మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

22, జూన్ 2012, శుక్రవారం

మావ - హోం వర్కు



ఊరి నుండి పాపాయి వాళ్ళ చిన్న మావ వొచ్చేడు .అచ్చట్లూ ముచ్చట్లూ అయ్యాక అమ్మ వాడు తెచ్చినవన్నీ చక్క బెట్టుకుంటూ వుంది .పాపాయి హాల్లో మావతో ముచ్చట్లాడతా వుంది.అప్పుడింక పాపాయి ట్యూషన్ కి వెళ్ళాల్సిన టైం కావచ్చింది .ఆందుకని అమ్మ పాపాయిని పిలిచి ''పాపాయ్ ! హోమ వర్క్ రాసేస్నావ బిడ్డా...ట్యూషన్ టైం అయిపొయింది... పోవద్దా ఇంక ''అన్నది . పాపాయి దాని గంతులు వురుకులూ కొనసాగిస్తానే ''అయి పోయిందమ్మా ! వాడు ...శ్రీకాంత్ చేసేస్నాడు ''అని సమాధానం ఇచ్చేసింది.

అప్పుడింక అమ్మ దడుచుకుని ''శ్రీకాంత్ చెయ్యడమేన్దిరా''?అని ప్రశ్నించింది .పాపాయి అట్లాగే గంతులేసుకుంటూ ''అవునమ్మా శ్రీకాంత్ చేసేసాడు ''అని వక్కాణించింది.అప్పుడింక అమ్మ కోపం తెచ్చేసుకుని పాపాయిని వదిలేసి ,కొత్త బంధువని కూడా చూడకుండా ''ఒరేయ్ శ్రీకాంత్ నీకేమన్నా బుద్దుందారా ?దాని హోం వర్క్ నువ్వెట్ట చేస్తావురా ?అని దీ...ర్ఘం తీసింది.

శ్రీకాంత్ ఆ మాటకి ''ఒరేయ్ పాపాయి నీకేమన్నా బుద్దుందారా ?అమ్మకి చెప్తారా రా ఎవరన్నా ?''అని అబద్దపు కోపం పడేసాడు పాపాయి పైన . అమ్మ అప్పుడింక తేరుకుని ''ఎడ్వర్డ్ కనుక్కునేస్తాడేమో రా ''అన్నది .పాపాయి ''ఏం కాదమ్మా వాడి చేత [శ్రీకాంత్ చేత] లెఫ్ట్ హ్యాండ్ తో రాయించా అమ్మా !''అని ట్యూషన్ కి వెళి పోయింది.

**********************

సాయంత్రం పాపాయి ట్యూషన్ నుండి వచ్చాక అమ్మ'' పాపాయ్ ! ఎడ్వర్డ్ కనుక్కున్నాడా రా?''అని బోల్డు ఆసక్తిగా అడిగింది .అప్పుడు పాపాయి '' కనుక్కోలేదమ్మా కానీ హ్యాండ్ రైటింగ్ మరీ పిచ్చిగా మురిగ్గా వుందని తుడిపిచ్చి మళ్ళీ రాయిపించే డమ్మా సారూ ..."అన్నది.

ఆ మాటిని అమ్మా,నాన్న ఒకటే నవ్వుడు.ఆదిని మావ నోచ్చేసుకుని ''నేను బాగ రాస్తావుంటే నువ్వే కదరా అట్ట పిచ్చి పిచ్చిగా రాయమన్నదా...''అనేసాడు .అప్పుడు పాపాయి ''నువ్వు మరీ అంత పిచ్చి హ్యాండ్ రైటింగ్ రాస్తావని నాకేం తెలుసురా ..."అని ముగింపు వాక్యం పలికింది .

4 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పాపాయికి హోంవర్క్ వ్రాయడం తప్పలేదు.(స్కూల్లో)
''నువ్వు మరీ అంత పిచ్చి హ్యాండ్ రైటింగ్ రాస్తావని నాకేం తెలుసురా ..."అని ముగింపు వాక్యం పలికింది
.ముగింపు వాక్యం బాగుంది. పాపాయి సో స్వీట్ :)

సామాన్య చెప్పారు...

thank you vanaja gaaroo !!

సాయి చెప్పారు...

హహ... చాలా బాగుంది అండీ....

గోదారి సుధీర చెప్పారు...

thank you sai gaaroo