ఈ మధ్య కొత్తగా పాపాయి వాళ్ల తాత ,మమ్మీ అందరూ కలిసి నెట్ ఫ్లిక్స్ లో అవీ ఇవీ చూట్టం మొదలు పెట్టారు . పాపాయి కి అత్యంత ఫేవరేట్ ''వాంపైర్ డయరీస్ '' దుర్గాపూర్ లో మా ఇంటి ఎదురుగా కాపురముండే వీధి కుక్కకి కూడా ''ఎలెనా గిల్బర్ట్ '' అని అందులోని హీరోయిన్ పేరు పెట్టింది . సరే అట్లా తాత ,మనవరాలు ,మమ్మీ అని పిలువబడే అమ్మమ్మ అందరూ ఇవి చూస్తూండగా ,ముద్దులు గట్రా వస్తే తాత '' చిట్టీ ! తీసేయ్ తీసేయ్ '' అంటాట్ట . ఆ విషయాన్ని నాకు కంప్లైంట్ చేస్తూ పాపాయి ''ఒక్క నిముషం వాళ్లిద్దరూ కళ్ళు మూసుకుంటే పోలా అమ్మా ! దానికి మార్చడం ఎందుకు చెప్పూ !'' అన్నది . నేను చాలా ముచ్చట పడి , '' కళ్ళు మూసుకోవాల్సింది నువ్వు కదరా పాపాయీ ''! అన్నాను .
12, డిసెంబర్ 2018, బుధవారం
తాతకి నా పోలిక !
పాపాయి వాళ్ళ చిన్న మామ కి పాపాయి పుట్టింది , అక్టోబర్ లో ! పాపాయి వాళ్ళ తాత కూడా అక్టోబరే . బుజ్జి దాని పేరు మెలొడి . అది కూడా అచ్చం తాత లాగే సగం కళ్ళు తెరుచుకుని నిద్రపోతుంది . అందుకని నేను పాపాయితో ''మెలొడీకి అచ్చం తాత పోలిక రా '' ! అన్నాను ,పాపాయి క్షణం కూడా ఆలోచించకుండా '' ఆఁ ! తాతకన్నీ నా పోలికలమ్మా , తాత కూడా నా లాగే తలకింద చెయ్యి పెట్టుకుని నిద్ర పోతాడు '' అన్నది . అది విని తాత కూడా మనవరాలికి సపోర్ట్ వచ్చి '' అవునురా ! మెలొడీకి వాళ్ళ తాత పోలికలు , నాకంతా నీ పోలికలు '' అని వాక్రుచ్చాడు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)