మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

13, ఏప్రిల్ 2011, బుధవారం

గ్రేవ్ అఫ్ ది ఫైర్ ఫ్ఫ్లైస్ !




చాలా సార్లు ఈ మూవీ మొదలు పెట్టి, రెండు నిమిషాలకే ఆపేసే వాళ్ళం నేనూ, పాపాయి .మనసు కని పెట్టేసేది ,దీంట్లో యేదో దుఖం దాగుందని .అలా వాయిదా వేసి వేసి చివరికి ఒక రోజు ఒంటరిగా కూర్చుని చూసేసా.అప్పట్లో మొత్తం Hayao Miyazaki మూవీ సీజన్ నడుస్తూ ఉండింది నాకూ పాపాయికి .అందుకనేమో ఇది కూడా అతందే అనుకున్నాను .కానీ కాదు . IsaoTakahata దీని దర్శకుడు .

2 వ ప్రపంచ యుద్ద సందర్భం నుండి చెప్పిన,తల్లి తండ్రి మరణించిన చిన్ని అన్నా చెల్లెళ్ళ అగచాట్ల కధ ఇది . అమ్మకు జబ్బు .బాంబ్ షెల్టర్లో అబ్బాయి కళ్ళ ఎదుటే మరణిస్తుంది .తెలిసిన వాళ్ళింటికి వస్తారు .కొన్ని రోజులకు వాళ్ళు ఇక మేం చూడలేం అంటారు .ఇద్దరూ ఒక పాడు పడిన బాంబ్ షెల్టర్లో తల దాచుకుంటారు .రాత్రి వెల్తురు కోసం కాసిని మిణుగురులు తెచ్చి దోమ తెరలో వదుల్తారు .పోద్దునకి అవి చచ్చి పోతాయ్.అమ్మాయి వాటిని పూడ్చబోతూ ఉంటుంది .అన్న అంటాడు What are you doing? ....SETSUKO : I'm making a grave. Mommy's in a grave, too, right? I heard it from Aunty. Aunty said Mommy died, too, and she's in a grave. అమ్మ మరణించిన తరువాత, పాపకి తెలియకూడదని దాచుకున్న అన్న దుక్కమంతా అప్పుడు బయట పడ్తుంది .వాడు ఏడ్చి మనల్ని ఏడిపిస్తాడు .

తిండి కోసం ఎన్ని అగచాట్లో .పాపకి డయేరియా తగులుకుంటుంది .డాక్టర్ దగ్గరికి తీసుకెళతాడు అన్న .
SEITA :Anyhow, please give her treatment of some kind. Please.
DOCTOR medicine or anything... Well, I suggest that she get some nourishment. That's all that can be done.
SEITA You say nourishment, but...
DOCTOR (To the next patient,) What seems to be the matter?
SEITA Where can you find nourishment?!! ఎక్కడనుండి తేవాలి ...తేగలడు ...ఆ పిల్లవాడు నరిష్మెంట్ .సేత్సుకో కళ్ళు మూస్తుంది .మరెప్పటికీ ఈ యుద్దాల మారి ,మాయల మారి ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా .కొన్ని రోజులే తేడా... అన్నా చనిపోతాడు .యుద్ధం ముగుస్తుంది .అంతా పదిలం .అందరం పదిలం .

యుద్దాల పై చాలానే సినిమాలు ఉన్నాయ్ కదా .అందులో ఇదీ ఒకటి .ఏ సిద్దాంత రాద్దాన్తాలు లేకుండా సామాన్యుల జీవితాలని చూపిస్తుంది .

ఇక్ మా ఇంటికి బోలెడు మిణుగురులు వస్తాయ్ .పెళ్ళిల్లప్పుడు సీరియల్ సెట్లు వేస్తారు కదా.. అట్లా చెట్లపై వాలి మిణుకుమంటూ ఉంటాయ్ .ఇప్పుడు నాకు వాటిల్ని చూడగానే ఈ అన్న, చెల్లెళ్ళు జ్ఞాపకం వచ్చి మనసు మసకేస్తుంది .మిణుగురులు చని పోయినప్పుడు సేత్సుకో అడుగుతుంది అన్నని ..Why do the fireflies die so quickly?అని. అవును కదా....ఎందుకు చనిపోవాలి ఆ మిణుగురులు అట్లా ...... ? ఏం సమాధానమిచ్చుకోగలం మనకైనా మనం ?

4 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

మీ బ్లాగ్ బాగుందండి .
ముఖ్యం గా బుజ్జి పిట్ట భలే ముద్దొస్తోంది . దాని కోసమే పైకి కిందికి చాలా సార్లు తిప్పాను :)

గోదారి సుధీర చెప్పారు...

thank you మాలా కుమార్ gaaru !

Indian Minerva చెప్పారు...

ఇప్పుడు ఈ వీకెండు మీరు నన్నేడిపించబోతున్నారు. "పర్వానా"లు చాలా అదృష్టజీవులు అవి వెలుతురిని ప్రేమించి దాంట్లోనే లీనం(ఫనా)అయిపోతాయి దీన్నవి మొక్షమూ గాడిదగుడ్డూ అంటూ పెద్దపెద్ద మాటల్లో చెప్పుకోవుకూడా.

కొంచెం ఆలోచిస్తే మనజీవితమూ ఒక పర్వానా లాంటిదే.

గోదారి సుధీర చెప్పారు...

కావచ్చు .... !