మొన్నో రోజు పాపాయి ఫోన్ చేసింది . వీడియో కాల్ . ఇల్లంతా సందడి సందడి గా వుంది . ''నీకేం లేవే , అదృష్టవంతురాలివి , అవ్వ ,తాత , అత్తలు మావలు , తమ్ముడు .... నాకు చూడు ఇల్లంతా ఖాళీ ''అంటే పాపాయి వెంటనే ''నీకేమమ్మా , ఆల్ ఇన్ వన్ నాన్న వున్నాడు కదా , అమ్మ నాన్న తమ్ముడు ఇంకా నిన్ను పొగిడే మిషన్ కూడా కదమ్మా నాన్న'' అంది
26, డిసెంబర్ 2016, సోమవారం
పొగిడే మిషన్
మోడీ గారు
నెల్లూరులోవిద్యావంతుల వేదిక నుండి డీమోనిటైజేషన్ పై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం . పాపాయి వంతు వచ్చినప్పుడు , ''నోట్ల రద్దు వలన నాకయితే ఏం ఇబ్బంది రాలేదు కానీ మా తాత చాలా ఇబ్బంది పడ్డాడు. పెన్షన్ తెచ్చుకోలేకపోయాడు . ఎంతసేపు లైన్లో నిలబడినా వీలుకాలేదు . మోడీ గారు కెన్యా లాగ భారత్ ను కూడా డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది '' అని చెప్పింది . మేమందరం మోడీ గారిపై మీ అభిమానం బాగుంది అని వెక్కిరించడం మొదలు పెట్టాం . అప్పుడు అది '' కాదమ్మా , ఆయనెంత గొప్పవాడు చెప్పూ ... అంత పేదరికం నుండీ, కింది కులం నుండీ ప్రధానమంత్రి అయ్యాడు . గొప్ప కాదా ... గౌరవించవద్దా ?'' అని ప్రశ్నించింది . నిజమే కదా , ప్రధానమంత్రులు అందరు ఆ తానులో ముక్కలే అయినప్పుడు , పేదరికం నుండి వచ్చినందుకు ఆయనకివ్వాల్సిన గౌరవాన్ని ఆయానికిచ్చే తీరాలిగా . యు ఆర్ రైట్ పాపాయి గారు ,మోడీ గారు గొప్పవారు .
Labels:
పాపాయి కబుర్లు,
పాపాయిల కథలు -సినిమాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)