8, అక్టోబర్ 2010, శుక్రవారం
పాపాయి -చలం
సరైన శిక్షణ ఇవ్వాలంటే శిశువు పుట్టగానే శిక్షణ మొదలు పెట్టమంటాడు చలం .బిడ్డకు రెండున్నరేళ్ళదాక జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారంటే ఇంక స్థిరంగా జీవితమంతా శాశ్వతంగా ఉపయోగపడగల ప్రవర్తన ఇచ్చారన్నమాటే కాని మొదటి మూడు సంవత్సరాలు వృధా చేసారా ఇంక వారి పని చాల కష్టమౌతుంది.ఏ శిక్షణ ఐనా ఆరేళ్ళ లోపే అంటాడు .
బిడ్డల చేష్టలను నిదానించి,పరీక్షించి వారికేవిధమైన శిక్షణ మంచిదో ,ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉండాలి .
బిడ్డ పైన ప్రేమ కలిగి ఉండాలి .ప్రేమ ప్రయత్నిస్తే వచ్చేది కాదు .కాని మన సౌఖ్యాలకన్న,బిడ్డనీ బిడ్డ అభివృద్దినీ ఎక్కువగా చూసుకోవాలి ...అంటాడు చలం
పాపాయికి ఓ రోజు చెప్పా ..అసలు తెలుసాచలం బిడ్డల్ని మూడో నెల నుంచీ వేరే గదిలో పడుకోపెట్టాలి .కనీసం పరదా ఐనాఅడ్డముండాలి అన్నాడు నువ్వేమో ఇంకా బొజ్జ పైన పడుకుంటాను అంటున్నావ్ అన్నాను. అది విని పాపాయి ఆహ ..చలం మంచోడే కాదు గిజు బాయే మంచోడు అన్నది .గిజు బాయి పాపాయికి ఎప్పుడొచ్చి ఏంచెప్పాడో కానీ చిన్న పిల్లల్ని ఎలా ఒంటరిగా పడుకోపెట్టాలో అర్థమే కాదు మనసుకు బాధ తోస్తుంది .ఏది మంచిదో ఎలా నిర్ణయించుకోవడం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి