మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

5, అక్టోబర్ 2010, మంగళవారం

ఐననూ పోయిరావలె హస్తినకు ...

హటాత్తుగా ఒక రోజు ,నాకు బ్లాగ్ ఒకటి మొదలు పెడితే ఎట్లా ఉంటుందనిపించింది .అది మొదలు పుట్ల హేమలత (వారు "నెట్లో తెలుగు సాహిత్యం" ఫై phd చేస్తున్నారు )మేడం గారికి కష్టాలు మొదలయ్యాయి .ఎందుకంటే నేను కంప్యూటర్ జ్ఞాన సూన్యురాలిని .బ్లాగ్ ఎలా చేయగలను .అంత మాత్రం చేత నా బ్లాగ్ ఎలా పడితే అలా ఉంటె ఎలా? అంచేత మేడంని అర్థ రాత్రి అప రాత్రి కూచోపెట్టేసాను .వారు నా బ్లాగ్ని మా పాపాయంత ముద్దుగా చేసి ఇచ్చారు .మద్యన ఉన్న ఇన్ని యోజనాల దూరం ఈ సందర్భంలో ఎంత దగ్గరగా అయ్యిందో ....వారికి నా కృతజ్ఞతలు .
బ్లాగ్ అయితే తయారయింది కదా .కానీ ఏం రాయడం బ్లాగంటే పబ్లిక్ ప్రైవేటు జీవితపు విచిత్ర సమ్మేళనం అని ఈ బ్లాగుల్లోనే ఎవరో అన్నారు ..కదా మరి ఎలా మొదలు పెట్టాలో తెలియక ఒక్క పోస్టూచెయ్య లేదు ఇఇన్ని రోజులూ మా ఊర్లో అంటుంటారు .ఏమైనా సరే ఒక పని చెయ్యాల్సిందే కష్టమయినా నష్టమయినా అనుకుంటే ఐనా సరే పోయిరావలె హస్తినకని అట్లాగా ఇది ఇలా మొదలు పెట్టేసాను .
భయపడకు నేను సహా రచయితగా ఉంటానన్నది నా కూతురు .దానికి రాయడం రాదు కనక రాసి పెట్టాలి .అంతే .రాసే వాళ్ళుంటే ఎన్ని కబుర్లో ......బడికి పోయింది చిన్నిచిన్ని చేపలంత కళ్ళల్లో పెద్ద పెద్ద చెరువులంత కళ్ళ నీళ్ళు నింపుకొని .........

కామెంట్‌లు లేవు: