మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

15, నవంబర్ 2010, సోమవారం

ఒక జోల పాట


మా అమ్మాయికి జ్వరమొచ్చింది .పాపాయి;జ్వరమంతాsనాకిచ్చేయ్ దేవుడా అన్నాను .పాపాయి అన్నది, ఆహా ..నేనియ్యను నీకేమైనా అయితే .కావాలంటే కాంచన కి ఇచ్చేస్తా .అంది(కాంచన మా కుక్క )అమ్మాయిలు బంగారు తల్లులు .పాపాయిల కోసం ఒక జోల పాట ఇవాల్టి నా పోస్ట్ .చిన్నప్పుడు మా అమ్మమ్మ మా చిన్న తమ్ముడికి పాడుతుండేది హాయి వెంకట రమణ అబ్బాయిని గాయి...అని బహుశా అందరికి అది వచ్చి ఉంటుందేమో .నేను దాన్ని అమ్మాయిని గాయి అని మార్చుకుని పాపాయికి పాడుతాను .ఈ జోల పాట చూడండి ఎంత బాగుందో ...

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి

సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు

పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటె

పనస పండని జనులు పరుగులెత్తేరు

దొడ్లోన అమ్మాయి దొర్లాడుతుంటే

దోస పండని జనులు దోసిలోగ్గేరు

నీలాలు కెంపులు నిలువు వజ్రాలు

నిత్యమూ అమ్మాయి నీల్లాడు చోట

పగడాలు రత్నాలు పారిజాతాలు

పడలి మా అమ్మ్మాయి పని చేయు చోట

చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు

అందరికి మా అమ్మి అల్లారు ముద్దు

3 కామెంట్‌లు:

PRITHVI చెప్పారు...

చాలా రోజుల తర్వాత చాలా అందమైన అచ్చ తెలుగు జోలపాట. అభినందనలు.

అక్షర మోహనం చెప్పారు...

chaala baavundi.

కొత్త పాళీ చెప్పారు...

beautiful