మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

5, ఏప్రిల్ 2011, మంగళవారం

భట్రాజు మేళం !



కొంత కాలం క్రితం పాపాయికి, సంగీతం కి ఒక మాస్టారు,చదువుకి ఒక మాస్టారు వచ్చే వారు .చదువుల అయ్య వారు కొండ పైన ఉండే మా ఇంటికి నడిచి వచ్చే వాడు ,సంగీతం సర్ స్కూటర్లో వచ్చే వాడు .అందుకో మరెందుకో చదువుల అయ్య వారు బాగా చిరాకుగా ఉండే వాడు . ఒక రోజు పాపాయి ఇక ప్రకటించింది .అమ్మా నాకు ఈ సారు వాడు వద్దు అని .ఎందుకు రా బిడ్డా అంటే సంగీతం సారు నేను పాడినప్పుడల్లా అబ్బ అబ్బ అంటాడమ్మ .ఈన అనడమ్మాఅంది .


పొగడ్తలు అంత కిక్కుని ఇస్తాయి .కానీ మనం సాధారణంగా ఎవర్నీ పొగడం .అందులో చెడ్డ తనం కూడా ఏమీ లేదు బద్ధకం అంతే .

అందుకని ఈ పొగడ్తల కోసం మేధావులు పలు మార్గాలు కని పెట్టారు . అవి 1 . పరస్పర పొగడ్తలు :నన్ను నువ్వు పొగుడు ,నిన్ను నేను పోగుడుతా ఏం ! 2. కుల పొగడ్తలు : మన కులం వాళ్ళందరూ ఇంద్రులూ చంద్రులూ .ఎందుకంటె మన కులం వాళ్ళు కనుక .3. అవసర పొగడ్తలు : నువ్వు ఇంద్రుడివీ కాదు సూర్య పుత్రిక వీ కాదు నాకు తెలుసు, కానీ నీతో నాకు అవసరం అని ,తెలివిడి కలిగి పొగిడేవి .ఇట్లా ఇంకా ఉన్నాయి అవి గుర్తు తెచ్చుకోడం మీ జ్ఞానానికో పరీక్ష .

పొగడ్తల వెనుక ఇంత కుట్ర దాగి ఉంది కనుక మనం పొగిడే వాడిని అనుమానం గా చూస్తాం . ఈ మధ్య నేను ముత్యాల ముగ్గు మూవీ చూశా.ఈ సన్నివేశం నాకు ఎంత నచ్చిందంటే ...అప్పట్నుండి అడపాదడపా నేను ఎంజాయ్ చేసే పొగడ్తలకి కూడా ఈ భట్రాజులిద్దరు అడ్డం పడి పోతున్నారు .ఇంత అద్భతమైన కాన్సెప్ట్ ని అందించిన బాపు రమణ లని ఎంత పొగిడితే మాత్రం సరి పోతుంది .అన్నట్టు చెప్పడం మరిచాను హృదయ పూర్వకమైన పొగడ్తలు కూడా ఉంటాయ్ . కాక పోతే అరుదుగా తటస్థ పడతాయ్ .

2 కామెంట్‌లు:

Indian Minerva చెప్పారు...

http://www.readbookonline.net/readOnLine/20613/ వీలైతే ఇదోసారి చదవండి G.K. Chesterton ఇలాగే పొగిడే విధానాలగురించి చెప్పి జర భద్రమంటూ హెచ్చరిస్తాడు.

గోదారి సుధీర చెప్పారు...

ఇటువంటి సూచనలు బాగుంటాయి .థాంక్ యు !థాంక్ యు వెరీ మచ్ !