మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

16, మార్చి 2011, బుధవారం

పాపాయిలు - ఒప్పందాలు


నాకివాళ హటాత్ గ నా phd గుర్తొచ్చింది నిద్ర లేవగానే .నా కూతురు పైన వాళ్ళ నాన్న పైన చాలా కోపం వచ్చేసింది .అబ్బ ఈ జీవితం మరీ ఇంత దుర్మార్గంగా ఐపోయిందే అని దిగులేసింది .మా అమ్మకి నాకు కేవలం 18 ఏళ్ళు తేడా మేమిద్దరం మంచి స్నేహితుల్లాఉంటాం .అంచేత నాకు పెళ్ళైన వెంటనే పాపాయిని పుట్టిచ్చేసుకోవాలి అని కోరిక కలిగింది అప్పుడు నేను కొంచం పెద్దయ్యే సరికి ఇంకో స్నేహితురాలు వస్తుంది కదా అని .

ఇంట్లో నేనే పెద్ద దాన్ని. అంతకు ముందు నేనెప్పుడు పిల్లల పెంపకాన్ని గమనించనేలేదు .అంచేత మరేం ఆలోచించకుండా పాపాయిని పుట్టిన్చేసుకున్నాను .పాపాయి పుట్టినప్పుడు ఎంత సంతోషమో ప్రపంచపు అన్నీ ద్వారాలు మూసేశాను ఒకటే ప్రపంచం .సొంతంగా నేర్చుకుని స్నానం పోసేదాన్ని .ఇంకా అన్నీ పనులు నేనే చెయ్యాలి .ఎవరూ చేయ కూడదు .నా కూతురు రాత్రులు నైట్ డ్యూటీ చేసేది వల్ల్లోంచి దించితే కుయ్ కుయ్ అనేది .వళ్ళో వేసుకుంటే మినుకు మినుకుమని నిద్ర పోయేది .అలా వళ్ళో వేసుకుని కూర్చునే ఉండే దాన్ని .అట్లాగే సూర్యుడు రాటం చూసే దాన్ని ..

ఇంతలో నా మెటర్నిటీ సెలవులు ఐ పోయాయి కాలేజ్కి వెళ్ళాలి కదా .మద్యాన్నం వరకే మా కాలేజ్ .వచ్చే సరికి చచ్చేంత ఆకలి వేసేది .పొట్టలో రాక్షసులేమి లేరు కదా అని సందేహమోచ్చేది .నన్ను చూడగానే పాపం నా కూతురు ఏడుపు మొదలు పెట్టేది .తిననిచ్చేది కాదు .ఆశ్చర్యంగా మా అమ్మమ్మ చెప్పింది "బిడ్డలు పరిక్షిస్తారట అమ్మకు నేనేక్కువా అన్నమెక్కువా అని "ఎంత రిసెర్చితో ఆ మాట చెప్పి ఉంటారు .ఏదేక్కువో నేను తేల్చుకునే లోపే నా కూతురు నన్ను గెలిచేసేది .

అల్లా అయ్యింది కదా ఇక క్రమంగా చిన్న పిల్లలకు కొన్ని రోజులైన తరువాత కొత్త బొమ్మ మీద మోజు తీరినట్టు నాకు ఈ వ్యవహారం మీద మోజు తీరింది. నా స్నేహితులు,పుస్తకాలు అన్నీ గుర్తు రాటం మొదలు పెట్టాయి .నా పాపాయి ,బొమ్మ కాదు కదా దాని డిమాండ్లు దానికుంటాయి కదా .నాకప్పుడు అర్థం కాటం మొదలు పెట్టింది ఓకే ,నేను బంధించ బడ్డాను అని . అప్పుడు అందర్నీ నిందించడం మొదలెట్టా నాకెందుకు ముందే చెప్ప లేదు అని .మా అమ్మ వాళ్ళు బలే ఆశ్చర్య పడ్డారు అందులో చెప్పేందుకేముందని .

అది మొదలు నా స్నేహితులు ,పుస్తకాలు అన్నీ ఎటో వెళ్లి పోయాయి .ఒక్కో సారి phd పుస్తకాలు చూసి దుక్కమొచ్చేది.నా బిడ్డ ఇప్పుడు కొంచం పెద్ద అయిందా నా మీద ఆంక్షలు కూడా పెరిగి పోయాయి .ఫోనులో కూడా ఎవరితో మాట్లాడ కూడదు .ఒక్కో సారి ఆడ వాళ్లకి ఉండే సౌందర్య కాంక్ష చేత ఏదైనా ఆలోచిస్తానా ,బ్యూటీ పార్లర్ కి నేను వెళ్ళక్కర్లేదు అదే నా ఇంటి ;కోస్తుందా ఐనా పాపాయికి అదీ ఇష్టముండదు .ఒక సారి ఆమెకి ఎదురు వెళ్లి చెప్పింది ''నాదో రిక్వెస్ట్ మీరిలా చేయడం నాకేం నచ్చడం లేదు అమ్మకవేం చేయకండి మీర''ని ...ఆమె చాలా ముచ్చట పడింది నీ కూతురెంత ముద్దుగా చెప్తున్దమ్మ ఒక్కోళ్ళ పిల్లలైతే వాకిట్లోనే <తిట్టులు మొదలెడతారని .అప్పటికి నేను కొంచెం తేరుకున్నా పోన్లే ఆమె ఏమీ అనుకోటం లేదు అని. 

అది అట్లా అయ్యిందా .ఈ మధ్య తల నొప్పి బాగా వస్తుందని ఇంట్లో ఉన్న వాళ్ళతో తలకి నూనె రాయించు కోడం మొదలు పెట్టా .దానికీ నస మొదలెట్టింది .సరే స్కూల్కి వెళ్లి న తరువాత పెట్టించుకోడం మొదలెట్టా .రాగానే తల వంక చూసి అడుగుతుంది ఈ రోజు తలకెవరు నూనె రాసింది అని .

నా ఈ దొంగ పనులతో విసిగి అసలు ఇదంతా కాదని దాని డైరీ ఒకటి తీసుకొని నానకి చెప్పి ఒక ఒప్పందం రాయించింది .ఆ ఒప్పందం ప్రకారం నాకు అసలేం హక్కులు లేవు నేను మా అమ్మాయితో తప్పించి ఇంకెవరితోకొంచం ఇంటరెస్ట్ గా మాట్లాడటం కూడా నిషేధం... నాతో బలవంతంగా సంతకం పెట్టించింది .

నేనెట్లా చెప్పేది నాకు ఓ జీవితముంటుందని. అర్థం చేసుకునే వయసు కాదు కదా .గట్టిగా ఎలా మాట్లాడటం .ఇదేమైన గారాబం కిందికి వస్తుందా .కానీ నా కూతురు మరీ చిన్నది కూడా కదా .ప్రైవేటు స్పేసు ఇవీ దానికెట్లా తెలుస్తాయి ?

కామెంట్‌లు లేవు: