మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

17, ఆగస్టు 2012, శుక్రవారం

లెఫ్టిస్ట్ భారత మాత !!!

పాపాయి వాళ్ళ అత్త ది ఎడం చేతి వాటం .పాపాయికి పూర్తిగా అట్లా కాదు .రాతా గీతా కుడి చేతి తోనే చేస్తుంది కానీ ,హటాత్ గా నిద్దర లేపేసి కుడి చేతితో చేయాల్సిన పని ఏదైనా చెప్పామనుకోండి, చక్కగా ఎడమ చేత్తోటి చేస్తుందన మాట .మొన్న ఏమయిందీ ,పంద్రా ఆగస్ట్ వచ్చింది కదా ,అప్పుడు పాపాయికి భాగా పొడవు జుట్టని, స్కూల్ వాళ్ళు పాపాయిని భారత మాతని చేసేసారు .అయ్యాక ఫోటోస్ పంపిస్తే ,లోడ్ చేసి చూద్దును కదా ,పాపాయి ముద్దుగా ఎడమ చేత్తోటి అభయమిస్తూ వుంది ,బోల్డు ముచ్చట పడి, సిస్టం ముందు నుండే ''నీ కూతురు ఎడమ చేత్తో అభయమిస్తుందయ్యోయ్ ''అని పాపాయి వాళ్ళ నానని  గట్టిగా కేకేసి చెప్పానా ,వాళ్ళ నాన చాలా  బిజీగా'' గ్రేట్ ఇండియనో '' ...మరోటో ఏదో ప్రోగ్రాం సీరియస్ గా టీవీలో వాచ్ చేసేస్తూ ,అంతే గట్టిగా అక్కడి నుండే ''లెఫ్టిస్ట్ '' అనిలే  అంటూ  కేకేసాడు  .ఫోటోకి కేప్షన్ సూపరు సూటబుల్ అని షేర్ చేస్తున్నా !

2 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

బావుంది.. ఏ చేయి అయినా భారత మాత మన..మాతే కదా! :) పాపాయి.. మన దేశ కీర్తి పతాక మీలాంటి భావిపౌరాల చేతుల్లోనే ఉంది.. అల్ ది బెస్ట్ కన్నా!

గోదారి సుధీర చెప్పారు...

వనజ గారూ ఎలా వున్నారు ?