పాపాయి ఫోన్ చేసింది,లైబ్రరీ కి వెళుతున్నానని చెప్పింది."లైబ్రరీ కి వెళ్ళడానికి కూడా makeup వేసుకుంటున్నా అమ్మా! ఎందుకు చెప్పూ,మొన్న హాస్పిటల్ లో అడ్మిట్ అవటానికి వెళుతున్నప్పుడు కూడా రెడీ అయ్యి వెళ్ళా అమ్మా, నేను చచిపోయాక నా బిడ్డలకు చెబుతాను నాకు క్లాసిక్ మార్లిన్ మన్రో మేకప్ వేసి బరీ చేయమని "అన్నది."తల్లి సాలు బొల్లి పిల్ల కదా "తల్లి చేలో మేస్తుంటే దూడ మాత్రం గట్టున మేస్తుందా అని నిట్టూర్చి ,పనిలో పనిగా" ఒరేయ్ నేను చచిపోయాక నాకు క్లాసిక్ మేకప్ వేసి, ముత్యాలు,పచ్చలు ,కెంపులు వుండే నగలు పెట్టి నన్ను వారణాశిలో గంగ ఒడ్డున దహనం చెయ్యాలి"అని నా కోరిక కూడా చెప్పేశా .వెంటనే పాపాయి " అమ్మ ,అమ్మ వద్దమ్మ,నిన్ను పూడ్చి పెడితే అప్పుడప్పుడూ నీ దగ్గరికి వచ్చి ఇట్లాగే నీ తల తినొచ్చు కదమ్మా,కాల్చడం వద్దమ్మా " అన్నది.నేను తల్లి ప్రేమతో వెంటనే నా కాశీ కోరికను గంగలో కలిపేసి "సరేలేవే! కానీ నన్ను పూడ్చిన చోట నా పైన ధాన్యం పండించి ఆ ధాన్యాన్ని దానం ఇవ్వు "అన్నాను. దానికి కూడా"అమ్మ అట్లాగ కూడా వద్దమ్మ "అన్నది.అంటే నన్ను ఏం చేయాలో ఇదమిద్దంగా ఆలోచించలేదనమాట, మొత్తానికైతే,తను ఎక్కడుంటే అక్కడ దగ్గరగా పెట్టేసుకోవాలని ఆలోచన ఒకటి మనసులో ఉన్నట్టుంది.మళ్లీ ఒక నిమిషానికి కాస్త ఆలోచించి ,"ఏమో అమ్మా,ఏదయినా నచ్చకపోతే అప్పుడు కూడా వచ్చి బెదిరించేస్తావ్ నన్ను" అన్నది.నాకు నవ్వొచ్చింది"ఫరవాలేదు లేవే పాపాయి! ఆ మాత్రం అమ్మంటే భయం వుంది,ఇంక నిశ్చింతగా చచిపోవచ్చు "అని చెప్పాను.
12, ఫిబ్రవరి 2023, ఆదివారం
21, ఫిబ్రవరి 2022, సోమవారం
నిజాలిన్ గప్పా!
పాపాయి ఇప్పుడు ప్లస్2 చదువుతోంది. మానవీయ శాస్త్రాలు తన గ్రూప్.ఈ రోజు నా తల దగ్గర కూర్చొని రేపటి పరీక్ష కోసం పడీ పడీ చదువుతోంది. వద్దన్నా నా మనోప్రాణాలన్నీ దాని చుట్టే తిరుగుతూ వుంటాయి కదా ,దాన్లో భాగంగా "నిజాలిన్ గప్పా" పేరు నా చెవిలో పడింది.ఇదేం పేరు అనుకుని సరేలే అని ఊరుకున్నాను. మళ్ళీ కాసేపటికి వల్లె వేయడం లో భాగంగా "నిజాలిన్ గప్పా"వచ్చాడు.ఈ సారి "నిజాలిన్ గప్పా ఫ్రమ్ మైసూర్" అని నా చెవిలో పడింది.ఈ సారి ఎవరబ్బా నాకు తెలీని ఈ మైసూర్ గప్పా అనుకుని పక్కనే పేపర్ చదువుకుంటున్న పాపాయి వాళ్ళ నాన్నని కేకేశాను.నాన నేను "నిజాలిన్ గప్పా" ఎవరు అని అడగగానే పేపర్లో నుండి తలెత్తకుండా ,"నిజాలిన్ గప్పా"ని సింపుల్ గా నిజలింగప్ప ఎవరో చెప్ప సాగాడు.నాన్న ఎప్పుడయితే నిజలింగప్ప అన్నాడో మిగిలినది వినకుండా నాకు "నిజాలిన్ ...గప్పా"ఎవరో అర్తమయిపోయింది .నేను పాపాయి వైపు చూస్తూ వుంటే పాపాయి ,నేనేం చేసేది అమ్మా, ఇంగ్లీష్ లో అలా వుంది అని ఆంగ్ల భాష పైకి నేరం తోసేసి , అప్పటికీ నీకు తెలియకుండా , వినిపించకుండా చదవాలనుకుని మరిచి పోయా అన్నది.
