మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

15, జనవరి 2013, మంగళవారం

పాపాయి చెప్పిన పాటాలు !

1]అప్పుడో రోజు పాపాయి వాళ్ళ నాన ఆఫీస్ కి ఇద్దరు కోయ దొరలు  వచ్చారు.వాల్లట్లా దేశమంతా తిరుగుతూ వుంటారట .సమ్మక్క సారక్క మతం వాళ్ళది .వరంగల్  నుండి అనగానే నాన ఇహ ఉప్పొంగి పోయి భోజనం చేసి వెళ్ళమని  ఇంటికి అంపించాడు .వాళ్ళు పనిలో పనిగా అమ్మ కి జోస్యం చెప్పడమే కాక పాపాయికి  కూడా  చెప్పటం మొదలెట్టారు .వాళ్ళు మాట్లాడుతుంటే పాపాయి మొహాన మౌనపు  ముసుగు వేసుకుని గమనిస్తూ వుంది .అప్పుడు వాళ్ళన్నారు ''పాపాయి పుస్తకాలు కానీ ,బట్టలు కానీ ఎవరికీ ఇవ్వకూడదు. తీసికెళ్ళి సముద్రంలో పారెయ్యండి .లేకుంటే పాప వృద్దికి నష్టము ''అని  .అంతే పాపాయి చటుక్కున లోపలికి  వెళ్లి పోయింది .వాళ్ళు తిని వెళ్ళాక పాపాయి నాకు గోడపై అది చెక్కిన శిలా శాశనం చూపించింది .అదీ మధ్య కిరస్తానీ అయింది.ఆ కథ ఇంకో సారి చెబుతాను .దాని శిలా ఫలకం ప్రకారం పేద వాళ్లకి దాని పుస్తకాలు ,బట్టలూ ఇవాలి ఇవ్వాలి .సముద్రంలో పడేయకూడదు.అట్లా అని దాన్ని ఎవరూ శాశించకూడదు .చివరికి తన పేరెంట్స్ కూడా 


2] పాపాయికి మొన్నవాళ్ళ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి వెళ్లి వచ్చిన తరువాత నుండి హటాత్ గా జబ్బు చేసింది .నిండా జలుబూ దగ్గూ జ్వరమూ .అవతలేమో 17 న వాళ్ళ స్కూల్ వార్షికోత్సవం .డాక్టర్ కి చూపించుకుంది మందులేసుకుంటుంది .అయినా అనిత ఏం చేసిందీ  ...దిష్టి తగిలిందని చెప్పి దిష్టి తీసేందుకు మంత్రగాడిని తెచ్చింది .పాపాయి ముఖం చిట్లించింది.అయినా ''సరెలేవే వెళ్ళు అనిత ఫీలవుతుంది'' అంటే వెళ్లి నిలుచుంది .ఇవాళ మళ్ళీ వచ్చాడు మంత్ర  గాడు .మంత్రించి ...''ఎక్కడైనా ఏమైనా తినాల్సోస్తే ఒక ముక్క నాలుక కు తాకించి తూ తూ అని పడేసేయ్యి అపుడు దిష్టి తగలదూ ''అన్నాట్ట .ఈ తతంగాన్ని  నేను అటెండ్ చెయ్యలేదు లెండి .పాపాయి లోపటి కొచ్చి ''అమ్మా అట్లా నోట్లో పెట్టి బయట పెట్టడమేమిటి.ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు .నేను మంచులో డాన్స్ ప్రాక్టీస్ చేశా కాబట్టి  అనారోగ్యమయింది .మందులు వేసుకుంటే పోతుంది .ఈ మంత్రాలూ అవంతా నమ్మకమ్మా .బీ  ఏ కమ్యూనిస్ట్ అమ్మా ...''అన్నది .

ఈ మాటలంతా ఒట్టు గా ,నిజంగా  నేను కానీ వాళ్ళ నాన  కానీ నేర్పించలేదు .నాకేమో చాలా డౌట్ వస్తుంది ఇది నా పొట్టలో వుండి రంగ నాయకమ్మ పుస్తకాలు గానీ బట్టీయం వేసిందా అని

[రంగనాయకమ్మ గారు కుటుంబ రావు గారిపై , విరసం పై పెట్టిన విమర్శ ఇక్కడ చదవొచ్చు]


http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2012/dec/24/vividha/24vividha1&more=2012/dec/24/vividha/vividhamain&date=12/24/2012  

4 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పాపాయి ముచ్చట్లు బాగున్నాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు.. చక్కని ఆలోచనలు సహాయ గుణం ఇవన్నీ తనలో పెంపొందుతున్నాయి.
పాపాయికి ఆశ్సీస్సులు .

Dr.Pen చెప్పారు...

It's all in the Genes:-) My blessings to her and good thoughts.

గోదారి సుధీర చెప్పారు...

ఇస్మాయిల్ ,థాంక్ యు .

గోదారి సుధీర చెప్పారు...

వనజ గారూ పాపాయికి మీఆశ్సీస్సు మంచి చేస్తుందని నా బలమైన విశ్వాసం.థాంక్ యు .పాపాయి పెద్ద ెరిగి మంచి అమ్మాయి అనిపించుకోవాలని నా జీవితానికున్న ఒకే ఒక పెద్ద కోరికండీ .