మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

26, జనవరి 2011, బుధవారం

బాపు , ముత్యాలముగ్గు నుండి ఒక ఫోటో .....


ఈ అమ్మాయి కరగని కాటుక కంటితో కావ్యం రాస్తోంది ...కన్నీటి కావ్యం ,

అమ్మాయిలు అతి తరచూ రాయాల్సి వచ్చే కావ్యం !

ఎక్కడో, ఎప్పుడో దొరికింది ఈ ఫోటో


ఎందుకో యెంత చూసినా తనివి తీరదు.


రాసిన ఈ అమ్మాయికి


రాయించిన బాపూకి తరిగిపోని కృతజ్ఞతలు


ఫోటో కి (అనుమతి లేని వాడకానికి) క్షమార్పణలు .















18, జనవరి 2011, మంగళవారం

విగ్రహాల గురించి ...........


నేను ,పాపాయి పెద్ద పండక్కి మా ఊరికి వచ్చాం .నిన్న మా ఊరి నుండి మేం మా పట్టణం వైపు వస్తున్నాం .పాపాయి మార్గ మధ్యంలో ఫలానా నాయకుడి విగ్రహాలు చాలా చూస్తూ వచ్చింది .చూస్తూ ఉండగా దానికి హటాత్తుగా
కోపమొచ్చింది .మనూరికంతా కలిపి ఒక్క విగ్రహమున్డాలి ..ఇట్లా ఈయనోక్కడివే ఇన్నేసి ఎందుకు ?ఇంకెవరు మంచి పనులు చెయలా..మదర్ తెరెసా ,మహాత్మా గాంధీ ,అంబేద్కరు వీళ్ళంతా చేయలా ? ?మదర్ తెరెసా ఇక్కడకొచ్చి చీర కూడా కట్టుకుంది ...ఆమె విగ్రహం ఎందుకు పెట్టలా?నేను డాక్టర్ని అయ్ ఒక హాస్పిటల్ కడతా ...రిచ్ దగ్గర డబ్బు తీసుకుంటా ,పూర్దగ్గర తీసుకొను ,రిచ్ దగ్గర డబ్బంతా అయిపోవాలి అని ప్రకటించింది ....నాకు స్వయంగా ఇంత వరకు మదర్ తెరెసా విగ్రహం అనే మాట కలలో కూడా తోచలేదు ..ఎక్కడయనా ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలి .
మనం పెద్ద వాళ్ళం ,ఏవేవో సందర్భాల్లో ఏవేవో మాట్లాడేసుకుంటూ ఉంటాం ...పిల్లలు మాయావులు మనకు తెలియనే తెలియదు ,ఏవి వింటున్నారో ఏవి వినటం లేదో ,ఎప్పుడో ఇట్లా హటాత్తుగా అన్నిటిని క్రోడీకరించుకుని తమ స్వంత అభిప్రాయాలుగా ప్రకటించేస్తారు.పిల్లలంటే మనకు పుట్టి మనం చూడలేని మరో ప్రపంచంలోకి వెళ్ళబోతున్నమన స్వంత చైతన్యాలు ...అంతే కదా ...