నా బుజ్జి బంగారు తల్లి , పొద్దున్నే ఫోన్ చేసింది " అమ్మ ..అమ్మా ! రాత్రంతా వానొచ్చిందమ్మా , మెరుపులొచ్చాయమ్మా కానీ , పొద్దునయ్యేసరికి తగ్గిపోయిందమ్మా " అంది ఏడుపు
గొంతు పెట్టేసుకుని ,బడికి పోవాలి కదా అనిచెప్పి . నేనన్నాను "అయ్యో .. ప్చ్ ! ఏం చేద్దాంరా , నేను గనుక మేఘాన్నయ్యుంటే పొద్దున్న నువ్ బడికెళ్లే సమయానికి కురిసేదాన్ని " అన్నాను . పాపాయి " అవునమ్మా ! ఈ మేఘం నీలాంటిది కాదమ్మా , బుద్ధిలేని మేఘం , చెత్త మేఘం " అని నిర్ధారించింది .