అమ్మ ఈ మధ్య చాలా పనులు పెటుకుంది . ముసలి వాళ్ళమై పోతే ఎనర్జీ వుండదు కదా ,నలభై లోపలే చేయదలచుకున్న విషయాలని ఒక దారిలో పెటుకోవాలి అని అమ్మ కోరిక . అందుకని అమ్మ పాపాయిని,నానని వదిలేసి ,పాపాయి వాళ్ళ నానమ్మ వూరిలో క్యాంపు పెట్టేసింది . మొన్న ఇంటికొచ్చింది . అప్పుడిక పాపాయి వాళ్ళ నాన అన్నాడు ... ''ఇలా కాదు కానీ, నువ్వు ప్రతి శుక్రవారం బయల్దేరి రా !మళ్ళీ సోమ వారం వెల్దువు కానీ'' అని . అప్పుడిక అది విని నిండా జలుబు చేసి వున్నపాపాయి అన్నదీ ''అవునమ్మా మేము జలుబు ,నువ్వు అమృతాంజన్ రిలీఫూ ''అని .