16, అక్టోబర్ 2019, బుధవారం
పగలు కురిసిన మేఘం
19, జులై 2019, శుక్రవారం
'' చూసావామ్మా ! మమ్మీ ఎంత ముదురో '' !
.హమ్మయ్య ! ఎలాగయితేనేం ,ఇవాళ నేను ముదురు కాకుండా తప్పించేసుకున్నాను !
12, డిసెంబర్ 2018, బుధవారం
ఒక్క నిముషం కళ్ళు మూసుకుంటే పోలా !
తాతకి నా పోలిక !
29, జనవరి 2018, సోమవారం
అయ్యప్ప
26, జనవరి 2018, శుక్రవారం
'రాముడు !

26, డిసెంబర్ 2016, సోమవారం
పొగిడే మిషన్
మోడీ గారు
8, ఏప్రిల్ 2015, బుధవారం
నాన్నకి తగ్గ కూతురు
21, ఫిబ్రవరి 2015, శనివారం
కవిత్వం
17, ఫిబ్రవరి 2015, మంగళవారం
అమ్మా... అమెజాన్ లో బిడ్డలు దొరకరా ?
కానీ పాపం, పాపాయి ఈ ప్రయత్నాలన్నీ విఫలం చెందాయి . అప్పుడిక హటాత్ గా ఓ రోజు దాని దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే అబ్బాయికి దాని తమ్ముడి పదవిని ఇచ్చేసింది . ఒక రోజు అమాయకంగా చదువుకని వచ్చిన వాడిని పటుకుని మొదట శుభ్రంగా తల స్నానం చేయించింది . భోగీందర్ ని బజార్ కి పంపి కొత్త బట్టలు తెప్పించింది . ఆ తర్వాత చదువు చెప్పడం మొదలు పెట్టింది . పాపాయి తమ్ముడు చాలా తెలివయిన వాడు . టీచర్ ''దీదీ '' కాగానే చదువు అటకెక్కించాడు . పాపాయి ఏమిటేమిటో తినబెడుతుంది కదా వాడికి ,అవంతా ఎక్కువై తింటే తినడం , లేదంటే పారేయడం మొదలు పెట్టాడు . అది చూసి అప్పుడు అక్కడే వున్న నా తమ్ముడు ''అట్లా వేస్ట్ చెయ్యడం ఎందుకురా పాపాయి'' అని ఖండించబోతే '' పేద వాళ్ళంటే నీకెందుకంత చులకన రా శ్రీకాంత్ '' అని కయ్యానికి కాలు దువ్వింది కమ్యునిస్ట్ సిద్దాంతంతో . అంత చేసినా పాపం ఆ తమ్ముడు రాత్రయ్యేసరికి ''అమ్మ కావాలో మొర్రో మొర్రో ''మని ఏడ్చాడు . ఆ రోదనకి దడుచుకుని పాపాయి ముఖం చిట్లించేసి తాత్కాలికంగా తమ్ముడు ప్రయత్నాన్ని విరమించేసింది .
ఇది జరిగిన మూడేళ్లకి ఇప్పుడు పాపాయి వాళ్ళ మామకి కొడుకు పుట్టాడు . ''బిడ్డ పుడితే నాకిచ్చేయ్యాలి '' అని ముందే చెప్పి ఉంచింది కదా పాపాయి . అయినా ఇస్తారో ఇవ్వరోనని దానికి సందేహం . ఎందుకంటె అప్పుడు షీలాతో కలిసి చేసిన వేటలో అయిదుగురు బిడ్డల తల్లి , కడుపులో వున్న ఆరో... బిడ్డని ఇమ్మని అడిగితే, చిరాకు పడటమే కాక ''కంటే తెలుస్తుంది నెప్పి ''అని షీలా మీద విరుచుక పడ్డదట . పాపాయికి ఆ మాట అలానే మనసులో వుంది . ఆ సందేహాన్ని నాతో చెప్తూ వచ్చింది ఇన్ని రోజులూ . ఇప్పుడిక ఇవాళ మామ కొడుకుని పుట్టిన మూడో రోజునే ''తమ్ముడ్ని ఇంక మాకిచ్చేయమని చెప్పు మమ్మీ'' అని మా అమ్మకి రాయబారం బాధ్యతలు చెప్పింది . అది విని మా అమ్మ, తెలివి తక్కువ , నిజాయితీ ఎక్కువా అయ్యి ''వాళ్ళెందుకు ఇస్తార్రా మీనాలు ''అనేసింది . అంతే పాపాయి బోర్ల పడుకుని రెండు గంటలు ఆరున్నొక్క రాగం తీసి ,ఆ రాగం లోనే పక్కనే వున్న నారాయణమ్మని ఇప్పటికిప్పుడు బిడ్డలెక్కడ దొరుకుతారో విచారించింది . విచారిస్తూ హటాత్ గా నా వైపు తిరిగీ.. ..
