పొద్దుటే సూర్య కాంతి పడుతున్న సోఫాలో గులాబి రంగు నైట్ డ్రస్ లో కూర్చుని వుంది నా చాంద్ కా తుక్డా . నిన్నంతా కొత్తగా నేర్చుకుంటున్న సైకిల్ తొక్కి ,తొక్కి వేసారిన అలసట ,స్కూల్ కి వెళ్ళాల్సిన బాధ్యత మిళితమై ముఖంలో ద్యోతకమవుతూండగా,అద్భుతమైన మెలాంఖలిక్ కాంతి తో సోగలైన కన్నులను సూర్య కాంతి లోనిలిపి నిరోమయంగా గొప్ప సౌందర్యంతో కూర్చుని వుంది .
అలా వుండి వుండి ,ఆలోచనా లోచనాలను మా అమ్మ పక్క తిప్పి .. "ప్రైమరీ స్కూల్ లీడర్ ని అవమానించింది మమ్మీ .... అమ్మ ఫ్రెండు "అన్నది . చల్లారి పోయిన గ్రీన్ టీ ని గట గటా తాగుతున్న నాకు చప్పున పొలమారింది . విషయమేమంటే మొన్న పాపాయి వాళ్ళ అమ్మ చిన్న నాటి నెచ్చలి వచ్చింది ,పాపాయికి , తాతకి జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ పోరు చూసి ఆశ్చర్యపడి " అంకుల్ కి కోపమంతా తగ్గిపోయింది కదా సామాన్య ,అప్పుడంత కోపమున్డుంటే ఇది ఇలా మాట్లాడగలిగేదా అసలు " అని వక్కాణించింది . అది విని అప్పుడు ఊరుకున్నా మూడు రోజుల తర్వాత పాపాయి బుసలు కొట్టి కోపాన్ని ఇలా వ్యక్త పరిచిందనమాట . కోపం రాదా మరి ... ప్రైమరీ స్కూల్ లీడర్ అయి వుండి అవమానింప బడటమా ......! తన ప్రవర్తన గురించిన అంత వ్యాఖ్యానం రావడమా ...!
మొన్నో రోజు పాపాయి స్వంతంగా సానం (స్నానం )పోసుకుంటూ ఉండింది . మరి అదిప్పుడు ప్రైమరీ స్కూల్ లీడర్ కదా ,మేమందరం చీటికి మాటికి ఆ పేరు చెప్పి దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వుంటాం కదా అందుకన మాట ఈ స్వంత స్నానం . పాపాయి వాళ్ళ అమ్మ బాత్రూం ముందు కుర్చీ వేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వుంది ... అక్కడ అలా రుద్దూ... ఇక్కడ ఇలా రుద్దు అని ,చూసి చూసి పాపాయి టకీమని బాత్రూం తలుపు వేసేసుకుంది . అమ్మకి ఎంత ఆశ్చర్యమో ,ఔరా ! ఎంత తెలివీ ... మాట మంతీ లేకుండా చెప్పాల్సింది ఎంత బాగా చెప్పేసింది అని .