మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

16, అక్టోబర్ 2019, బుధవారం

పగలు కురిసిన మేఘం 

నా బుజ్జి బంగారు తల్లి , పొద్దున్నే ఫోన్ చేసింది " అమ్మ ..అమ్మా ! రాత్రంతా వానొచ్చిందమ్మా , మెరుపులొచ్చాయమ్మా  కానీ , పొద్దునయ్యేసరికి తగ్గిపోయిందమ్మా " అంది ఏడుపు గొంతు పెట్టేసుకుని ,బడికి పోవాలి కదా అనిచెప్పి . నేనన్నాను "అయ్యో .. ప్చ్ ! ఏం చేద్దాంరా , నేను గనుక మేఘాన్నయ్యుంటే పొద్దున్న నువ్ బడికెళ్లే సమయానికి కురిసేదాన్ని " అన్నాను . పాపాయి " అవునమ్మా ! ఈ మేఘం నీలాంటిది కాదమ్మా , బుద్ధిలేని మేఘం , చెత్త మేఘం " అని నిర్ధారించింది . 

కామెంట్‌లు లేవు: