మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

30, నవంబర్ 2010, మంగళవారం

రెండు దుక్ఖాలు

బ్లాగ్లో ఏమైనా రాసి చాలా కాలమైంది .అందుకు కారణాలు రెండు .మొదటిది మా అమ్మమ్మ చని పోవడం. సృష్టిలో ప్రతి ప్రాణి ప్రత్యేకమే .రాయడానికి ఆమెలో సుగుణాలు బోలెడన్ని .రాయటం లేదు .నా బిడ్డకి ఆమెతో బలమైన అనుభందం ఉంది .దానికింకా ఆమె మరణాన్ని తెలుపలేదు .అది ఫోన్ చేస్తుంది వాళ్ళేదో చెప్తారు .ఫోన్లోనైనా మాట్లాడేందుకు ఎప్పుడు వీలవుతుందని అడుగుతుంది .ఇప్పడప్పట్లో వీలు కాదని ఆమె వెళ్ళిన వూరికి మన వాళ్లింకా ఫోన్ లైన్లు వెయ్య లేదని దానికి చెప్పలేదు .ఇప్పట్లో చెప్పగల ధైర్యమూ లేదు.
ఇక రెండో దుక్ఖం రవీందర్ సింగ్ అందరూ టీవీ లలో చూసే ఉంటారు.అతను ఇప్పుడు మేముంటున్న ఊర్లో కలక్టర్ గ చేసి వెళ్ళాడు .కరప్షన్ లో కూడా గ్రేడ్ లు ఉంటాయ్ అందులో ఆయన దిగువ శ్రేణిలోనే ఉంటాడు .ఒక మాట అంటారు దొరికితేనే దొంగలని అట్లా దొరికి ఉంటాడు .ఆ వార్త చూడగానే ఆయన ఒకే ఒక్క బిడ్డ ముఖం గుర్తొచ్చింది .ఆ పిల్ల మోయబోయే ఆ తండ్రి అపకీర్తి బాధించింది .నేనేమీ అవినీతిని సమర్థించటం లేదు .కానీ ఇంకా తప్పులు చేసే వాళ్ళు బయటే ఉన్నారు కదా అని బాధ .అవినీతికి కూడా నీతి లేదు .ఒక పద్దతీ పాడూ లేదు .అంతా చిందరవందర .ఈ మొత్తం ప్రహసనంలో మీడియా చేసిన తప్పులు ఎన్నో .వార్తల కోసం కక్కుర్తి తప్ప ఒక నిర్ధారణ పాడూ లేదు కాసేపు మావోఇష్టులని ,కాసేపు పాకిస్తానని ఏవేవో వార్తలు .అతను MBBS,MD అందుకో మరెందుకో ఈ వూర్లో ఒక రొట్టె ముక్క తిన్న హెపటైటిస్ వచ్చేస్తుందనే వాడు ఎక్కడా ఏమీ ముట్టే వాడు కాదు ఇప్పుడు జైల్లో ఎట్లా తింటాడోనని బాధ అట్లా జరగొద్దని భగవంతుడ్ని ప్రార్థించడం ఎట్లా అది తప్పు కదా .

2 కామెంట్‌లు:

krishh చెప్పారు...

eee post manasuni patti chadhivisthondhi...vaakyaalu gattiga biginchina inupa golusulaga vundi kokkem tho hrudhayaaniki thagilinchinattu ayyi baruvugaaa anipinchindhi.kaburlu cheppukuntunnattuga thelikaga ahladhakaram ga vunde mee blog lo type mishan tho aksharalu thella kagitham paina koduthunnattuga noppiga palakarinchaayi.
''paapaai vaalla ammamma vellina vuuriki phonu line lu yeppatiki veyyaleru anatam''chaalaa baaagundhi.''avinnethi ki kaneesa neethi padhhadhi ledhu''anatam kuda bagundhi.
sahajam ga vachhe srushtilo thappani pranam kolpovatam kante ,aathma gowravam paruvu ni samuula nasanam chese illaanti avamaanaalu barinchatam chaalaa kashtam.
thappu cheyyani prapamcham kante thappulu cheyyataniki veeelu leni prapanchamu ni devudu srushtichalani naaaa korika.

గోదారి సుధీర చెప్పారు...

కృష్ణ గారు మీ స్పందన చూసాను .ఎంత హృదయపూర్వకంగా ఉందో ...ఆ పోస్ట్ రాసినప్పటి దుఖ్కం మళ్లీ పునరావృతమైంది .నిజం కదా తప్పులు చేయ్యనీని లోకం ఉంటె ఎంత బాగుంటుంది .బోలెడన్ని అసమానతలు ...అసమానతల వల్ల పోలికలు అంతా సంక్లిష్టం కదా . కృతజ్ఞతలు కృష్ణ గారు .ఇట్లా అప్పుడప్పుడూ పలకరించండి .మీ పలకరింపు చాలా బాగుంది .