దనవుతాను
హ్రదయం అలవిమాలి
కళ్ళ గట్లను తెంచి వేస్తుంది
యెర్రటి నయనాకాసంపైకి
అలుపెరుగని కొత్త రోజు నడిచొస్తుంది
అలసిన మనసు విముక్తాన్వేషణ
మొదలు పెడ్తుంది
వెళ్ళినంత దూరమూ
వెదుకులాటల దారి
మరీచికా కాసారమై
కావిలించుకుంటుంది
6 కామెంట్‌లు:
oh..baagundi mii kavita..inkaa untE post pettandi..
paapaayiki bomma baagundani cheppandi.maa paapa koodaa ilaanE vEatundi..
త్రష్ణ గారు !థాంక్స్ . ఇంకానేమో మరి మీ పాపాయికి చెప్పండి నేను తనని పోగుడుతున్నానని . !
బొమ్మ చాలా బాగుంది. కవిత బాగుంది. కానీ ఎందుకో కవితలో బాధ కనిపిస్తోంది
నీకు దిగుళ్ళు అర్థం కాడం ఎప్పటి నుండి అమ్మాయి !
సహచరితో సంభాషించేటప్పుడు అభిప్రాయభేదాలు వచ్చ్చినప్పుడు కలగే భావాలు ను గురించి ఈ కవిత అనిపించింది,కరెక్టే నా... ...
ముళ్ళ కంచెలకు చివర్లు చిందర వందరగా వేళ్ళు చాపినట్టు ఉంటాయి కదా ,అవి వేల చేతులు చాపినట్టు ఉంటాయి అనటం
చాలా అధ్బుతమైన వర్ణన అనిపించింది.
"ముళ్ళ కంచెలు పదివేల చేతులతోజయ ద్వానం చేస్తాయ్"
"రంగులద్దుతున్న కుంచెపై కన్నీరు పడి చిత్రంలోని పడవలు కల్లోలమవుతాయ్ "అనటం చాల బాగుంది.
ఈ రెండు వర్ణనలు రెండు వ్యతిరేక బావాలను సరి కొత్తగా ,చాల అధ్బుతం గ పలికించాయి.
క్రిష్ గారు మీ వ్యాఖ్య చాలా బాగుంది .మీరిలా అందమైన వ్యాఖ్యలు చేయటం ,వాటిని బ్లాగ్ రూపేణా నేను చదవ గలగటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది .అయినా ఒక సారి శీర్షిక చదివి మళ్ళీ కవిత చదవండి వీలైతే !
కామెంట్‌ను పోస్ట్ చేయండి