''అమ్మా... అమెజాన్ లో బిడ్డలు దొరకరా ? '' అని ప్రశ్నించింది.
19, జనవరి 2015, సోమవారం
సావిత్రి
పాపాయి మంచి లీడరు !
మహానటి సావిత్రి గారి అభిమాని .
ఈరోజు మిద్దెపైన ఆడుకుంటూ వున్నారు పిల్లలందరూ.
నేనూ అక్కడే వున్నాను .
నా మొబైల్ లో ఏదో చూస్తూ పాపాయి పక్కనున్న అంజూ ని అడిగింది
అంజూ నేనెలా వుంటాను ?
అంజు: సావిత్రి లాగా అక్క....
రేయ్ హనుమోష్ నువ్వు చెప్పురా నేనెలా వుంటాను ?
హనుమోష్ ముద్దుగా ,మందంగా మాట్లాడుతాడు .
వాడు కూడా సావిత్రి లాగా ... అన్నాడు
పాపాయి :ఊ ...
ఇదంతా విని నేను బహు ఆశ్చర్య పడి అసలు వాళ్ళు సావిత్రిని చూసారా పాపాయి అన్నాను .
పాపాయి :ఆ ... చూపించా
అదన మాట విషయం .
ఇప్పుడు చెప్పండి పాపాయి లీడరేనా ?
14, జనవరి 2015, బుధవారం
పాపాయి రాసిన తొలి గేయం !
8, డిసెంబర్ 2014, సోమవారం
పాపాయి రాలేదు
7, డిసెంబర్ 2014, ఆదివారం
విన్నపం .. ..
ఇది తప్పక చదవాల్సిన కథ . నిర్భయ న్యూస్ ఐటెం గానే మనకు తెలుసు . కానీ నిర్భయ లేదా అభయ మన ఇంటి అమ్మాయిలయితే ఆ బాధ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ కథని చదివి తీరాలి. అత్యాచారానికి గురైన అమ్మాయిల అంతరంగ ఘర్షణ ని చిత్రిక పట్టిన కథ ఇది . రచయిత్రి కుప్పిలి పద్మ గారికి కృతజ్ఞతలు .
http://patrika.kinige.com/?p=4307
24, నవంబర్ 2014, సోమవారం
20, నవంబర్ 2014, గురువారం
19, అక్టోబర్ 2014, ఆదివారం
ఎంతకాలమిలా ...?
ఇవాళ పొద్దుటే నిదుర మంచం మీదనే పాపాయి నాకు చాలా యూ ట్యూబ్ వీడియో లు చూపించింది . అందులో ఇలాటివి కొన్ని . ఇవి చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . నా ఆశ్చర్యాన్ని పాపాయి తో షేర్ చేసాను . ఇటువంటి ఎన్ని వీడియోలు చూసినా అన్నింటిలోనూ పాపాయిలె అమ్మ పాత్ర పోషిస్తున్నారు . ఎక్కడా అబ్బాయిలు ఇలాటి బొమ్మలతో ఆడే వీడియోలు లేవు . ఎందుకలా స్టీరియో టైపిగ్గా మనం ఆడపిల్లలికి బిడ్డ బాధ్యత మనది మాత్రమె అని ,తండ్రులకు బిడ్డ బాధ్యత భార్యదే అని మెంటల్ రిసర్వేషన్స్ ని ఏర్పరుస్తున్నాం . అమ్మాయిలు మాత్రమె ఇంటా బయట ఎందుకు సతమతమవ్వాలి ?అమ్మాయిలు మాత్రమె పిల్లలు పుట్టాక ఉద్యోగానికి ఎందుకు సెలవు పెట్టాలి. వర్క్ ఫ్రం హొమ్ చేయాలి . పాలిచ్చే అన్ని రోజులూ సరే ,మిగిలిన కాలానికి ఇటువంటి బొమ్మలతో మనం మగ పిల్లల్ని చిన్నప్పటి నుండి మానసికం ఎందుకు సిద్దం చేయడం లేదు ?



