మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

8, మార్చి 2011, మంగళవారం

లక్ష్మి కోసం !


ఇవాళ బోల్డు బద్దకంగా ఉంది .సర్వకాల సర్వావస్థల్లోఅట్లాగే ఉంటుంది కానీ ఇవాళ మరీను .కానీ మా లక్ష్మి ఒక కామెంట్ పెట్టింది ఇవాళ ,మహిళా దినోత్సవం కోసం ఏమైనా రాయి అని .లక్ష్మి నా రూమ్మేటు.నేను మానవీయ శాస్త్రాన్ని ,తను భౌతిక శాస్త్రాన్ని పరిసోధించాం . లక్ష్మి నవ్వుల హరివిల్లు ,నేనేమో మూడీ మేఘ మాలికని .తను లేకుండి ఉంటె నా యూనివర్సిటి చదువు ఎంత చప్పగా తగల బడి ఉండేదో తలుచుకుంటేనే భయమనిపిస్తుంది .


మహిళా దినోత్సవపు శుభాకాంక్షలతో గరిమెళ్ళ .భాస్కర వెంకట సుబ్బ లక్ష్మి ఇది నీకు .నాకెందుకో ఇందులో పిల్ల నువ్వే అనిపించేసింది మరి .

జట్టిజాం పాట
ఖరహర ప్రియ స్వరాలు-ఆది తాళం


అతడు ---తుమ్మెదలున్నయ్ యేమిరా-
దాని కురులు
కుంచెరుగులు పైన -
సామంచాలాడేవేమీరా

ఆమె --ఏటికి పోరా -సేపల్ తేరా
బాయికి పోరా -నీళ్ళూ తేరా
బండకేసి తోమరా మగడా
సట్టీకేసి వండర మగడా
సేపల్ నాకు -శారు నీకూరా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా ..ఆహా
శాపల్ నాకు శారు నీకూరా

కూలికి బోర -కుంచెడు తేరా
నాలికి బోరా -నల్దుం తేరా
వత్తా పోతా -కట్టెల్ తేరా
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా ...
కట్టం నీకు -కమ్మల్ నాకురా

రోలూ తేరా -రోకలి తేరా
రోటికాడ్కి నన్నెత్తుకు పోరా
కులికి కులికి దంచరమగడా
శాటలకేసి సెరగర మగడా
శాటలకేసి సెరగర మగడా
బియ్యం నాకు -తవుడు నీకూరా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా
బియ్యం నాకు- తవుడు నీకూరా

రెడ్డీయేమో దున్నను పాయె
రెడ్డిసాని ఇత్తను పాయె
నాల్గు కాళ్ళ కుందేల్ పిల్ల
నగతా నగతా సంగటి తెచ్చే
సంగటి నాకు- సూపుల్ నీకూరా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా
సంగటి నాకు సూపుల్ నీకూరా

లక్ష్మి నిజానికి నీ కామెంట్ చూసాక చాలావిషయం చాలా కష్టపడి రాసా .కానీ అస్సలు నచ్చలా .అందుకే అది డిలీట్ చేసి ఇది పెట్టా .ఉత్తినే అన్నాఇందులో పిల్ల నువ్వనిపిస్తున్నావ్ అని . కానీ 100 % ఈ పాట మగ వాళ్ళు అల్లిందే .. కదా లక్ష్మి .మనం మనకు లేకున్నా ఎదుటి వారికి పెట్టాలంటాం కదా ! మళ్ళీ నీకు నీ కూతురు సూర్య సావిత్రి మానస గాయత్రికి మ.ది .సు .కాం . అన్నట్లు అమ్మి.. పోస్టును కాంక్షిస్తున్నాం అనరేమో ఆశిస్తున్నాం అంటారేమో.

3 కామెంట్‌లు:

హితుడు చెప్పారు...

idi yevaru raasina daanini meeru select chesi prachurincharu kada..
baagu baagu...

HA చెప్పారు...

Lovely poetry. I Like it.. I like it :)

పిల్లోడిలా డాన్సు చేసిన పిల్ల చెప్పారు...

అమ్మీ,
మందార పువ్వులు చుస్తే చిన్నప్పటి విషయాలు గుర్తు వస్తాయి నాకు. నవరాత్రులకి అందరి పెరళ్ళలో పువ్వులు కోసి గుడికి తీసుకేల్లెవాల్లము. పోటీలు పడి ఎవరు ఎక్కువ తీసుకేల్లగలరో అని ఒకరికంటే ఒకరు ముందే వెల్లేవాల్లము. ఇది ఒక మధుర జ్ఞాపకం అయితే ఇంకొకటి నువ్వు నాకోసం పెట్టిన పాటకి నేను చిన్నప్ప్పుడు డాన్సు చేయడం మరో జ్ఞాపకం. చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడయినా ఎవరికయినా మధుర స్మృతులే కదా!!! కానీ అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటేనే ప్రైజులు వస్తాయి కానీ జట్టిజాం పాటలకి అప్పట్లో ప్రైజ్ ఇవ్వలేదు. ఏదయినా అన్నిట్లో పాల్గొనడం నాకు ఇష్టం కాబట్టి, మళ్లీ నాకు అవన్నీ గుర్తుచేసినందుకు కృతఙ్ఞతలు