మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

2, ఏప్రిల్ 2012, సోమవారం

ప్రేమ లేఖ !

నిన్న ఏమైందంటే తీరిగ్గా నా బొట్టు పెట్టి ముందు పెట్టుకుని సాజతా [అలంకరించుకుంటూ వున్నానని ,బెంగాలీలో] వున్నాను.పెట్టెలో ఏదో కాయితం కనిపిచ్చింది. ఏందబ్బా అని చూస్తే ,లవ్ లెటర్ ...నా కూతురు రాసింది.

నా కూతురు నాకు బోల్డు ప్రేమలేఖలు రాస్తది.ట్యూషన్ నడస్తా వుంటది కదా  వేరే రూం లో ,మధ్యలో ఎవరో ఒకరు ఒక లెటర్ పట్టుకోస్తారు .నేను తీసి చదివే లోపల నా కూతురొచ్చి గోడ చాటున నిలబడి అమ్మ సంతోష పడిందా లేదా అని చెక్ చేస్తా వుంటది .ఇంకా స్కూల్ నుండి కూడా ప్రేమలేఖలు రాసి తీసుకొస్తది,స్కూల్ లో గుర్తొస్తా  వుంటానంట

దానికి రెండేళ్ళ నుండీ అమ్మ  బొమ్మ వెయ్యడం   మొదలెట్టింది .అమ్మ ,కూతురు బొమ్మ వేసి ఐ లవ్ యు అమ్మ అని రాసి తీసుకొస్తది .

ఒక సారి ఏదో ఇరిటేషన్ ని దాని మీద చేత్తో చూపించా .ఆ రోజొక ప్రేమ లేఖ రాసింది .అప్పుడు భలే ఏడుపొచ్చేసింది.

అమ్మకి హిందీ రాదు అని గుర్తు పెట్టుకుని  ఇంగ్లీష్ లో రాస్తుంది .పాపం దాన్ని చూసి చూసి నాచు,పిచ్చి  స్కూళ్ళలో చేరుస్తాం కదా అందుకని ఇంకా బెంగాలీ వచ్చినంత బాగా ఇంగ్లీష్ రాదు.లవ్ లెటర్ లో స్పెల్లింగ్ తప్పులుంటాయి.

సరే ఈ ప్రేమ  లేఖలో ఏం రాసిందంటే ''     లవ్ యు   డియర్,
డోంట్ గో ఫార్ ఫ్రం మీ ...
లాఫింగ్ ఫేస్ 
ఫ్లవర్ ఫేస్ 
ఫ్రూట్స్ ఫేస్ 
     క్రయింగ్ ఫేస్''   అని
 కవిత అస్సలు అర్థం కాలేదు కదా .నేను కూడా ఆశ్చర్య పడి,అంటే ఏందిరా ?అని  అర్థం అడిగాను .అదన్నదీ నువ్వు ఒక్కో సారి పువ్వులాగా ముద్దుగా ఉంటావు,ఒక్కో సారి పండులాగా ఉంటావు ,ఒక్కోసారి నవ్వతా ఉంటావు,ఒక్కో సారి ఊ ...అని ఏడస్తా ఉంటావు,కేమీలియన్ లాగా [వాళ్లకి ఊసర వెల్లి మీద రెండో తరగతిలో పాటం  ఉందిలెండి] మాటి మాటికీ రంగులు మారస్తా ఉంటావు కదా అందుకని రాసా ,అని .

లెటర్ భలే నచ్చినా ... నన్ను కేమీలియన్ అంటావా నేను అలిగేస్తున్నా పో ...అన్నాను .ఈ సారి ఎప్పుడో దానికి జవాబుగా  ఇంకో లెటర్ రాస్తది .

ఈ విషయంలో [కేమీలియన్] మహా రాజ శ్రీ పాపాయి వాళ్ళ నాన్న గారి అభిప్రాయం కూడా అదే కనుక ఈ భావాన్ని అక్కడినుండే గ్రహించి వుంటుంది .కాకుంటే నా కూతురి కవిత్వం నాకు చాలా నచ్చేసింది.అందుకని ఇలా దాస్తున్నాను.పెద్దైతే ఎప్పుడైనా తేడా వస్తే చూపించ డానికన  మాట : ))

7 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

chaalaa chaalaa Baagundi.
పిచ్చి స్కూళ్ళలో చేరుస్తాం కదా అందుకని ఇంకా బెంగాలీ వచ్చినంత బాగా ఇంగ్లీష్ రాదు.
ee maata meeru garvamgaa cheppadam chaalaa baagundi.

ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దనుకుని స్థానికంగా ఉన్న స్కూల్ లో చదివించడం..చాలా గ్రేట్ . మీకు మనఃపూర్వక అభినందనలు.

చెప్పాలంటే...... చెప్పారు...

kaburlu paapai vi chaalaa muddu ga vunnayi

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

పాప కవిత అమ్మమనసు చాలా బాగుంది...

గోదారి సుధీర చెప్పారు...

వనజ గారూ
నిజానికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళే కానీ మొత్తం బెంగాలీ నే నడుస్తుంది ,అట్లా నా కూతురికిప్పుడు కవిత్వం చెప్పేంత బెంగాలీ వచ్చు.అన్నట్లు ఆంద్ర జ్యోతిలో వచ్చిన మీ కవిత ''నువ్వు వదిలేసిన కాడితో'' చాలా బాగుంది .
థాంక్ యు .

గోదారి సుధీర చెప్పారు...

@చెప్పాలంటే......
థాంక్ యు అండీ .మీ బ్లాగ్ చూసాను .చాలా బాగుంది.

గోదారి సుధీర చెప్పారు...

@ ♛తెలుగు పాటలు♛
thank you ...!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sudheera gaaru..
naa kavitha nacchinanduku .. Thank you very much.