మొన్నోఆదివారం రోజు ,నేను తలనొప్పని ముసుగుపెట్టా .పాపాయి వాళ్ళ నాన్న ఏదో పుస్తకం అంతు చూస్తున్నాడు.అయితే పాపాయి ఏం చేస్తూ వున్నట్టూ? నాక్కూడా అచ్చు అట్లాగే డౌట్ వచ్చేసి లేచి చూద్దును కదా, నా బిడ్డ సీరియస్ గా కంప్యూటర్లో డాక్టర్ బార్బీగేమ్స్ఆడేస్తూ వుంది .అసలే ఆ పిల్లల పుస్తకాలూ యీ పిల్లల పుస్తకాలూ చదివేసి పాపాయిని పరిశోధనా శాలగా కదా చేసుకుని వున్నాను,ఆందుకని గొప్ప దిగులేసేసి ,లే పాపాయి లే అసలకి ఇప్పుడే పెద్ద బాలశిక్షలో అరుందతీనక్షత్రం గురించి,ధ్రువనక్షత్రం గురించీ చదివా వినవా అన్నాను .అంతే పాపాయి చిటికెల్లో సిస్టం ముందు నుండి లేచి ఏందమ్మా ...ధ్రువనక్షత్రమంటేనా ...?అనుకుంటా పిల్లి కూనలా వెనకాల వచ్చింది .ఇద్దరం ఆనక్షత్రం గురించీ ఇంకా పెద్దబాలశిక్షలో ఏమేం వున్నాయో ముచ్చటించుకుంటా వుండినాం .ముచ్చట్లలో పాపాయి 'పెద్దబాలశిక్ష అంటే పాతకాలపు ఇంటర్నెట్టు' కదమ్మాఅన్నది .ఆమాట విని నేను చాలా ఆశ్చర్యపడి భలే చెప్పావే ఆమ్మలూ అని మురిసా ..అప్పుడు పాపాయి,నేనుచెప్పలేదమ్మ్మానువ్వేచెప్పావు అని అన్నదీ .ఈ సారి నాభోధనకి నేనే ముచ్చటపడీ ,నాబిడ్డ జ్ఞాపకశక్తికి చాలా మురిసిపోయాను .
నిజం చెప్పమంటారా ...?
నిజంగానే ...పెద్దబాలశిక్ష,పాతకాలపు''వికీ''.