మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

7, డిసెంబర్ 2010, మంగళవారం

పెన్సిల్ దొంగలు ....

పాపాయి బడికి వెళ్ళడం మొదలు పెట్టింది కదా ,ఈ సారి కొంచం దీర్ఘంగానే వెళుతుంది .ప్రతి రోజు ఇంటికి రాగానే చెపుతుంది ,అమ్మ నా పెన్సిలెవరో దొబ్బేసారమ్మఅని [డిగ్రీ లో నాకో ఫ్రెండ్ ఉండేది కడప పిల్ల వాళ్ళు ఎవరైనా తీసుకున్నారనో. వెయ్యమనో చెప్పడానికి దొబ్బడం అని వాడుతారు తలుపు వెయ్యి అంటే తలుపు దొబ్బెయ్ ..అని ఇట్లాగ అనమాట ,నేనా మాట కేచ్ చేసి నా కూతురికి కూడాభోదించాను }నాకు ఆశ్చర్యం వేస్తుంది ,మరీ రోజు ఎలా కొట్టేస్తారని .లేదే నువ్వే ఇచ్చేస్తున్నావ్ అంటాను ,కాదమ్మా అంటుంది .ఈ మధ్య వాళ్ళ క్లాస్స్ మేట్ మాతోనే వస్తుంది ,ఆ పిల్ల వచ్చి రాగానే చెప్తుంది నా పెన్సిల్ చురీ అయిందని వాళ్ళ అమ్మతో .నాక్కొంచెం అర్థమైంది .అందరికీ ఇదే ప్రోబ్లం అని .ఇంకో రోజు చెప్పింది పాపాయి, అమ్మ.... నా హానీ లూప్స్ స్కేలు సుమన్ దగ్గిర ఉండింది ,ఇది నా స్కేలు అంటే ఆ పిల్ల ఆహా ఇది నా తమ్ముడుది కావాలంటే చూడు నా తమ్ముడు పేరు కూడా అందమ్మా . కానీ అది నా స్కేలే అమ్మా అంది .సరే పోనీలేవే అన్నానా, మరుసటి రోజు ఒక కొత్త పెన్సిల్ పటుకొచ్చింది .అమ్మా .. సుమన్ పెన్సిల్ తెచ్చేసా అంది. అలా తప్పు కదా రా బంగారు! ఒకరు తప్పు చేస్తే మనమూ చెయ్యొచ్చా అన్నాను ,ఆ .....అయితే ఆ పిల్ల నా స్కేలు దొబ్బెయలా అమ్మ ..అంది సమ న్యాయ సిద్ధాంతం ప్రతిపాదిస్తూ ..నేను చాలా దిగులు పడ్డాను ,తరువాత ట్యూషన్ టీచర్ చెప్పింది ,అదేం అంత దిగులు పడాల్సిన విషయం కాదు నా దగ్గర పిల్లలందరూ ఇలాగే పాపం మొదట్లో మా పెన్సిల్ పోయిందని చెప్పుకుంటారు కొన్ని రోజులకి నేను ఫలానా వాళ్ళ పెన్సిల్ తీసుకొచ్చేసానని చెప్తారు .ఏం పర్లేదు కొన్ని రోజులు పోతే వాళ్ళే తెలుసు కుంటారని అంది.
కానీ పిల్లలెంత మంచి వాళ్ళు నేను ఫలానా వాళ్ళ పెన్సిల్ తెచ్చేసానని మన దగ్గర ఎంత ముద్దుగా చెప్తారు ,అలా చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా .. అమాయకత్వం అంత అందమైనది అందుకే మనం పిల్లల్ని అంత ప్రేమిస్తాం .

2 కామెంట్‌లు:

Hemalatha చెప్పారు...

నీ కూతురెంత అందంగా అమాయకంగా చెప్పిందో ... ఆ సన్నివేశాన్ని నువ్వింకా అందంగా, ముద్దుగా చెప్పావమ్మా ...

గోదారి సుధీర చెప్పారు...

మేడం ,ఇంత తరచూ బ్లాగ్ చూస్తున్నందుకు ,అందమైన వ్యాఖ్యలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు .