మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

16, డిసెంబర్ 2010, గురువారం

బాంబే ....

పాపాయి నేను కథ చెప్పుకుంటున్నాం .ఆ కథలో ఒక చోట "చెడ్డ ఆత్మ అని వచ్చింది .పాపాయి అడిగింది చెడ్డ ఆత్మ అంటే ఏందమ్మ... అని ఏం చెప్పాలి ,అందుకని కాస్త ఆలోచించి చెడ్డ బుద్ది ఉండటాన్ని చెడ్డ ఆత్మ
అన్నాను .చెడ్డ బుద్ధి అంటే ఎట్లాంటిది అన్నది .ఎందుకో గబుక్కున బాంబే లో బాంబులు వేసిన వాళ్ళు గుర్తొచ్చి ,వాళ్ళ గురించి చెప్పి వాళ్ళది చెడ్డ బుద్ది ,అంటే చెడ్డ ఆత్మ అని చెప్పాను,పాపాయి అన్నదీ ..అందుకేనా అమ్మ బాంబే కి ఆ పేరొచ్చింది అని .అంటే బాంబులు వేసారు కనక బాంబే అన్నమాట .బాగుంది కదా పోలిక.


5 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

Happy New Year...మీ బ్లాగ్ గురించి ఈ టపాలో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. http://trishnaventa.blogspot.com/2010/12/2-discovered-blogs.html

గోదారి సుధీర చెప్పారు...

త్రిష్ణ గారు మీబ్లాగ్ నేను చూస్తూనే ఉంటాను .దాదాపు అన్నిపోస్టులు చదివాను .thankyou trishna gaaru .మీ అమ్మాయికి నా శుభాశీస్సులు happy new year to you also

సిరిసిరిమువ్వ చెప్పారు...

తృష్ణ గారి బ్లాగు ద్వారా మీ బ్లాగు గురించి తెలిసింది. బాగుంది.

మీకు మీ పాపాయికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గోదారి సుధీర చెప్పారు...

thank you

గోదారి సుధీర చెప్పారు...

thank you