మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

30, నవంబర్ 2010, మంగళవారం

రెండు దుక్ఖాలు

బ్లాగ్లో ఏమైనా రాసి చాలా కాలమైంది .అందుకు కారణాలు రెండు .మొదటిది మా అమ్మమ్మ చని పోవడం. సృష్టిలో ప్రతి ప్రాణి ప్రత్యేకమే .రాయడానికి ఆమెలో సుగుణాలు బోలెడన్ని .రాయటం లేదు .నా బిడ్డకి ఆమెతో బలమైన అనుభందం ఉంది .దానికింకా ఆమె మరణాన్ని తెలుపలేదు .అది ఫోన్ చేస్తుంది వాళ్ళేదో చెప్తారు .ఫోన్లోనైనా మాట్లాడేందుకు ఎప్పుడు వీలవుతుందని అడుగుతుంది .ఇప్పడప్పట్లో వీలు కాదని ఆమె వెళ్ళిన వూరికి మన వాళ్లింకా ఫోన్ లైన్లు వెయ్య లేదని దానికి చెప్పలేదు .ఇప్పట్లో చెప్పగల ధైర్యమూ లేదు.
ఇక రెండో దుక్ఖం రవీందర్ సింగ్ అందరూ టీవీ లలో చూసే ఉంటారు.అతను ఇప్పుడు మేముంటున్న ఊర్లో కలక్టర్ గ చేసి వెళ్ళాడు .కరప్షన్ లో కూడా గ్రేడ్ లు ఉంటాయ్ అందులో ఆయన దిగువ శ్రేణిలోనే ఉంటాడు .ఒక మాట అంటారు దొరికితేనే దొంగలని అట్లా దొరికి ఉంటాడు .ఆ వార్త చూడగానే ఆయన ఒకే ఒక్క బిడ్డ ముఖం గుర్తొచ్చింది .ఆ పిల్ల మోయబోయే ఆ తండ్రి అపకీర్తి బాధించింది .నేనేమీ అవినీతిని సమర్థించటం లేదు .కానీ ఇంకా తప్పులు చేసే వాళ్ళు బయటే ఉన్నారు కదా అని బాధ .అవినీతికి కూడా నీతి లేదు .ఒక పద్దతీ పాడూ లేదు .అంతా చిందరవందర .ఈ మొత్తం ప్రహసనంలో మీడియా చేసిన తప్పులు ఎన్నో .వార్తల కోసం కక్కుర్తి తప్ప ఒక నిర్ధారణ పాడూ లేదు కాసేపు మావోఇష్టులని ,కాసేపు పాకిస్తానని ఏవేవో వార్తలు .అతను MBBS,MD అందుకో మరెందుకో ఈ వూర్లో ఒక రొట్టె ముక్క తిన్న హెపటైటిస్ వచ్చేస్తుందనే వాడు ఎక్కడా ఏమీ ముట్టే వాడు కాదు ఇప్పుడు జైల్లో ఎట్లా తింటాడోనని బాధ అట్లా జరగొద్దని భగవంతుడ్ని ప్రార్థించడం ఎట్లా అది తప్పు కదా .

15, నవంబర్ 2010, సోమవారం

ఒక జోల పాట


మా అమ్మాయికి జ్వరమొచ్చింది .పాపాయి;జ్వరమంతాsనాకిచ్చేయ్ దేవుడా అన్నాను .పాపాయి అన్నది, ఆహా ..నేనియ్యను నీకేమైనా అయితే .కావాలంటే కాంచన కి ఇచ్చేస్తా .అంది(కాంచన మా కుక్క )అమ్మాయిలు బంగారు తల్లులు .పాపాయిల కోసం ఒక జోల పాట ఇవాల్టి నా పోస్ట్ .చిన్నప్పుడు మా అమ్మమ్మ మా చిన్న తమ్ముడికి పాడుతుండేది హాయి వెంకట రమణ అబ్బాయిని గాయి...అని బహుశా అందరికి అది వచ్చి ఉంటుందేమో .నేను దాన్ని అమ్మాయిని గాయి అని మార్చుకుని పాపాయికి పాడుతాను .ఈ జోల పాట చూడండి ఎంత బాగుందో ...

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి

సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు

పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటె

పనస పండని జనులు పరుగులెత్తేరు

దొడ్లోన అమ్మాయి దొర్లాడుతుంటే

దోస పండని జనులు దోసిలోగ్గేరు

నీలాలు కెంపులు నిలువు వజ్రాలు

నిత్యమూ అమ్మాయి నీల్లాడు చోట

పగడాలు రత్నాలు పారిజాతాలు

పడలి మా అమ్మ్మాయి పని చేయు చోట

చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు

అందరికి మా అమ్మి అల్లారు ముద్దు

11, నవంబర్ 2010, గురువారం

లోకమంతా ఎవరి ఎంగిలీ ఓ రమణా.......


అరటి ఆకుల పల్లెమున భోన్చేద్దామనుకుంటే

వీగాముట్టిన వెంగిలీ ఓ రమణా

వెంగిలెన్గిలని వేకాము చేసేవు

లోకమంతెవరెంగిలీ ఓ రమణా

తల్లీ దిక్కడ పాలు తాగుదామని బోతే

అన్నా తాగిన వెంగిలీ ఓ రమణా

ఆవు దిక్కడ పాలు తాగుదామని బోతే

దూడా ముట్టిన వెంగిలీ ఓ రమణా

రుక్షములో పల్లైన భోన్చేద్దామని పోతే

పక్షి ముట్టిన వెంగిలి ఓ రమణా

చలములో నీళ్ళైనా తాగుదామని బోతే

కప్ప తాగిన వెంగిలి ఓ రమణా

10, నవంబర్ 2010, బుధవారం

హేమాంగిని

మా హేమంగినికి ఐదు నెలలు .దానికి నేను మొదట వేరే పేరు పెట్టాను కాని ,మా అమ్మాయి దానికి హేమాంగిని అని పెట్టుకుంది .బెంగాలీలకి చాలా వరకు డాక్ నాం అని వేరే ముద్దు పేరు ఉంటుంది. అంటే పిలిచే పేరు అన్న మాట .మా అమ్మాయి అడగక పోయినా దాని పేరు చెప్పి మళ్ళీ డాక్ నాం హేమ అని చెప్తుంది .రోజూ ఏదో ఒక టైం లో అది మమ్మల్నో ,మేం దాన్నో మాట్లడిస్తూ ఉంటాం .నిన్న అట్లాగే లోపలి వచ్చింది .అన్నట్లు అది ఎప్పుడో కాయితాలు తినడం కూడా నేర్చుకుంది .నన్ను ఒక పుస్తకం ఇవ్వవా అని అడిగింది నేను ఇవ్వలేదనుకోండి ...





































..

8, నవంబర్ 2010, సోమవారం

యమ దూత ఫోటో చూస్తారా .....





ఈ వూర్లో మేముంటున్న ఇంట్లో గార్డ్ రూం బాగా వెనక వైపు ఉంటుంది .నిన్న రాత్రి 8.౩౦కి సుదాంక్షు (ఇక్కడ పనిచేసే nvf) వచ్చి ఆసక్తిగా పామును చూస్తారా అని అడిగాడు .సరిగ్గా చిలుకు పక్కనే ఉందా పాము .చేతిని కొంచం అటు తీసికేలితే కాటు వెయ్యడమే .బెంగాలీలు దాన్ని" ఘర్ గిన్ని " అంటారట .అంటే ఇంటి గృహిణి అనమాట .ఎప్పుడూ ఇళ్ళల్లో ఉంటానికి ఇష్ట పడుతుండట .ఈ సారి ఎట్లాగో వీళ్ళు అది విషం పామని చెప్పారు .ఇంకా ఏం చెప్పారంటే పులికి మీరు కనిపిస్తే మీద పడి చంపేస్తుంది కానీ పాము మీ తల రాత చూసి చంపుతుంది కనుక భయపడ వలసిన పని లేదని .ఎప్పుడూ పాము పోస్టులు ఎందుకని అనుకున్నాను కాని ఈ ఫోటోలు నాకు బాగా నచ్చాయి .

1, నవంబర్ 2010, సోమవారం

పథేర్ పాంచాలి -అందగత్తె ఈ పుస్తకం


పాపాయికి చాలా కథల పుస్తకాలున్నాయ్ .దానికి వాటిలో " అమ్మ చెప్పిన కతలు "అనే పుస్తకమంటే మరీ ఇష్టం .ఒక సారి ఆ పుస్తకం నానకి చూపించి నానా ఈ పుస్తకంలో మంచి మంచి కథలుంటాయి మేక కథ ,పులికథ ,దెయ్యం కథ... అందగత్తె నానా ఈ పుస్తకం అని చెప్పింది. పుస్తకాన్ని అందగత్తె అని అనడం నేనదే మొదటి సారి వినడం .ఆశ్చర్య పడ్డాను ఆ మాట చాల సార్లు గుర్తొచ్చేది .

మొన్న అనుకోకుండాపుస్తకాల అలమర నుండి పథేర్ పాంచాలి పుస్తకాన్ని తీసాను ఈ శని ,ఆదివారాలు ఆ పుస్తకానికి అంకితం చేయాల్సి వచ్చింది.పుస్తకం ముగించిన తరువాత అనుకోకుండా ఉండ లేక పోయాను అందగత్తె ఈ పుస్తకమని .

మొన్న వేసవిలోననుకుంటా ఇంటికెల్లినప్పుడు మా డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ బిబూతి భూషణ్ మరో పుస్తకం "వనవాసి "కి తప్పొప్పులు దిద్దుతున్డినారు. hbt గీత గారు మేడమ్కి స్నేహితురాలు .మేడం కోసమని వనవాసి మాతృక ''అరణ్యక'' పట్టుకేల్లెను.''వనవాసి'' ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది కాని నేను ఇంకా చదవలేదు .

బిబూతి భూషణ్ ఇంకా చాలా నవలలూ ,రెండొందల దాకా కథలూ రాసారట .కానీ ఇదే ఆయన ప్రఖ్యాత నవల .సత్యజిత్ రే ప్రఖ్యాత చలన చిత్రం పథేర్ పాంచాలి కి మాతృక .రచయిత మరణించిన పిదప ఆయన భార్య అనుమతితో ఈ నవల సినిమా రూపాన్నితీసుకొందినవల చదవక ముందు సినిమా కనక చూసి వుంటే సినిమా నిశ్చయంగా గొప్ప సినిమానే కాని నవల చదివి సినిమా చూస్తే నవల ఆత్మ అతి కష్టం మీద సినిమాలో కి వచ్చిందని తెలిసిపోతుంది సినిమా కున్న పరిమితుల దృష్ట్యా అది తప్పదేమోహరి హరుడు ,సర్వ జయ ,ఇందిరమ్మ ,దుర్గ ,అపు ఇందులో ప్రధాన పాత్రలు .బిభూతి భూషణుడి స్వీయ జీవితం పరిశీలిస్తే అపు పాత్ర అతని ఛాయల తో నడుస్తందని మనకు అర్థం ఔతుంది .

ఇందిరమ్మ పాత్రతో నవల ప్రారంభమౌతుంది .కొన్ని పేజీల తరువాత ఇందిరమ్మ పాత్ర చని పోతుంది కానీ సత్యజిత్ రే ఆ పాత్రను సినిమా దాదాపు చివరికొచ్చే వరకు బ్రతికించాడు .బహుశా సినిమాలో ఆ పాత్రదారి నటన అందుకు పురికోల్పిందేమోనని నాకు అనిపించింది .శరత్ శ్రీకాంత్ నవలలోని ఇంద్ర నాథుని పాత్ర స్వల్ప నిడివిలోనే పాటకుల పైన ఎంత ప్రభావం చూపుతుందో ఈ ఇందిరమ్మ పాత్ర ,ఆమెపై దుర్గ కి గల ప్రేమ మనపై అలాంటి ముద్రే వేసి వెళతాయి .నవల చివరి వరకూ మనం ఇందిరమ్మ పాత్రను ఆమె చెంబు శాలువాలనూ మరిచి పోనేలెం .

తరువాతి పాత్ర దుర్గ .ఒక సారి పుస్తకం చదివారా ఇక మీరెప్పటికి దుర్గ ని మరిచి పోలేరు .అలా మరచి పోకుండా ఉండటానికి ఆ పిల్ల మిమ్మల్నేమీ చేయదు .వాళ్ళమ్మ చెప్పినట్టు "ఆగమ్మ కాకి ల"అలా తిరుగుతూ ఉంటుంది .ప్రకృతి, ఆ పిల్ల వేర్వేరుగా మనకెప్పుడూ కనిపించరు .ఆ పిల్ల స్వేఛ్చా ప్రవృత్తి ,ఆ పిల్ల తిరిగే ప్రకృతి కలిసి మన మనసులోకి ప్రవేశించి ఇక అక్కడనుంచి కదలి పోవు .ఎంత కాలమైనా సరే .ఇంద్ర నాథుడు మనల్ని వదిలి పోనట్టు .

దుర్గాకి తమ్ముడి పైన ,అపూ కి అక్కపైన ఉండే అపురూపమైన ప్రేమ కూడా మనల్ని కట్టి వేస్తుంది .చిన్న వయసు పిల్లలలో కనిపించే దొంగిలించే అలవాటు దుర్గకి కూడా ఉంటుంది .ఒక సారి పూసల పేరు దొంగలిస్తుంది.పక్కింటి వాళ్ళు ఆ సందర్భంలో సర్వజయతో గట్టి గొడవ పాడుతారు ఇంకో సారి పక్కింటి రాణు పెళ్లి జరుగుతూ ఉంటుంది .వాళ్ళది బంగారు కుంకుమ భరిణ పోతుంది .ఆ సందర్భంలో దుర్గ మీద దొంగతనం మోపి రక్తాలోచ్చేట్టు కొడతారు ."దాని సంగతి మీరింకా తెలుసుకో లేదు దొంగకి దెబ్బ తప్ప మరో మందు లేదనుకో నే ;చెపుతున్నాగా దెబ్బలు అపుడే ఏమయ్యాయి ?ఆ వస్తువు దొరకనిదే దీన్ని విడిచి పెడతాననుకున్నావా?హరి హరి రాయ్ నన్నేం తల తీసిమోలేస్తాడ ''అంటుంది ఒకావిడ ఆ సందర్భంలో .అప్పటి ఆ పిల్ల నిస్సహాయ స్థితి ,పేద వాడు కనుక పిల్లనేం చేసినా ఆ తండ్రి ఏమీ చేయలేడనే వారి ధీమా .మొత్తం కలిపి ఆ సంఘటన దుర్గపై సానుబూతిని కలిగిస్తుంది .మునుపటి దొంగతనం సంగతి మరచి పోయి కల వారి దౌర్జన్యం పై ద్వేషం ఏర్పరచుకుంటాం .దుర్గపై ఏమాత్రం అనుమాన పడం .కానీ దుర్గ మరణం తరువాత ఒక రోజు ఆ కుంకుమ భరిణ ఇంట్లోని అటక పై నుండి జారి అపూ కంట్లో పడుతుంది .అపూ దాన్ని చూసి విస్తు పోతాడు .{అపూ తో పాటు రచయిత ఆ రహస్యాన్ని విప్పి మనల్ని ఆశ్చర్య పరుస్తాడు.}మరేం ఆలోచించకుండా ఆ చిన్ని కుర్రాడు దాన్ని దూరంగా పొదల్లోకి విసిరి పడేస్తాడు .అక్కకు సంభందించిన ఆ రహస్యాన్ని ఎవరితో పంచుకోడు. చివరకి తల్లితో కూడా.

అలాగే సుదర్శన్ అనే పురుగు కనిపించినప్పటి సంఘటన, అప్పటి దుర్గ మనః స్థితి చిత్రణ కూడా నన్ను బాగా ఆకట్టుకుంది పేద తల్లులు .పిల్లలు ,రోజు గడవటమే కష్టమైన చోట వారిలో కనిపించే విభిన్న రకాల భావోద్వేగాలు .ఆ సంఘటనలు చిత్రించడంలో రచయిత నేర్పు .విపరీతంగా ఆకట్టుకుంటాయి .ఇందిరమ్మ పట్ల సర్వజయ కటినమైన ప్రవర్తన రచయిత సహజత్వానికి దగ్గరగా చిత్రిస్తాడు .అసహాయులైన ఆడవారు చాలా సార్లు తమ అక్రోసాలని పిల్లలపై ,ముసలాళ్ళపైనే ప్రదరిస్తారు .రాయ్ దీనిని మరీ అమానవీయంగా భావించాడేమో కొంత సరలీకరించాడు .

సత్యజిత్ రాయ్ పై భారత దేశ పేదరికాన్ని మరీ ఎక్కువ చేసి చూపించాడనే అపవాదు ఉందని నేను చాల సార్లు చదివాను .బెంగాల్ను చూస్తే ఆ అపవాదు అబద్ధమేమో అనిపిస్తుంది .ఎప్పుడో 1929 ప్రాంతాలలో రాసిన ఆ నవలలో చిత్రించబడ్డ పేదరికం బెంగాల్లో నాకు ఇప్పటకి ఏ మార్పూ లేకుండా ఉన్నట్లే అనిపిస్తుంది .ఈ నాటికి వ్యవసాయం ,వ్యవసాయాధారిత కార్యక్రమాలు తప్ప మరో దారీ తెన్నూ లేని ప్రజలు ,చాలీ చాలని భూమి ,కుప్పలు తెప్పలుగా మనుషులు ,దాంతో పాటు ఏ దిగులూ భయం లేకుండా ఇంతేసి లావున కనిపించే చెట్లతో ....మా అమ్మమ్మ కాలం వాడైన బిభూతి భూషణ్ కాలంలో ఎలా ఉందొ , నా కాలంలోనూ బెంగాల్ అలాగే ఉంది .

నవల చదవండి .చదివిన తరువాత మీరే అంటారు అందగత్తె ఈ పుస్తకమని ....