రోడ్లో నిలబడి పాపాయి ఫ్రెండ్స్ తీర్పుల కోసం పాపాయి ని కేకలేస్తున్నారు . పాపాయి మమ్మీ ని పిలిచి ''మమ్మీ ... వాళ్ల గోల ఏమిటో చూడు కొంచెం ,నేను కవిత్వం రాస్తున్నా '' అంది .
21, ఫిబ్రవరి 2015, శనివారం
17, ఫిబ్రవరి 2015, మంగళవారం
అమ్మా... అమెజాన్ లో బిడ్డలు దొరకరా ?
ఈ పోస్ట్ సిలిగురిలో రాయాల్సిన పని . రాయాలనుకుంటూనే ఇప్పటి వరకూ
చేసేసాను .చాలా మరిచి పొయాను. అట్లాగే మనం పిల్లల అల్లరులన్నీ మరిచి
పోతామనుకుంటా .
పాపాయికి
సిలిగురికోచ్చాక హటాత్ గా తమ్ముడో, చెల్లో కావాలని కోరిక మొదలయింది . అదీ
అప్పటికప్పుడు కావాలని . అప్పుడిక షీలాని ,అనితాని ఇన్వాల్వ్ చేసి ఆ విషయం
మీద రీసెర్చ్ మొదలెట్టింది . మా అమ్మాయికి విపరీతమైన మేనేజ్మెంట్
స్కిల్స్ వున్నాయి ,ఎటువంటి మనుషుల్నైనా తనని ప్రేమించేట్టు చేసుకోగలదు .
అలా తనేం చెప్తే అలా వినేట్టు షీలా ని మేనేజ్ చేసింది . షీలా ఏం
చెప్పిందంటే బెంగాల్లో యాభై రూపాయలకి కూడా బిడ్డ దొరుకుతుందని . పాపాయి
సేవింగ్స్ అప్పటికి ఎయిట్ తౌసండ్ . ఎయిట్ తౌసండ్ డివైడేడ్ బై ఫిఫ్టీ
అనుకోండి ... అదన మాట సంగతి .పాయికి చాలా ధైర్యమొచ్చి అమ్మని బైపాస్ చేసి
బిడ్డని వెతక బట్టింది . పొద్దున్న లేసినదగ్గర నుండి వాళ్ళతో ఒకటే మంతనాలు .
మధ్యలో షీలా ,''మేడం వాళ్ళింటికి రాబోయే బిడ్డ ఎవరో ... అదృష్టం''అని
చేతులెత్తి టాకూర్ కి ప్రణామ్ చేసుకునేది .మా అమ్మాయి మాటల్ని
ఖండించడమో ,సలహాలివ్వడ మో ,చదువుకో అని పదే పదే వుపన్యసించడమో వంటివి
నాకు ఇష్టం లేని పనులు ,అందుకని నేను ఈ చోద్యమంతా కేవలం చూస్తూ వుండేదాన్ని
.
కానీ పాపం, పాపాయి ఈ ప్రయత్నాలన్నీ విఫలం చెందాయి . అప్పుడిక హటాత్ గా ఓ రోజు దాని దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే అబ్బాయికి దాని తమ్ముడి పదవిని ఇచ్చేసింది . ఒక రోజు అమాయకంగా చదువుకని వచ్చిన వాడిని పటుకుని మొదట శుభ్రంగా తల స్నానం చేయించింది . భోగీందర్ ని బజార్ కి పంపి కొత్త బట్టలు తెప్పించింది . ఆ తర్వాత చదువు చెప్పడం మొదలు పెట్టింది . పాపాయి తమ్ముడు చాలా తెలివయిన వాడు . టీచర్ ''దీదీ '' కాగానే చదువు అటకెక్కించాడు . పాపాయి ఏమిటేమిటో తినబెడుతుంది కదా వాడికి ,అవంతా ఎక్కువై తింటే తినడం , లేదంటే పారేయడం మొదలు పెట్టాడు . అది చూసి అప్పుడు అక్కడే వున్న నా తమ్ముడు ''అట్లా వేస్ట్ చెయ్యడం ఎందుకురా పాపాయి'' అని ఖండించబోతే '' పేద వాళ్ళంటే నీకెందుకంత చులకన రా శ్రీకాంత్ '' అని కయ్యానికి కాలు దువ్వింది కమ్యునిస్ట్ సిద్దాంతంతో . అంత చేసినా పాపం ఆ తమ్ముడు రాత్రయ్యేసరికి ''అమ్మ కావాలో మొర్రో మొర్రో ''మని ఏడ్చాడు . ఆ రోదనకి దడుచుకుని పాపాయి ముఖం చిట్లించేసి తాత్కాలికంగా తమ్ముడు ప్రయత్నాన్ని విరమించేసింది .
ఇది జరిగిన మూడేళ్లకి ఇప్పుడు పాపాయి వాళ్ళ మామకి కొడుకు పుట్టాడు . ''బిడ్డ పుడితే నాకిచ్చేయ్యాలి '' అని ముందే చెప్పి ఉంచింది కదా పాపాయి . అయినా ఇస్తారో ఇవ్వరోనని దానికి సందేహం . ఎందుకంటె అప్పుడు షీలాతో కలిసి చేసిన వేటలో అయిదుగురు బిడ్డల తల్లి , కడుపులో వున్న ఆరో... బిడ్డని ఇమ్మని అడిగితే, చిరాకు పడటమే కాక ''కంటే తెలుస్తుంది నెప్పి ''అని షీలా మీద విరుచుక పడ్డదట . పాపాయికి ఆ మాట అలానే మనసులో వుంది . ఆ సందేహాన్ని నాతో చెప్తూ వచ్చింది ఇన్ని రోజులూ . ఇప్పుడిక ఇవాళ మామ కొడుకుని పుట్టిన మూడో రోజునే ''తమ్ముడ్ని ఇంక మాకిచ్చేయమని చెప్పు మమ్మీ'' అని మా అమ్మకి రాయబారం బాధ్యతలు చెప్పింది . అది విని మా అమ్మ, తెలివి తక్కువ , నిజాయితీ ఎక్కువా అయ్యి ''వాళ్ళెందుకు ఇస్తార్రా మీనాలు ''అనేసింది . అంతే పాపాయి బోర్ల పడుకుని రెండు గంటలు ఆరున్నొక్క రాగం తీసి ,ఆ రాగం లోనే పక్కనే వున్న నారాయణమ్మని ఇప్పటికిప్పుడు బిడ్డలెక్కడ దొరుకుతారో విచారించింది . విచారిస్తూ హటాత్ గా నా వైపు తిరిగీ.. ..
''అమ్మా... అమెజాన్ లో బిడ్డలు దొరకరా ? '' అని ప్రశ్నించింది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)