మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

19, అక్టోబర్ 2014, ఆదివారం

ఎంతకాలమిలా ...?



ఇవాళ పొద్దుటే నిదుర మంచం మీదనే  పాపాయి నాకు చాలా యూ ట్యూబ్ వీడియో లు చూపించింది . అందులో ఇలాటివి కొన్ని . ఇవి చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . నా ఆశ్చర్యాన్ని పాపాయి తో షేర్ చేసాను . ఇటువంటి ఎన్ని వీడియోలు చూసినా అన్నింటిలోనూ పాపాయిలె అమ్మ పాత్ర పోషిస్తున్నారు . ఎక్కడా అబ్బాయిలు ఇలాటి బొమ్మలతో ఆడే వీడియోలు లేవు . ఎందుకలా స్టీరియో  టైపిగ్గా మనం ఆడపిల్లలికి బిడ్డ బాధ్యత మనది మాత్రమె అని ,తండ్రులకు బిడ్డ బాధ్యత భార్యదే అని మెంటల్ రిసర్వేషన్స్ ని ఏర్పరుస్తున్నాం . అమ్మాయిలు మాత్రమె ఇంటా  బయట ఎందుకు సతమతమవ్వాలి ?అమ్మాయిలు  మాత్రమె పిల్లలు పుట్టాక ఉద్యోగానికి ఎందుకు  సెలవు పెట్టాలి. వర్క్ ఫ్రం హొమ్ చేయాలి . పాలిచ్చే అన్ని రోజులూ సరే ,మిగిలిన కాలానికి ఇటువంటి బొమ్మలతో మనం మగ పిల్లల్ని చిన్నప్పటి నుండి  మానసికం ఎందుకు సిద్దం చేయడం లేదు ?