పాపాయి తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టి దాదాపు ఆరు నెలలు అయింది . ఈ వారం రోజులుగా రోజుకు మూడు ఆటలు చొప్పున పాత సినిమాలు చూస్తూ వుంది . గోదారీ గట్టుందీ ,ఔనంటే కాదనిలే ,బొమ్మను చేసి ప్రాణము పోసి ,నీవు లేక వీణా ... వంటి పాటలు వింటూ వస్తూ వుంది . అందుకనేమో ఈ రోజు పాట రాస్తానమ్మా అని చెప్పి ఈ పాట రాసింది .
ప్రకృతి
చల్ల చల్లని గాలి వీస్తుంటే
నేను చెట్లు క్రిందట బానిసలా వుంటే
భలే ఉందిలే
ఆడవారు ముగ్గులేస్తూ వుంటే
సంతోషంగా ఉందిలే
బంతి పూలు
అలా మెదలుతూ వుంటే
భలే ఉందిలే
ఆకాశంలో పక్షులు
ఎగురుతూ వుంటే
సంతోషంగా ఉందిలే
నీటిలో చేపలు
ఎగురుతూ వుంటే
భలే ఉందిలే
నేను ఇలా ఈ జగమును
సృష్టించినది ఎవరు అని
తెలుసుకోలేక బాధపడుతూ వుంటే
నవ్వొస్తుందిలే
3 కామెంట్‌లు:
Nee kavitha chadivinanka
bale santoshanga undile
మీనాక్షి నువ్విలా రాస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందిలే !
God Bless you !!
సాహితీ మీనాక్షి గీతం, ప్రకృతీసంబరం -
konamamanini
కామెంట్‌ను పోస్ట్ చేయండి