మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

28, మే 2012, సోమవారం

ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు ...!




సరి కొత్త కాపురం
హాల్లో చాప
చాప నిండుగా పుస్తకాలూ
గాలి కెగిరే కాయితాలూ
కావాలని కూరుకుపోయే మనసూ ,బుద్దీ
మగ కాఫీ
అప్పుడప్పుడూ గైడ్ వేసే నాలుగు అక్షింతలూ
అందమైన యూనివర్సిటీ
తెలుగు డిపార్ట్మెంట్ ఫస్టూ ,హ్యుమానిటీస్ సెకండూ
వెరసి ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు నా ఈ పుస్తకం

[నా పీ హెచ్ డీ పరిశోధన
''తెలుగు ముస్లిం రచయితలు -సమాజం-సంస్కృతి''
.దానికి మంచి కాలం ఎప్పుడొస్తుందో మరి :))]



పి .ఎస్ : హైదరాబాద్ లో చదువుకున్నన్ని రోజులూ మా నాన నేనెప్పుడు ఇంటికి వెళ్లాలనుకున్నా రాత్రంతా నెల్లూరు నుండి ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని రాత్రంతా ప్రయాణం చేసి నెల్లూరికి తీసికేల్లెవాడు. అమ్మాయినని కాదు .అబ్బాయిలకంటే అపురూపమని.ఎం ఫిల్ డీటీపీ నెల్లూరులో చేయించాం
మా నాన అంతా పూర్తయ్యాక నన్ను షాప్ కి తీసికెళ్ళాడు.అయినా తిరిగొచ్చేసరికి రాత్రి పన్నెండయింది .మరుసటి రోజు కొత్త ఏడాది .నేనూ మా నాన ఆ చీకట్లో వాహనాలు లేని రోడ్ల పై కబుర్లు చెప్పుకుంటూ నడవడం ఓ జ్ఞాపకం .


ఎం.ఫిల్ మీ గైడెన్స్ లోనే చెయ్యాలనుంది అంటే నను మన్నించి కాలేజ్ కమిటీ ని ఒప్పించారు కే కే ఆర్ సర్.వారు నాకంటే
నాలుగాకుల ఎక్కువ మొహమాటస్తులు .మొత్తం పరిశోధనలో నేను గైడ్ ని కలిసిన రోజులు వేళ్ళకి కూడా సరిపోనన్ని రోజులు.అయినా ఈ పరిశోధన వారి
మార్కు పరిశోధన.అదో జ్ఞాపకం

కొత్త కాపురపు తొలి రోజులు .అప్పుడే మా మావ గారు రిటైరై కొడుకు కి ఒక స్కూటర్ కొని పెట్టారు.
ఆ కొడుకు ఆ స్కూటర్ పై నన్ను రత్న మాల,వేణు గోపాల్,సీఫెల్ సభలూ ,లైబ్రరీలూ ఒకటేమిటి తెగ తిప్పాడు ఈ పరిశోధన కోసమని .విసుగనేదే వుండదు బంగారానికి అప్పటికీ ఇప్పటికీ ...అదో జ్ఞాపకం .

అప్పటి వరకు నాకు స్కూటర్ ఎక్కడం అనుభవమే లేదు .మొదటి సారి బోల్డు సిగ్గు పడుకుంటూ
ఆ నీలం రంగు స్కూటర్ ని ,నీలం రంగు చుడీదార్లో వున్నా నేను యెట్లా కూర్చోవాలో తను చెప్తే సిగ్గు పడుకుంటూ
కూర్చున్నాను .ఆ తరువాత అది నాకు బోలెడు లోకాలని చూపించింది .అదంటే నాకు అలవిమాలిన ప్రేమ.అందుకని దాన్ని బద్రంగా దాచుకున్నాను మా ఇంట్లో .అదో జ్ఞాపకం .

ఏదైనా రాసిన తరువాత దాని మొహం చూడాలంటే ఎందుకో చిరాకు నాకు .అందుకే ఇది మార్పూ చేర్పులూ చేయని అప్పటి పరిశోదనే . పబ్లిషర్ అచ్చు తప్పులు చూడమంటే నా వల్ల కాదంటే కాదనేసాను. వారే ఆ పని చూశారు.అదొక మంచి స్నేహపు జ్ఞాపకం .

ఈ ఇంద్ర ధనస్సుకి రంగులనిచ్చిన జ్ఞాపకాలివి ! అందుకే ఈ పలవరింత !

2 కామెంట్‌లు:

Dr.Pen చెప్పారు...

Congrats! It's great to look at Dr.Samanya. You remember every thing but you dont have time and space for an old friend...what a pity? Nalugu mukkala email kuda karuve maaku..em chestham...pedda rachayitri aipoyaru kada. But I feel Proud to read about you, my friend.

గోదారి సుధీర చెప్పారు...

ఇస్మాయిల్
థాంక్ యు .అంత గొప్ప స్నేహం కదా ఇండియా వచ్చిపలకరించ లేదేం మరి? నాకు మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోడానికి స్పేసు,టైము కరువయ్యాయా .....మరి మీకు ?అంత దూరం నుండి వచ్చి రాకుండా వెళ్ళటం ఏం మాయదారితనమట
చాలక మళ్ళీ దబాయింపులు కూడానా ?నాకు మీ అన్నా చెల్లెల్లిద్దరి మీదా కోపం వచ్చింది వెళ్ళండి .

నా కథల పుస్తకం వచ్చిన తరువాత ఇదీ అదీ కలిపి మీకు పంపుతాను సరేనా .పలకరింపుకు థాంక్ యు.