మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

16, మార్చి 2011, బుధవారం

మదిని అల్లిన ఉదయ రాగం !


చక్కటి పాట మనసుకి దాని రాగపు పరిమళాన్ని అద్దేస్తుంది .పొద్దునే మెడిటేషన్ లో ఉన్నానా ,పక్క గదిలో నా భర్త వాకింగ్ చేస్తున్నాడు .టీవీ లో వస్తుంది కాబోలు ఆ పాట ,శాంతిగా ఉన్న మనసుని సులువుగా ఆక్రమించేసి నా రోజును దోచుకునేసింది .అంతకు కొన్ని రోజుల ముందు తను చెప్పాడు ఇష్టంగా ఆ పాట గురించి .అప్పుడసలు మనసులోకి వెళ్ళనే లేదు .ఇవాళ రోజంతా పరుచుకుంది.నాకసలు ఒక్క ముక్క హిందీ కూడా రాదు అంచేత పాట అర్థం తెలీదింకా ,చెప్పించుకోవాలి తనకి కొంత ఖాళీ దొరికితే .ఇది రాయటం కూడా వింటూ ఎందుకో అనాలోచితంగానే .ఏదో ఉందీ రాగంలో. పాడిన వ్యక్తి గొంతులో .రాయడం మాత్రం గుల్జార్ అని తెలుసు .ఈ మూవీ చూసాను .కేమెర పనితనం గురించి ఎవరో చూడమంటే .అప్పుడీ పాట తటస్థ పడనే లేదు .ఇట్లాగే చిన్నప్పుడో సారి ఓ పాట విన్నాను. గుర్తు రాటం లేదు కానీ అది కూడా ఇట్లాగే మనసుకు అంటుకుంది . గత కొన్ని రోజులుగా ఓ మూవీ కూడా గుర్తొస్తుంది గిరీష్ కర్నాడ్ ది , కొంత చిన్నప్పుడు చూసా ,అప్పుడు బాగా నచ్చిన జ్ఞాపకం ,పేరు గుర్తు రాటం లేదు .బలే చూడాలనిపిస్తుంది .అదే గుర్తు రావాలని వికీ పీడియాని అడగటం లేదు .ఇంకేం రాయడం ...ఏమీ లేవు

కామెంట్‌లు లేవు: